Akshaya tritiya 2024: అక్షయ తృతీయ రోజే లక్మీనారాయణ యోగం.. ఈ మూడు రాశులకు అఖండ ధనయోగం..

Akshaya tritiya 2024: అక్షయ తృతీయ రోజున ఈరోజున అత్యంత దివ్యమైన యోగం ఏర్పడుతుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు. ఇది వందల ఏళ్లకు ఒకసారి ఏర్పడుతుందని కూడా పండితులు చెబుతున్నారు. ఈరోజున మూడు రాశుల వారి జీవితాల్లో ఊహించి గొప్ప శుభయోగం జరుగుతుందని కూడా సూచిస్తున్నారు.  

Written by - Inamdar Paresh | Last Updated : Apr 29, 2024, 03:55 PM IST
  • అక్షయ తృతీయరోజు అరుదైనయోగం..
  • ఈ రాశులకు పట్టిందల్లా బంగారమే..
Akshaya tritiya 2024: అక్షయ తృతీయ రోజే లక్మీనారాయణ యోగం.. ఈ మూడు రాశులకు అఖండ ధనయోగం..

Laxminaraya yoga in Akshaya tritiya 2024: జ్యోతిష్య పండితుల ప్రకారం కొన్ని యోగాలు, తిథులు మనిషీ జీవితంలో ఊహించి గొప్పయోగాన్ని తెచ్చిపెడుతుంటాయి. ముఖ్యంగా అక్షయ తృతీయను ఎంతో మంచి తిథిగా జ్యోతిష్యులు చెబుతుంటారు. ఈరోజున మనం ఏది కొనుగోలు చేసిన కూడా అది అక్షయ సంపదలను ఇస్తుందని చెబుతుంటారు. అందుకే ఈరోజున చాలా మంది కొంచెమైన బంగారం ను కొనుగోలు చేస్తారు. ఈ ఏడాది అక్షయ తృతీయ మే 10 న  వస్తుంది. దీంతో ఇప్పటి నుంచి అనేక మంది దీని వల్ల కలిగే ప్రయోజాల గురించి ఆరాతీస్తున్నారు. అదే విధంగా ఈసారి అక్షయ తృతీయ రోజునే అత్యంత అరుదుగా సంభవించే లక్మీనారాయణ యోగం కూడా సంభవిస్తుంది. దీంతో పండితులు కూడా ఇలాంటి శుభఘడియలను తమ జీవితంలో అస్సలు మిస్ కాకుండా చూసుకోవాలంటూ కూడా సూచిస్తున్నారు. అక్షయ తృతీయ అనేది ఈసారి మే 10 వ తేదీన వస్తుంది.

Read More: Malavya Raja Yoga 2024: మాళవ్య రాజయోగం.. మే తొలివారంలో ఈ రాశులవారికి డబ్బులే డబ్బులు..

వైశాఖ మాసం విష్ణుదేవుడికి అత్యంత ఇష్టమైన మాసాల్లో ఒకటిగా చెబుతుంటారు. ఈరోజున ఏ పూజ చేసిన, ఏ వ్రతాలు ఆచరించిన కూడా అది అక్షయమై ఫలితాలను ఇస్తుందని పండితులు చెబుతుంటారు. ఈసారి  అరుదైన లక్మీనారాయణ యోగం వల్ల మూడు రాశుల వారి జీవితాల్లో ధనం తాండం చేయబోతుందని చెప్పవచ్చు.

 

మిథునం:

మిథున రాశి వారిలో లక్మీనారాయణ యోగం జీవింలో ఊహించని మార్పులను తీసుకొస్తుంది. దీని వల్ల వారు ఎన్నోరోజులుగా ఎదురు చూస్తున్న శుభఘడియలు వీరికి వచ్చినట్లు చెప్పాలి. అఖండ ధనయోగంతో పాటు,నచ్చిన అమ్మాయితో పెళ్లి సంబంధం కుదురుతుంది. వీరు ఏ కార్యం తలపెట్టిన కూడా అది ఎలాంటి అడ్డంకులు లేకుండా పూర్తవుతుంది. కోర్టుకేసులలో విజయం సాధిస్తారు. లైఫ్ అంతా ఎంతో హ్యాపీగా ఉంటుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. 

కర్కాటకం:

కర్కాటక రాశి వారికి కూడా ఈ యోగం అత్యంత అద్భుతంగా పనిచేస్తుంది. దీని ప్రభావం వల్ల జీవితంలో ఒక్కసారిగా మంచి మార్పులు చోటుచేసుకుంటాయి. ప్రభుత్వ ఉద్యోగం పొందేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాకుండా.. వీరికి తండ్రివైపు నుంచి ఆస్తులు రావడం జరుగుతుంది.అంతేకాకుండా విదేశాలకు వెళ్లే యోగం కూడా కన్పిస్తుంది. సోదరులతో ఏర్పడిన విరోధాలు, బంధువులతో ఏర్పడిన గోడవలు సమసిపోతాయి. కుటుంబంమంతా సంతోషకర వాతావరణం నెలకొని ఉంటుంది.

కన్యా:

కన్యా రాశి వారికి లక్మీనారాయణ యోగం వల్ల మంచి అమ్మాయితో పెళ్లి కుదురుతుంది. లైఫ్ లో ఉన్నత స్థానానికి ఎదురగుతారు. అంతేకాకుండా.. ఇప్పటి వరకు మీరు కాదని వదిలేసిన పనులు ఒక్కొక్కటిగా పూర్తవుతాయి. లాటరీలు తగిలే అవకాశం కూడా ఉంది. మంచి ఇల్లును కొనుగోలు చేస్తారు. అంతేకాకుండా వాహాన యోగం కూడా ఉంది. రియల్ ఎస్టెట్ రంగంలో ఉన్న వారికి విపరీతంగా డబ్బుల లాభం ఉంటుంది. మీరు తలపెట్టిన పనులన్నిఇట్టేపూర్తిఅయిపోతుంటాయి. 

Read More: Monday Lord Shiva Remedies: శివుడిని సోమవారం ఇలా పూజించండి.. మీకు కలిగే రాజయోగాన్ని ఎవ్వరు ఆపలేరు..

అక్షయ తృతీయ పూజావిధానం:

ఈరోజున ముఖ్యంగా లక్మీనారాయణ యోగం ఏర్పడటం వల్ల అమ్మవారిని కుంకుమతో అభిషేకం చేయాలి. కమలాలతో అర్చించాలి. ఎరుపురంగు పూలు, పాయసం, చక్కెర పొంగలి, మొదలైనవి నైవేద్యంగా సమర్పించాలి. లలితా పారాయణం, విష్ణుసహాస్రనామా పారాయణం చేసుకుంటే మన జీవితంలో అంతా మంచే జరుగుతుంది. ఈ  రోజున కొంచెమైన బంగారం కొనుగోలు చేయాలి. అంతేకాకుండా.. కుండలో నీళ్లను నింపి అది పండితులకు దానంగా ఇవ్వాలని చెబుతుంటారు. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News