Kajal Aggarwal: ఆ హీరో కోసమే అలాంటి పని చేశాను.. కాజల్ ఓపెన్ కామెంట్స్..

Kajal Aggarwal: కాజల్ అగర్వాల్.. పెళ్లై ఓ బిడ్డకు తల్లైన తర్వాత కూడా కథానాయికగా దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను ఐటెం సాంగ్ చేయడంపై హాట్ కామెంట్స్ చేసింది.

1 /6

 కాజల్ అగర్వాల్  గురించి ప్ర‌త్యేకంగా  పరిచయాలు అక్కర్లేదు. హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి దాదాపు ఇరవై యేళ్లు కావొస్తోంది. అంతేకాదు పెళ్లై ఓ బిడ్డకు తల్లైన తన గ్లామర్‌తో అలరిస్తూనే ఉంది.

2 /6

కాజల్ అగర్వాల్ కేవలం హీరోయిన్‌గానే కాకుండా జనతా గ్యారేజ్‌లో తొలిసారి ఐటెం భామగా అలరించింది. అందులో ఈ పాట చేయడానికి కారణాలు వెల్లడించింది.

3 /6

ఎన్టీఆర్ తనకు మంచి స్నేహితుడు. అంతకు ముందు తారక్‌తో బాద్‌షా, బృందావనం, టెంపర్ వంటి సినిమాల్లో నటించాను. ఆ సినిమాలతో మా మధ్య మంచి స్నేహ బంధం ఏర్పడింది.

4 /6

తారక్ అడిగినందుకే జనతా గ్యారేజ్‌లో ఐటెం సాంగ్ చేసిన విషయాన్ని కాజల్ అగర్వాల్ ప్రస్తావించింది. ఆ తర్వాత పలు సినిమాల్లో ఐటెం సాంగ్ చేయమని అడిగినా.. చేయలేదన్నారు.

5 /6

కాజల్ అగర్వాల్.. లాస్ట్ ఇయర్ బాలకృష్ణతో కలిసి 'భగవంత్ కేసరి' సినిమా చేసారు. త్వరలో NBK 104 సినిమాలో ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నట్టు సమాచారం.

6 /6

త్వరలో కాజల్ అగర్వాల్ 'సత్యభామ' సినిమాతో పలకరించనుంది. ఈ సినిమాపై కాజల్ అగర్వాల్ భారీ ఆశలే పెట్టుకుంది.