TS EAMCET 2024 Hall Ticket Live: ఎంసెట్ హాల్ టికెట్లు విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

TS EAMCET 2024 Hall Ticket Live Updates: ఇంటర్ పాస్ అయిన విద్యార్థులకు గుడ్‌న్యూస్. తెలంగాణ ఎంసెట్ హాల్ టికెట్లు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. విద్యార్థులు https://eapcet.tsche.ac.in/ వెబ్‌సైట్ ద్వారా తమ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. లైవ్ అప్‌డేట్స్ ఇక్కడ క్లిక్ చేయండి.  

Written by - Ashok Krindinti | Last Updated : Apr 29, 2024, 04:25 PM IST
TS EAMCET 2024 Hall Ticket Live: ఎంసెట్ హాల్ టికెట్లు విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి
Live Blog

TS EAMCET 2024 Hall Ticket Download: తెలంగాణ ఈఏపీసెట్‌ (ఎంసెట్‌) 2024 హాల్‌టికెట్లు నేడు విడుదల కానున్నాయి. ఇంటర్ ఫలితాలు వచ్చేయడంతో ఎంసెట్ పరీక్షకు విద్యార్థులు సిద్ధమయ్యారు. TS EAPCET 2024 పరీక్షకు దాదాపు 3.5 లక్షల మందికి పైగా అప్లై చేశారు. ఇంజినీరింగ్‌ విభాగానికి పరీక్షలకు 2.5 లక్షల మంది, అగ్రికల్చర్‌, ఫార్మా పరీక్షలకు 98 వేల మందికి పైగా విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే రూ.5 వేల అపరాధ రుసుముతో మే 1వ తేదీ వరకు ఇంకా దరఖాస్తు చేసుకునేందుక అవకాశం ఉంది. షెడ్యూల్ ప్రకారం.. మే 7, 8, 9, 10, 11వ తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. కంప్యూటర్ ఆధారిత (CBT) మోడ్‌లో మూడు గంటల పాటు నిర్వహించనున్నారు. ఎంసెట్ హాల్ టికెట్ డౌన్‌లోడ్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి..? ఎక్కడ డౌన్‌లోడ్ చేసుకోవాలి..? లైవ్ అప్‌డేట్స్ కోసం ఇక్కడ ఫాలో అవ్వండి. 
 

29 April, 2024

  • 16:24 PM

    TS EAMCET 2024 Hall Ticket Released Live Updates: తెలంగాణ ఈఏపీసెట్‌ (ఎంసెట్‌)- 2024 హాల్‌టికెట్లు ఆన్‌లైన్‌లో రిలీజ్ అయ్యాయి. అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం హాల్ టికెట్స్‌ను eapcet.tsche.ac.in/ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
     

  • 15:28 PM

    TS EAMCET 2024 Hall Ticket Download Live Updates: ఎంసెట్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు eapcet.tsche.ac.inలో మాక్ టెస్ట్‌లకు హాజరుకావచ్చు. పరీక్షా సరళిని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్షను ఎలా రాయలో విద్యార్థులకు ఒక ఐడియా వస్తుంది. 

  • 14:25 PM

    TS EAMCET 2024 Hall Ticket Download Live Updates: TS EAMCET పరీక్షకు సంబంధించిన ఏదైనా సహాయం కోసం tseapcethelpdesk2024@jntuh.ac.inకు ఇమెయిల్ చేయవచ్చు లేదా 7416923578, 7416908215 నంబర్లకు కాల్ చేయవచ్చు. హెల్ప్‌లైన్‌లు ఆదివారం మినహా 10.00 AM నుంచి 5.00 PM మధ్య అందుబాటులో ఉంటాయి.
     

  • 14:10 PM

    TS EAMCET 2024 Hall Ticket Download Live Updates: TS EAPCET 2024 ఇంజనీరింగ్ విభాగం హాల్ టిక్కెట్ డౌన్‌లోడ్ ఆన్‌లైన్‌లో మే 1వ తేదీ నుంచి అందుబాటులో ఉంటాయని eamcet.tsche.ac.in వెబ్‌సైట్‌లో అధికారులు పేర్కొన్నారు.  
     

  • 13:30 PM

    TS EAMCET 2024 Hall Ticket Download Live Updates: హాల్ టికెట్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి.

    ==> ముందుగా eamcet.tsche.ac.in  అధికారిక వెబ్‌సైట్లోకి వెళ్లండి.
    ==> హాల్ టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి ప్రత్యేకంగా హోమ్‌పేజీలో ఉన్న లింక్‌పై క్లిక్ చేయండి.
    ==> అవసరమైన ఇతర ఆధారాలతో పాటు మీ రిజిస్ట్రేషన్ నంబర్‌ను ఎంటర్ చేయండి.
    ==> TS EAMCET 2024 హాల్ టికెట్ మీ స్క్రీన్‌పై ప్రత్యక్షమవుతుంది.
    ==> ఆ తరువాత హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

     

Trending News