Viral Video: నువ్వు తోపు భయ్యా.. జేసీబీ డ్రైవర్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా.. వీడియో వైరల్..

JCB Operator: జేసీబీ నడిపించాలంటే ఎంతో అనుభవం ఉండాలి. పోలాల్లో, పునాదుల తవ్వకాలలో, కాల్వలు నిర్మించేటప్పుడు జేసీబీలను ఉపయోగిస్తుంటారు. దీన్ని ఆపరేట్ చేయడం అంత ఈజీగా కాదు. ప్రస్తుతం ఒక డ్రైవర్ జేసీబీని కాలువ దాటించే వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

Written by - Inamdar Paresh | Last Updated : May 11, 2024, 01:15 PM IST
  • జేసీబీ డ్రైవర్ హాల్ చల్..
  • ప్రశంసలు కురిపించిన నెటిజన్లు..
Viral Video: నువ్వు తోపు భయ్యా.. జేసీబీ డ్రైవర్ చేసిన పనికి నెటిజన్లు ఫిదా.. వీడియో వైరల్..

JCB Operator showed his skills to overcome a small obstacle: మనలో చాలా మంది తమ కంటూ స్పెషల్ టాలెంట్ కల్గి ఉంటారు. కొందరు చదువుల్లో టాప్ మార్కులు సాధిస్తే, మరికొందరు బిజినెస్ రంగంలో రాణిస్తుంటారు. కొందరు వాహనాలు నడిపించడంలో కూడా తమ టాలెంట్ చూపిస్తుంటారు. అందరిలాగా కాకుండా తమకంటూ అద్భుతమైన ప్రతిభను కల్గి ఉంటారు. సోషల్ మీడియాలో ప్రతిరోజు వేలాది వీడియోలు వైరల్ గా మారుతుంటాయి. కొన్ని ఫన్నీగా ఉంటే, మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేసేవిగా ఉంటాయి. రోడ్డుపైన లేదా బైటకు వెళ్లినప్పుడు వెరైటీ ఘటనలు జరుగుతుంటాయి. కొందరికి వెరైటీ ఘటనలు వీడియోలు తీయడం, వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ లు చేయడం వంటి అలవాటు ఉంటుంది. ఎక్కడ ఎలాంటి వింత ఘటనలు జరిగిన, వెంటనే వీడియోలు తీసుకుని సోషల్ మీడియాలో వేదికల్లో అప్ లోడ్ చేస్తుంటారు. సోషల్ మీడియాలో తరచుగా పెళ్లికి సంబంధించిన వీడియోలు, పాములకు చెందిన వీడియోలు వైరల్ గా మారుతుంటాయి. ఇటీవల కాలంలో మెట్రోలో రోమాన్స్, పబ్లిక్ లో ఉండగా డ్యాన్స్ లు, ఎయిర్ పోర్టులలో డ్యాన్స్ లకు చెందిన వీడియోలు ట్రెండింగ్ లో నిలిచాయి. నెటిజన్లు కూడా వీటిని చూడటానికి ఆసక్తి చూపిస్తుంటారు.

 

పెళ్లిలో వెరైటీ సంఘటనలు కూడా జరుగుతుంటాయి. యువతి వేదిక వద్దకు వెరైటీగా రావడం, పెళ్లికొడుకు యువతి కొట్టుకోవడం, పెళ్లి జరిగేటప్పుడు మాజీ ప్రియుడు ఎంటర్ అవ్వడం వంటి అనేక ఘటనలు వార్తలలో నిలిచాయి. కొన్నిచోట్ల వాహనాలతో స్టంట్ లు వేస్తుంటారు. కార్లు, జీబ్ లతో వెరైటీగా డ్రైవింగ్ చేస్తుంటారు. ఈ నేపథ్యంలో.. ప్రస్తుతం ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

ప్రస్తుతం ట్రెండింగ్ లో నిలిచిన వీడియోలో.. ఒక జేసీబీ డ్రైవర్ తన ముందు ఉన్న పిల్లకాలువను తప్పిస్తున్నాడు. జేసీబీ డ్రైవర్.. తన వాహానంలో వెళ్తున్నాడు. ఇంతలో అతనికి అడ్డంగా ఒక పిల్ల కాలువ  ఉంది. నార్మల్ గా అందరు రివర్స్ లో తీసుకుని మరో మార్గం గుండా వెళ్లిపోతుంటారు. కానీ ఇతను మాత్రం కాస్తంతా డిఫరెంట్ గా ఆలోచించాడు. జేసీబీతో.. మెల్లగా  కాలువ పై నుంచి, వెళ్లేలా డ్రైవ్ చేశాడు. జేసీబీలో ఒకేసారి ముందు భాగం, వెనక భాగం రెండు సైడ్ లలో ఆపరేట్ చేసే విధానం అందుబాటులో ఉంటుంది.

Read more: Romance In Metro: మెట్రోలో హాట్ రోమాన్స్.. యువకుడిని గట్టిగా హత్తుకుని ముద్దులు.. వీడియో వైరల్...

మొదట అతను.. జేసీబీని ముందుకు పోనిచ్చి, ఆతర్వాత మెల్లగా రివర్స్ లో మరో వైపు కూర్చుని,వెనుక భాగంతో జేసీబీని అక్కడి భూమి మీద ఆనించి మరోవైపుకు వెళ్లేలా జేసీడీ నడిపించాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జేసీబీ డ్రైవర్ టాలెంట్ కు అక్కడున్న వారంతా ఫిదా అవుతున్నారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు వావ్.. భలే జేసీబీ డ్రైవ్ చేశాడంటూ కూడా డ్రైవర్ పై  ప్రశంసలు కురిపిస్తున్నారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News