Loksabha Elections 2024: గులాబీ బాస్ కేసీఆర్ కు మరో బిగ్ షాక్.. నోటీసులు జారీ చేసిన ఎన్నికల కమిషన్..

Election commission: ఎన్నికల కమిషన్ మాజీ సీఎంకేసీఆర్ పై సీరియస్ అయ్యింది. ఆయన సిరిసిల్లలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం రేవంత్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వంపై కూడా తీవ్రమైన ఆరోపణలు చేశారు. దీనిపై కాంగ్రెస్ నేత నిరంజన్ ఈసీ కి ఫిర్యాదు చేశారు. 

Written by - Inamdar Paresh | Last Updated : Apr 17, 2024, 02:25 PM IST
  • మాజీ సీఎంకు ట్విస్ట్ ఇచ్చిన ఎన్నికల కమిషన్..
  • 18 వ తేదీ ఉదయం 11 వరకు డెడ్ లైన్..
Loksabha Elections 2024: గులాబీ బాస్ కేసీఆర్ కు మరో బిగ్ షాక్.. నోటీసులు జారీ చేసిన ఎన్నికల కమిషన్..

Elections commission Issued Notice To Former CM KCR: తెలంగాణలో రాజకీయాలు సమ్మర్ లో మరింత హీట్ ను పుట్టిస్తున్నాయి. ఎలాగైన లోక్ సభ ఎన్నికలలో గెలవాలని బీఆర్ఎస్ పట్టుదలగా ఉంది. బీఆర్ఎస్ కు ప్రజల్లో ఆదరణ తగ్గలేదని చెప్పేందుకు ప్రయత్నం చేస్తుంది. అదే విధంగా బీఆర్ఎస్ పార్టీని వదిలి పెట్టి వెళ్లిన నాయకులకు బుద్ది చెప్పాలని పావులుకదుపుతుంది. ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి వెళ్లిపోయి.. కాంగ్రెస్ టికెట్ పొందిన నేతలను టార్గెట్ గా చేసుకుని మాజీ సీఎం రేవంత్ పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో గులాబీబాస్ అవకాశం దొరికినప్పుడల్లా సీఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని తనదైన స్టైల్ లో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈక్రమంలో ఏప్రిల్ 5 న సిరిసిల్లాలో బీఆర్ఎస్ ప్రజాఆశీర్వాద సభలో మాజీ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేషించి ఆరుగ్యారంటీలు ఏమయ్యాయని దుయ్యబట్టారు.

Read More: Sri Rama navami 2024: శ్రీరామ నవమి రోజు రాముడి కన్న ముందు వీరిని పూజించాలంటా.. ఈ రహస్యం మీకు తెలుసా..?

రైతు రుణమాఫీ, కరెంట్ కోతలపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా... కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కరెంట్ కోతలు ఎక్కువయ్యాయని, ప్రజలు కూడా కాంగ్రెస్ ను వద్దనుకుంటన్నారని వ్యాఖ్యలు చేశారు.  సీఎం రేవంత్ రెడ్డి లోక్ సభ ఎన్నికలు అవ్వగానే.. బీజేపీలోకి చేరిపోతారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మరికొన్ని నెలల్లో కనుమరుగైపోతుందన్నారు. ప్రజలు కూడా కాంగ్రెస్ ను ఛీదరించుకుంటున్నారని వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా.. లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి కనీసం రెండు, మూడు సీట్లు రావడం గొప్ప విషయమన్నారు. కాంగ్రెస్ నేతలు రైతు బంధు అడిగితే చెప్పుతో కొడుతామంటున్నారు. ప్రజలను అస్సలు పట్టించుకోవట్లేదని మాజీ సీఎం కేసీఆర్ అన్నారు.

ఈక్రమంలోనే ఆయన చేసిన వ్యాఖ్యలపై.. కాంగ్రెస్ నేత నిరంజన్ ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఎన్నికల కమిషన్, సిరిసిల్లలో జరిగిన సమావేశంలో కేసీఆర్ వ్యాఖ్యలపై , కలెక్టర్ లలో ఒక నివేదిక తెప్పించుకున్నట్లు సమాచారం. దాని ఆధారంగానే తాజాగా ఈసీ.. మాజీ సీఎం కేసీఆర్ కు నోటీసులు జారీ చేసింది. సిరిసిల్లలో పబ్లిక్ మీటింగ్ లో ఆయన వ్యాఖ్యలపై 18 వతేదీ ఉదయం 11 గంటల వరకు వివరణ ఇవ్వాలని కూడా డెడ్ లైన్ విధించింది. ప్రస్తుతం ఈ ఘటన బీఆర్ఎస్ వర్గాలకు బిగ్ షాక్ గా మారింది.

Read More:Komatireddy Venkat Reddy: బిడ్డా కేసీఆర్ పునాదులతో సహాలేపేస్తాం.. పండుగ పూట మంత్రి కోమటి రెడ్డి మాస్ వార్నింగ్..

ఇక మరోవైపు కేసీఆర్ సంగారెడ్డి సభలో కూడా సీఎం రేవంత్ రెడ్డి పై మండిపడ్డారు. లోక్ సభ ఎన్నికలలో... కాంగ్రెస్‌కు 2 సీట్ల కంటే ఎక్కువ రావు అని సర్వే రిపోర్ట్లు వచ్చాయి.. అన్ని జిల్లాల్లో రైతులు తిరగబడుతున్నారు, రేవంత్ రెడ్డి భయం చూస్తే ఈ ప్రభుత్వం యేడాది కూడా ఉండేటట్లు కన్పించడంలేదంటూ మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ లో కరెంట్ కోతలు ఎక్కువయ్యాయని, 9 ఏండ్లల్లో కనురెప్ప కొట్టేంత సేపైనా కరెంటు పోయిందా?.. అని గుర్తు చేశారు.కరెంటు పోకుండా ఉండాలంటే పార్లమెంట్ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ గెలవాలని కేసీఆర్ అన్నారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News