Shani Dev: శనిదేవుడి యెుక్క 'శష మహాపురుష యోగం'.. జనవరిలో వీరికి తిరుగులేని అదృష్టం..

Saturn Transit 2023: కలియుగ న్యాయమూర్తి అయిన శనిదేవుడు సంక్రాంతి తర్వాత కుంభరాశిలోకి వెళ్లనున్నాడు. ఈ సమయంలో శని అరుదైన యోగాన్ని చేస్తున్నాడు. ఇది కొంత మందికి శుభప్రదంగా ఉంటుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 5, 2023, 08:29 AM IST
Shani Dev: శనిదేవుడి యెుక్క 'శష మహాపురుష యోగం'..  జనవరిలో వీరికి తిరుగులేని అదృష్టం..

Shani Gochar in Kumbh 2023: ఆస్ట్రాలజీలో నెమ్మదిగా కదిలే గ్రహాల్లో శని ఒకటి. ఫ్లానెట్స్ అన్నింటిలోనూ మనల్ని ఇబ్బందిపెట్టే గ్రహంగా శనిదేవుడిని భావిస్తారు. శని అనుగ్రహం ఉంటే దరిద్రుడి కూడా ధనవంతుడిగా మారుతాడు. మూడు దశాబ్దాల తర్వాత శనిదేవుడు జనవరి 17, 2023న తన సొంత రాశి అయిన కుంభరాశిలో త్రికోణ స్థితిలో సంచరించనుంది. కుంభంలో శని ప్రవేశం వల్ల 'శష మహాపురుష యోగం' (Sasha Mahapurusha Yoga) ఏర్పడుతుంది. శని సంచారం వల్ల మూడు రాశులవారు అపారమైన ప్రయోజనాలను పొందనున్నారు. ఆ లక్కీ రాశులేంటో తెలుసుకుందాం. 

శని సంచారం ఈరాశులకు అదృష్టం
వృషభం (Taurus)- ఈ రాశివారికి శనిదేవుడు చాలా శుభఫలితాలను ఇస్తాడు. ఎందుకంటే వృషభ రాశికి అధిపతి అయిన శుక్రుడు శనిదేవుడికి అత్యంత మిత్రుడు. శని మహాపురుష రాజయోగం వల్ల మీరు ఏదైనా పెద్ద పదవిని పొందే అవకాశం ఉంది. విదేశాల నుండి మీకు డబ్బు లభించే అవకాశం ఉంది. పెళ్లికాని యువకులకు మీకు వివాహం కుదిరే అవకాశం ఉంది. 
తుల రాశి (Libra)- తులారాశికి అధిపతి కూడా శుక్రుడే కాబట్టి శని రాశి మారడం వల్ల ఈ రాశి వారికి చాలా పురోగతిని సాధిస్తారు. ఇప్పటి వరకు కెరీర్‌లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ప్రభుత్వ రంగం నుండి ప్రయోజనం పొందుతారు. వ్యాపారస్తులు వ్యాపారాన్ని విస్తరిస్తారు. బిజినెస్ లో భారీగా లాభాలు వస్తాయి. 
ధనుస్సు (Sagittarius)- శని సంచారం ఈ రాశి వారికి చాలా బలమైన యోగాన్ని కలిగిస్తుంది. ఈ వ్యక్తులకు అన్ని అడ్డంకులు మరియు బాధలు తొలగిపోతాయి. సమాజంలో గౌరవం పొందుతారు. రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు విజయాన్ని సాధిస్తారు. మీరు చాలా కష్టమైన పనిని కూడా ధైర్యం మరియు సంకల్ప బలంతో పూర్తి చేస్తారు.

Also Read: Rahu Vakri 2023: తిరోగమన రాహువు సంచారం.. ఈ 3 రాశుల ఆదాయం రెట్టింపు అవ్వడం పక్కా.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U   

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News