Monday Remedies: సోమవారం.. ఈ ఐదు పరిహారాలు పాటిస్తే జీవితంలోని అన్నిసమస్యలకు పరిష్కారం..

Lord Shiva: హిందు మత గ్రంథాల ప్రకారం.. సోమవారం శివుడిని ఆరాధిస్తుంటారు. భోళా శంకరుడిని ఆరాధిస్తే  జీవితంలో ఎలాంటివ సమస్యలున్న కూడా ఇట్టే తొలగిపోతాయని చెబుతుంటారు. 

1 /6

శివుడిని భోళాశంరుడుగా కూడా పిలుస్తారు. ఆయనను భక్తితో పూజలు చేసిన వారికి ఎలాంటి కోరికలు కూడా తీర్చేస్తుండారంటారు. అందుకే పూర్వకాలంలో దానవులు ఎక్కువగా శివుడిని పూజిస్తూ, తపస్సులు చేస్తుండేవారు..

2 /6

సోమవారం శివుడికి ఎంతో ప్రీతికరమైనదిగా చెబుతుంటారు. శివుడికి తెల్లని పదార్థాలతో పూజించడం ఎంతో ఇష్టమనిచెబుతుంటారు. అందుకే.. సోమవారం రోజున.. అన్నం, పెరుగు, నెయ్యి, పంచదార, పాలు, పాలతో అభిషేకం చేస్తుంటారు. 

3 /6

కొందరు భక్తులు సోమవారం రోజున ఉపవాసం చేస్తుంటారు. ఈరోజున ఉపవాసం చేసి, సాయంత్రంపూట దీపం వెలిగించి, ప్రత్యేకంగా భజనలు కూడా చేస్తుంటారు. ఇలా చేస్తే మనకోరికలు తీరుతాయంటారు.

4 /6

సోమవారం పూజ సమయంలో శివలింగానికి పాలు, బిల్వపత్రం, పూలు, పండ్లు సమర్పించడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఈ పూజ సమయంలో, ఖచ్చితంగా శివలింగం ముందు ఒక నెయ్యి దీపం లేదా అగరబత్తిని వెలిగించండి. దీని ద్వారా శివుని అనుగ్రహం లభిస్తుంది.

5 /6

ఈ రోజున పూజించేటప్పుడు ఓం నమః శివాయ మంత్రాన్ని పఠించడం ద్వారా, జీవితంలోని అన్నిరకాల సమస్యలు దూరమైపోతాయి. అదే విధంగా కోరుకున్న అదృష్టం మనం అనుభవిస్తామని చెబుతుంటారు. 

6 /6

ఒక వేళ.. ఎవరైన వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే, మీరు సోమవారం రుద్రాక్షను దానం చేయాలి. ఈ పరిహారం వైవాహిక సమస్యలను తొలగిస్తుందని,  జీవితంలో ఆనందాన్ని తెస్తుందని జ్యోతిష్యులు చెబుతుంటారు. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)