Telangana Formation Day: కెనడాలో పదేళ్ల తెలంగాణ పండుగ.. వైభవంగా సంబరాలు

Telangana Formation Day Celebrations in Canada: కెనడాలో తెలంగాణ రాష్ట్ర సంబరాలను వైభవంగా జరిగాయి. టోరంటో నగరంలో తెలంగాణ నైట్ పేరుతో కెనడాలో స్థిరపడిన ప్రవాసులు ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ ఏడాది జూన్ 2వ తేదీ‌కి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడి పదేళ్లు పూర్తి అవుతున్న సంగతి తెలిసిందే.
 

  • May 15, 2024, 15:51 PM IST
1 /5

టోరంటోలోని మిసిసాగ వేదికగా తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరమ్ (టీడీఎఫ్) ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలను నిర్వహించారు.   

2 /5

ఈ సంబరాలను తెలంగాణ వాసులు కుటుంబ సభ్యులతో కలిసి హాజరయ్యారు.  

3 /5

దాదాపు మూడు గంటలపాటు ఈ వేడుకలు నిర్వహించగా.. తెలంగాణ ఆట, పాటలతో సందడి చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.  

4 /5

TDF వ్యవస్థాపక అధ్యక్షుడు సురేందర్ రెడ్డి పెద్ది మాట్లాడుతూ.. 2005లో తెలంగాణ డెవలప్ మెంట్ ఫోరమ్ ఏర్పాటు చేశామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు, ఈటల రాజేందర్, ప్రొఫెసర్ కోదండ రామ్, ప్రముఖ కవి రచయిత అందెశ్రీ తదితర ప్రముఖులు టీడీఎఫ్ చొరవకు అభినందనలు తెలిపారని చెప్పారు.  

5 /5

అధ్యక్షుడు జితేందర్ రెడ్డి గార్లపాటి మాట్లాడుతూ.. తెలంగాణ NRIలు అంటే బతికేందుకు బయటి దేశం పోయినోళ్లు కాదన్నారు. రాష్ట్ర సాధనతో పాటు.. నిర్మాణంలోనూ పాటు పడుతున్నామనే ఆదర్శంతో TDF పని చేస్తుందని తెలిపారు.