Iqoo Z9X Price: 6000mAh బ్యాటరీ కొత్త iQOO Z9x స్మార్ట్‌ఫోన్‌ రూ.12 వేల లోపే పొందండి.. ఫీచర్స్‌ ఇవే!

Iqoo Z9X Price In India: మే 21 నుంచి iQOO Z9x స్మార్ట్‌ఫోన్‌ అమెజాన్‌లోకి అందుబాటులోకి రాబోతోంది. ఇది రూ.2 వేల వరకు తగ్గింపుతో అందుబాటులోకి రాబోతోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ తెలుసుకోండి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : May 16, 2024, 03:29 PM IST
Iqoo Z9X Price: 6000mAh బ్యాటరీ కొత్త iQOO Z9x స్మార్ట్‌ఫోన్‌ రూ.12 వేల లోపే పొందండి.. ఫీచర్స్‌ ఇవే!

 

Iqoo Z9X Price In India: చైనీస్‌ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ ఐక్యూకి మొబైల్స్‌కి మార్కెట్‌లో మంచి పేరుంది. ప్రీమియం ఫీచర్స్‌తో అతి తక్కువ ధరలోనే లభించడంతో చాలా మంది యువత ఈ స్మార్ట్‌ఫోన్స్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అలాగే కంపెనీ గత కొన్ని సంవత్సరాల నుంచి అతి శక్తివంతమైన ప్రాసెసర్‌ కలిగిన మొబైల్స్‌ను లాంచ్‌ చేస్తూ వస్తోంది. మీరు కూడా ఈ బ్రాండ్‌కి సంబంధించిన స్మార్ట్‌ఫోన్‌ను అతి తక్కువ ధరలోనే కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇది సరైన సమయంగా  భావించవచ్చు. ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన ఇటీవలే లాంచ్‌ అయిన iQOO Z9x మొబైల్‌ డెడ్ చీప్‌ ధరలో లభిస్తోంది. దీంతో పాటు ఈ స్మార్ట్‌ఫోన్‌పై అదనంగా బ్యాంక్‌లకు సంబంధించిన ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి.  

ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ బేస్‌ వేరియంట్‌ 4GB ర్యామ్‌, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఆప్షన్‌తో లభిస్తోంది. ఇది ధర రూ.12,999తో ప్రారంభమవుతుంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ను అన్ని ఈ కామర్స్‌ కంపెనీలు ఫ్లాట్‌ డిస్కౌంట్ ఆఫర్స్‌ పోను ధర రూ.11,999తో విక్రయిస్తోంది. ఇక రెండవ వేరియంట్‌  6GB ర్యామ్‌, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌, మూడవ వేరియంట్‌ 8GB ర్యామ్‌, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో లభిస్తున్నాయి. ఈ రెండు మొబైల్స్‌ రూ.1,000 తగ్గింపుతో లభిస్తున్నాయి. 

ప్రస్తుతం ఈ iQOO Z9x స్మార్ట్‌ఫోన్‌ ఆన్‌లైన్ స్టోర్, ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్‌లలో అందుబాటులో ఉంది. ముఖ్యంగా ఈ మొబైల్‌ను భారీ డిస్కౌంట్‌తో కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది సరైన సమయంగా భావించవచ్చు. వీటి విక్రయాలు మే 21 నుంచి ప్రారంభం కాబోతున్నాయి. దీనిని మొదటి సేల్‌లో భాంగగా కొనుగోలు చేసేవారికి భారీ తగ్గింపు లభిస్తుంది. ముఖ్యంగా  ICICI బ్యాంక్ లేదా SBI కార్డ్ ద్వారా ఈ మొబైల్‌ బిల్ చెల్లిస్తే రూ.1,000 తక్షణ డిస్కౌంట్‌ లభిస్తుంది. దీంతో పాటు 8 ర్యామ్‌ కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేవారికి అదనంగా రూ.600 వరకు తగ్గింపు లభిస్తుంది.   

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
44W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్
6000mAh కెపాసిటీ బ్యాటరీ
IP64 జస్ట్, వాటర్ రెసిస్టెన్స్‌
120Hz రిఫ్రెష్ రేట్‌
6.72 అంగుళాల IPS LCD డిస్‌ప్లే
Qualcomm Snapdragon 6 Gen 1 ప్రాసెసర్ 
Android 14 ఆధారిత FuntouchOS
ఎక్స్‌టెండెడ్ ర్యామ్‌ ఫీచర్‌
50MP డ్యూయల్ కెమెరా సెటప్
8MP సెల్ఫీ కెమెరా 
6000mAh బ్యాటరీ 
44W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News