Guru Gochar 2023: ఏప్రిల్ 27న మేషరాశిలో ఉదయించనున్న గురుడు.. ఆ 5 రాశులకు దశ తిరగటం ఖాయం

Jupiter Rise in Aries 2023: హిందూ జ్యోతిష్యం ప్రకారం వివిధ గ్రహాల గోచారం జరిగినట్టే గ్రహాలు ఉదయించడం, అస్తమించడం ఉంటుంది. దీని ప్రభావం మొత్తం 12 రాశులపై వేర్వేరుగా పడుతుంది. గురు గ్రహం ఉదయించడం వల్ల 5 రాశులకు అదృష్టంగా మారనుంది.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Apr 7, 2023, 08:38 AM IST
Guru Gochar 2023: ఏప్రిల్ 27న మేషరాశిలో ఉదయించనున్న గురుడు.. ఆ 5 రాశులకు దశ తిరగటం ఖాయం

Jupiter Rise in Aries 2023: జ్యోతిష్యం ప్రకారం గురు గ్రహాన్ని దేవ గురువుగా పిలుస్తారు. అందుకే గురు గ్రహం రాశి పరివర్తనం లేదా ఉదయించడం లేదా అస్తమించడం అనేది వివిధ రాశులపై కీలక ప్రభావాన్ని చూపిస్తుంది. గురు గ్రహం మేషరాశిలో ప్రవేశించనుండటం 5 రాశులపై అద్భుత ప్రభావాన్ని చూపిస్తుంది. ఆ వివరాలు మీ కోసం..

దేవతల గురువుగా భావించే గురుడిని హిందూ పంచాంగం ప్రకారం శుభగ్రహంగా భావిస్తారు. గురుడి ఆశీర్వాదం లేకుండా ఏ రాశి జాతకం జీవితంలో కూడా కీర్తి, అనుకూల ఫలితాలు లభించవని అంటారు. జ్యోతిష్యం ప్రకారం ఎవరి జాతకం జన్మ కుండలిలో గురుడు పటిష్టంగా ఉంటాడో ఆ వ్యక్తులకు చాలా ప్రయోజనాలున్నాయి. ప్రతిరంగంలో విజయం లభిస్తుంది. శక్తివంతమైన వ్యక్తులతో సంబంధాలు కొనసాగించగలరు. గురుడు తన రాశిలో మారగానే ఆ ప్రభావం మొత్తం 12 రాశులపై వేర్వేరుగా పడుతుంటుంది. ఏప్రిల్ 27వ తేదీన గురుడు మేషరాశిలో ఉదయించనున్నాడు. ఫలితంగా 5 రాశులవారికి ఉద్యోగ, వ్యాపారాల్లో ఊహించని అద్భుత లాభాలు కలగనున్నాయి. 

ధనస్సు రాశి

గురు గ్రహం ఉదయించడం ధనస్సు రాశి జాతకుల కెరీర్ దూసుకుపోనుంది. ఉద్యోగంలో పదోన్నతితో పాటు కొత్త బాధ్యతలు లభిస్తాయి. వ్యాపారం చేసేవారికి గురుడు  మేషరాశిలో ఉదయించడం లాభాల్ని ఇస్తుంది. మీ కష్టం ఆధారంగా వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకెళ్తారు. ఈ సమయంలో కొత్త వ్యాపారాలు కూడా ప్రారంభించవచ్చు.

కుంభ రాశి

ఈ రాశి ప్రజలు సమాజంలో ఇతరులతో మంచి సంబంధాలు కొనసాగిస్తారు. ఈ సమయంలో కోర్కెలు నెరవేరుతాయి. ఈ రాశి జాతకులు డబ్బు బాగా సంపాదిస్తారు. ఇందుకు సంబంధించి మార్గాలు తెర్చుకుంటాయి. పని నిమిత్తం ఎక్కువ ప్రయాణాలు తప్పవు. కానీ విజయం సాధిస్తారు. ఆర్ధికపరంగా ఇబ్బందులు ఉండవు. 

మేషరాశి

మేషరాశి జాతకులకు గురుగ్రహం ఉదయించడం అదృష్టంగా మారనుంది. కెరీర్ లో పూర్తిగా లాభిస్తుంది. పదోన్నతి లభించే అవకాశాలున్నాయి. పై అధికారులు మిమ్మల్ని ప్రశంసిస్తారు. కీలకమైన నిర్ణయాలు తీసుకోగలరు. దీర్ఘకాలం ఆధ్యాత్మిక యాత్రలకు వెళ్లే అవకాశాలున్నాయి. ఆర్ధికపరమైన ఇబ్బందులు ఉండవు. ఆరోగ్యం బాగుంటుంది.

మిధున రాశి

మిధున రాశి జాతకుల్లో వ్యాపారం చేసేవారికి గురుడు ఉదయించడం లాభదాయకం కానుంది. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించగలరు. ఒకటి కంటే ఎక్కువ వ్యాపారాలు చేయగలరు. మీ కష్టం, శ్రమతో పోటీదారులకు సవాలుగా మారతారు. ఉద్యోగాలకు కొత్త కొత్త అవకాశాలు లభిస్తాయి. విదేశాలకు వెళ్లే అవకాశాలు దక్కుతాయి. ఇది మీ భవిష్యత్తులో పాజిటివ్ పరిణామాలు తీసుకొస్తుంది. 

సింహ రాశి

సింహ రాశి జాతకులకు పూర్వీకుల సంపద చాలా లాభం కల్గించనుంది. వ్యాపారంలో లాభనష్టాలు రెండూ ఉంటాయి. కొత్తవాటిలో పెట్టుబడి పెట్టేముందు ఆలోచించడం మంచిది. జీవిత భాగస్వామి సంపూర్ణ సహకారం లభిస్తుంది. సంతానం విషయంలో నిశ్చింతగా ఉండండి. కొత్త కొత్త విధానాలు అవలంభిస్తూ వ్యాపారం విస్తృతం చేస్తారు. ఆధ్యాత్మికత పెరుగుతుంది. 

Also Read: Surya Rashi Gochar 2023: 2023లో మొదటి సూర్య గ్రహణం.. ఈ 7 రాశుల వారికి మంచి రోజులు మొదలు! ఊహించని ధనలాభం

Also Read: Hanuman Janmotsav 2023: హనుమాన్ జయంతి నుంచి భారీ లాభాలు పొందబోయే రాశులవారు వీరే, ఇక లాభాలే లాభాలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News