Amit Shah: అమిత్‌ షా పర్యటనలో కలకలం.. తృటిలో తప్పిన భారీ ప్రమాదం

Amit Shah Escaped Major Accident In Begusarai Poll Meeting: ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఎన్నికల ప్రచారంలో హెలికాప్టర్‌ బ్యాలెన్స్‌ కోల్పోయింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 29, 2024, 04:48 PM IST
Amit Shah: అమిత్‌ షా పర్యటనలో కలకలం.. తృటిలో తప్పిన భారీ ప్రమాదం

Amit Shah: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో విస్తృత పర్యటన చేస్తున్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. మరోసారి ఎన్డీయే కూటమిని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా.. 400 సీట్లు సాధించే లక్ష్యం సాధించేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో ఓ రాష్ట్రానికి వెళ్లగా అక్కడ అమిత్‌ షా త్రుటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. హెలికాప్టర్‌ బ్యాలెన్స్‌ కోల్పోవడంతో కలకలం రేపింది. కొద్దిసేపు అనంతరం పరిస్థిఇత చక్కబడడంతో అమిత్‌ షా పర్యటన కొనసాగింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Also Read: Gutha Amith Reddy: బీఆర్‌ఎస్‌ పార్టీకి భారీ ఎదురుదెబ్బ.. కాంగ్రెస్‌లోకి గుత్తా అమిత్‌

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం అమిత్‌ షా బిహార్‌లో పర్యటించారు. బెగసరాయ్‌లో నిర్వహించిన బహిరంగ సభలో అమిత్‌ షా పాల్గొన్నారు. సభ అనంతరం తిరిగి వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. అయితే హెలికాప్టర్‌ బ్యాలెన్స్‌ కోల్పోవడంపై అధికారులు విచారణ చేపట్టారు. కేంద్ర హోం శాఖ మంత్రిగా ఉన్న అమిత్‌ షాకు ఏర్పాటుచేసిన హెలికాప్టర్‌పై వివరాలు ఆరా తీస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Also Read: Once Again KCR CM: ఎంపీ సీట్లు 10-12 వస్తే కేసీఆర్‌ మళ్లీ ముఖ్యమంత్రి: కేటీఆర్‌ ప్రకటన

ప్రమాదానికి ముందు జరిగిన బహిరంగ సభలో అమిత్‌ షా కీలక ప్రసంగం చేశారు. కశ్మీర్‌ అంశంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలపై అమిత్‌ షా కౌంటర్‌ ఇచ్చారు. 'కాంగ్రెస్‌ పార్టీ, లాలూ ప్రసాద్‌ యాదవ్‌లు 70 ఏళ్లుగా ఆర్టికల్‌ 370ను తమ అక్రమ సంతానంగా చూసుకున్నారు. మోదీ రెండోసారి ప్రధానమంత్రి అయ్యాక ఆ ఆర్టికల్‌ను రద్దు చేశారు' అని తెలిపారు. పొరపాటున కూడా ఇండియా కూటమి గెలవదని స్పష్టం చేశారు. భారత్‌కు బలమైన వారు కావాలి.. బలహీనులు కాదని పేర్కొన్నారు. మరోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News