Former CM KCR: రోడ్డుపక్కన చాయ్ తాగి, మిర్చీ బజ్జీలు తిన్న కేసీఆర్..

Former CM KCR: మాజీ సీఎం కేసీఆర్ తన బస్సు యాత్రలో భాగంగా తొర్రురు రోడ్డుమీద కాసేపు ఆగారు. అక్కడ మిర్చీ దుకాణంలో వెళ్లి సరదగా అక్కడివారిని పలకరించారు. అంతేకాకుండా అక్కడి చిన్న పిల్లలకు మిర్చీ బజ్జీలను కూడా తన చేతితో ఇచ్చారు.
 

  • Apr 29, 2024, 21:30 PM IST
1 /6

మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణలోని లోక్‌ సభ నియోజక వర్గాలను చుట్టేయడానికి బస్సుయాత్ర చేపట్టారు.దీనిలో  భాగంగా ప్రజలను కలుస్తూ, అనేక సభలలో పాల్గోంటున్నారు. బహింరంగ సభలలో కాంగ్రెస్ ను తనదైన స్టైల్ లో విమర్శిస్తున్నారు.   

2 /6

ప్రజలు ఎక్కడ చూసి గులాబీబాస్ కు బ్రహ్మరథం పడుతున్నారు. అనేక మంది మహిళలు ఆయనకు ఆరతులిచ్చిమరీ స్వాగతం పలుకుతున్నారు. ఇదిలా ఉండగా ఖమ్మంలో రోడ్ షోలో కేసీఆర్ మాట్లాడుతూ.. ఆగస్ట్ 15 లోపల నువ్వు రుణమాఫీ చెయ్యక పోతే నువ్వు రాజీనామా చెయ్యాలి.. నేను కూడా రాజీనామా ఇస్తున్న అని హరీష్ రావు రాజీనామా ఇచ్చిండు, కానీ ఈ ముఖ్యమంత్రి పోకుండా తోక ముడిచిండని కేసీఆర్ అన్నారు.   

3 /6

నేను ఒక్కడిగా బయలదేరిన్నాడు ఎవరికీ తెలంగాణ వస్తుందని నమ్మకం లేదు. కానీ నేను ఎక్కడ తగ్గకుండా..  ఆమరణ దీక్షకు పూనుకున్నా.. నన్ను అరెస్ట్ చేసి ఇదే ఖమ్మం జిల్లా జైలులో పెట్టారు. ఆనాడు ఇక్కడ ఖమ్మం జిల్లా బిడ్డలు నాకు బ్రహ్మరథం పట్టి ఆశీర్వదించి మద్దతు కూడా తెలిపారని కేసీఆర్ గుర్తు చేశారు.   

4 /6

ఖమ్మం జిల్లా ప్రజలు పడుతున్న ఇబ్బందులు శాశ్వతంగా తీరాలని బ్రహ్మాండంగా దుమ్ముగూడ ప్రాంతంలో సీతరామ ప్రాజెక్ట్ 37టీఎంసీల ప్రాజెక్ట్  పనులు కొనసాగుతున్నాయి.  అది పూర్తి అయితే ఖమ్మం జిల్లాలో ఒక అంగుళం లేకుండా వ్యవసాయానికి నీళ్లు వచ్చి ఉండేవి. పైన ఇచ్చంపల్లి దగ్గర ప్రాజెక్ట్ కట్టి కర్ణాటక, తమిళనాడుకు నీళ్లు తీసుకుపోతుంటే సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదని విమర్శించారు.

5 /6

ఇదిలా ఉండగా కేసీఆర్ ఖమ్మంలో వెళ్తుండగా.. అక్కడ రోడ్డుపక్కన ఆగి మిర్చిబజ్జీలు తిన్నారు. అంతేకాకుండా..చాయ్ తాగుతూ, పకోడీలు తిన్నారు. అంతేకాకుండా అక్కడి  వారికి మిర్చీలను కూడా ఇచ్చి ఆప్యాయంగా మాట్లాడారు. బీఆర్ఎస్ నేత ఎర్రబెల్లీ దయాకర్ రెడ్డి కూడా కేసీఆర్ తో ఉన్నారు.   

6 /6

కేసీఆర్ అక్కడున్న వారితో సరదాగా మాట్లాడుతూ.. రేవంత్ చేసిన మోసపు హమీలను ప్రజలకు వివరించారు. అదేవిధంగా బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కరెంట్ కోతలు లేవని, ఇప్పుడు మరల కరెంట్ కోతలు ప్రారంభమయ్యాయని ఎద్దెవా చేశారు.