Budh Pradosh Vrat 2023: బుధ ప్రదోష వ్రతం ఎప్పుడు? శివారాధన సమయం తెలుసుకోండి..

Lord shiva: రేపే జ్యేష్ట మాసంలోని తొలి ప్రదోష వ్రతం.  ఇది బుధవారం వస్తుంది కాబ్టటి దీనిని బుధ ప్రదోష వ్రతమని పిలుస్తారు. శివుడి అనుగ్రహం పొందడానికి ఇది చాలా మంచి రోజు. మహాదేవుడిని ఆరాధించడానికి శుభముహూర్తం ఎప్పుడో తెలుసుకోండి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : May 16, 2023, 12:33 PM IST
Budh Pradosh Vrat 2023: బుధ ప్రదోష వ్రతం ఎప్పుడు? శివారాధన సమయం తెలుసుకోండి..

Budh Pradosh Vrat 2023 date: హిందూమతంలో ప్రదోష వ్రతానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈరోజున శివయ్యకు (Lord Shiva) పూజలు చేస్తారు. ఈ ప్రదోష వ్రతాన్ని ప్రతి నెల కృష్ణ మరియు శుక్ల పక్ష త్రయోదశి తిథిలో ఆచరిస్తారు. జ్యేష్ఠ మాసంలో మొదటి ప్రదోష వ్రతం మే 17, బుధవారం నాడు రాబోతుంది. ఈరోజున శివారాధనకు శుభముహూర్తం, పంచకం, భద్రకాల సమయాలను తెలుసుకోండి. 

శివారాధన సమయం
పంచాంగం ప్రకారం, జ్యేష్ట మాసంలోని కృష్ణ పక్షంలోని త్రయోదశి తిథి మే 16న రాత్రి 11:36 గంటలకు ప్రారంభమై.. మే 17న రాత్రి 10:28 గంటలకు ముగుస్తుంది. బుధ ప్రదోష వ్రతం (Budh Pradosh Vrat 2023) రోజున ప్రదోష కాల సమయంలో అంటే సాయంత్రం 07:06 నుండి 09:10 వరకు శివారాధనకు మంచి సమయం. దీంతో పాటు ఇదే రోజు రాత్రి 09.18 గంటల వరకు ప్రత్యేక ఆయుష్మాన్ యోగం కూడా ఉంది. ఈ యోగంలో పూజలు చేయడం వల్ల కూడా మంచి ఫలితాలను పొందుతారు. బుధ ప్రదోష వ్రతం పాటించే వారికి దేనికీ లోటు ఉండదు. మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీరు అఖండ సౌభాగ్యం పొందుతారు. 

పంచకం, భద్ర సమయం
ప్రదోష వ్రతం మొదటి రోజున భద్ర మరియు పంచకాలను పాటిస్తారు. ఈ రోజు మే 18వ తేదీ రాత్రి 10.28 నుండి ఉదయం 05.29 వరకు భద్ర కాలం ఉంటుంది. అలాగే పంచకం ఉదయం 05.29 నుండి 07.39 వరకు ఉంటుంది. ఈ రెండు అశుభ సమయాలలో కొన్ని పనులు చేయడం నిషేధం.

Also Read: Rahu Transit 2023: త్వరలో రాహువు సంచారం.. ఈ 3 రాశులకు ఊహించని ధనలాభం.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News