BRS KTR: బీఆర్ఎస్ కు వరుస షాక్ లు.. కేటీఆర్ పై కేసు నమోదు..

Telangana Police: బీఆర్ఎస్ కు వరుస షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే పార్టీలోని కీలకనేతలంతా వేరే పార్టీలోకి వెళ్లి జాయిన్ అవుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న పదేళ్లపాటు పదవులను,హోదాలను అనుభవించి తీరా ఇప్పుడు పార్టీని వీడివెళ్లిపోవడం పట్ల గులాబీనేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.   

Written by - Inamdar Paresh | Last Updated : Mar 29, 2024, 10:39 AM IST
  • గులాబీ బాస్ కు వరుస ట్విస్ట్ లు..
  • వివాదాస్సదంగా మారిన కేటీఆర్ వ్యాఖ్యలు..
BRS KTR: బీఆర్ఎస్ కు వరుస షాక్ లు.. కేటీఆర్ పై కేసు నమోదు..

Police Filed Case Against KTR Over Aggressive Comments On CM Revanth Reddy:  తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అందించేదిశగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే ఆరుగ్యారంటీలలో పథకాలు అమలు చేయడమే టార్గెట్ గా పనిచేస్తుంది. ఇదిలా ఉండగా.. బీఆర్ఎస్ హాయంలో జరిగిన అవినీతి,కుంభకోణాలు,నీటి విషయంలో జరిగిన అవినీతిని బైటకు తీసేలా అధికారులు చర్యలు చేపట్టారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ శాఖలను ప్రక్షాళన చేసే కార్యక్రమం చేపట్టారు. దీనిలో భాగంగానే అప్పటికాలంలో అవినీతికి పాల్పడిన అధికారులను, వారు చేసిన మోసాలపై ఉక్కుపాదంమోపుతున్నారు. ఇక తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తీవ్ర కలకలంగా మారిన విషయం తెలిసిందే. దీనిలో ఇప్పటికే పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు.

Read More: Viral Video: సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన.. వారణాసిలో భర్త కళ్లముందే భార్యను..

ఈ ఘటనలో సీనియర్ పోలీసుల అధికారులను అరెస్టు చేశారు. ఇక దేశంలో ఒకవైపు కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. దేశ రాజధానిలో లిక్కర్ స్కామ్ కేసు తీవ్రసంచనలంగా మారిన విషయం తెలిసిందే. ఏకంగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సైతం దీనిలో ఈడీ అధికారులు విచారిస్తున్నారు. ఇక తెలంగాణలో ఎమ్మెల్సీ కవిత అరెస్టు, ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరో దుమారంగా మారింది. అప్పట్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం.. పోలీసులను అడ్డంపెట్టుకుని అపోసిషన్ నాయకుల ఫోన్ లు, బిజినెస్ మెన్ ల కాల్స్ లను ట్యాపింగ్ చేసి, బెదిరింపులకు పాల్పడి కోట్లాది రూపాయలు వసూలు చేసినట్లు కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు.

ఇదిలా ఉండగా.. బీఆర్ఎస్ కు ప్రస్తుతం చోటు చేసుకుంటున్న సంఘటనలు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయని చెప్పవచ్చు. ఒకవైపు ఎమ్మెల్సీ కవిత అరెస్టై తీహార్ జైలులో ఉండటం ఒకవైపు.., మరోవైపు బీఆర్ఎస్ నేతలు వరుస కట్టి కాంగ్రెస్ పార్టీలోకి చేరిపోతున్నారు. ఇదిలా ఉండగా.. మరోవైపు తాజాగా, బీఆర్ఎస్ కు చెందిన మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Read More: King Cobra Blood: కింగ్ కోబ్రా రక్తం తాగడానికి పొటెత్తిన అమ్మాయిలు.. కారణం ఏంటో తెలుసా..?

సీఎం రేవంత్ పై, కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేంగా... పీసీసీ సభ్యుడు బత్తిని శ్రీనివాస రావు హానుమకొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఎం రేవంత్ పై తప్పుడు ఆరోపణలు చేస్తూ, శాంతి భద్రతలకు విఘాతం కల్గించే వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసును బంజారా హిల్స్ పోలీసు స్టేషన్ కు బదిలీ చేస్తామని పోలీసులు పేర్కొన్నారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News