Maha Shivratri 2024: మహా శివరాత్రి ఉపవాసం.. రెండో రోజు భక్తులు ఈ తప్పులు చేస్తే బతుకు బస్టాండే.. ముక్కంటి కూడా కాపాడలేడు..

Maha Shivratri 2024: మహా శివరాత్రిరోజు శివయ్య భక్తులంతా ఎంతో భక్తితో పూజలు చేసి, ఉపవాసం ఉంటారు. ఉదయం నుంచే శివాలయాలన్ని భక్తులు కిక్కిరిసిపోయాయి. ఈ క్రమంలో ఉపవాసం చేయడానికి శక్తిలేని వారు టిఫిన్ లో తిని కూడా తమ ఇష్టదైవాన్ని కొలుచుకుంటున్నారు. 

1 /6

హిందు సంప్రదాయంలో మహశివరాత్రికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ రోజు శివయ్యను  భక్తులు అనేక పద్ధతులతో కొలుచుకుంటారు. కొందరు పాలు, పెరుగు , తేనె, నెయ్యి,చక్కెరతో అభిషేకం చేస్తారు. ఇలా చేస్తే జీవితంలో దేనికి కూడా లోటు ఉండదని భావిస్తారు. కొందరు పూజల్లో ఫలాలను కూడా ఉపయోగిస్తారు.   

2 /6

ఉదయంనుంచే భక్తులంతా ఆలయానికి క్యూలు కట్టారు. చిన్న గుడి,పెద్దగుడి అని తేడా లేకుండా భక్తులు భారీ ఎత్తున ఆలయానికి చేరుకుని స్వామి వారిని భక్తితో తమ ముడుపులు చెల్లించుకున్నారు. తమ మనసులోని కోరికలు నెరవేర్చేలా ఆశీర్వదించాలని కూడా వేడుకున్నారు. 

3 /6

శివరాత్రి రోజు కొందరు కేవలం నీళ్లు మాత్రమే తాగి ఉపవాసం ఉంటారు. మరికొందరు  పండ్లు తిని కూడా ఉపవాసం చేస్తారు. ఇదిలా ఉండా మహ శివరాత్రి రోజు ఎంత భక్తిగా ఉపవాసం నియమం పాటిస్తామో.. అభిషేకం చేస్తామో.. మరుసటి రోజు కూడా అంతే భక్తితో అభిషేకం పూజలు చేయాలంట..  

4 /6

శివయ్యకు రెండో రోజు అభిషేకం చేసి, ఫలాలు, అన్నప్రసాదం నైవేద్యంగా పెట్టాలంట. ముఖ్యంగా రాజ్యాధికారం కావాలనుకునే వారు మహ శివరాత్రి మరుసటి రోజు అన్నంతో శివుడిని అభిషేకం చేస్తే వెంటనే మంచి ఫలితాలు అనుభవానికి వస్తాయంట..  ఇలా చేస్తే శివరాత్రి వ్రతం సఫలం మౌతుందంట..  

5 /6

కొందరు మహశివరాత్రి రెండో రోజున ఉదయం మద్యం, మాంసాలు తింటారు. ఇలా అస్సలు చేయకూడదంట. శివరాత్రి రోజు ఎంత పవిత్రంగా ఉంటామో.. మరుసటి రోజు కూడా అలానే పవిత్రంగా స్వామివారిని  కొలుచుకోవాలంట. అదే విధంగా స్వామి వారికి ప్రత్యేకంగా అభిషేకాలు చేసుకొవాలి..

6 /6

ఉపవాసం రెండో రోజున ఉదయాన్నే నిద్రలేచి, ముక్కంటిని మనసులో ధ్యానించి, ప్రత్యేకంగా పూజలు చేసుకొవాలి. అంతే కాకుండా.. శివుడి ఆలయానికి వెళ్లి స్వామి వారిని దర్శించుకొని వచ్చి, ఉపవాసం విడిచిపెట్టాలి. ఆ రోజు కేవలం సాత్వికమైన ఆహారం మాత్రమే తినాలని జ్యోతిష్యులు చెబుతుంటారు. Disclaimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్నవి వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)