Shiva Puja: ఇంట్లో శివుడి లింగం ఏ పరిమాణంలో ఉండాలి.. రోజు అభిషేకం చేయాలా..?.. జ్యోతిష్యులు ఏమంటున్నారంటే..

Shiva Worshiping:మనలో చాలా మంది తమ ఇళ్లలో శివుడిని ఎంతో ఇష్టంతో తెచ్చుకుంటారు. కానీ కొందరు ప్రతిరోజు అభిషేకం చేస్తే, ఇంకొందరు మాత్రం వారానికి ఒకసారి అభిషేకం వంటివి చేస్తారు. దీనిపై జ్యోతిష్యులు ఈ కింది విధంగా వివరణ ఇచ్చారు.

1 /6

హిందు సంప్రదాయం ప్రకారం.. ప్రతిఒక్కరు ఏదో ఒక్క దేవుడిని భక్తితో కొలుస్తుంటారు. తమ తమ శక్తికొలది దేవుడికి ప్రత్యేకంగా పూజలు చేస్తుంటారు. కొందరు ఇళ్లలో శివుడి లింగం తెచ్చుకుని పెట్టుకుంటారు. అయితే.. శివుడిని కొందరు ఇంట్లో పెట్టుకోకూడదని అంటారు. 

2 /6

శివుడు స్మశానంలో సంచరిస్తాడు. బూడిద పూసుకుంటాడు. అందుకే ఇంట్లో ఉంటే మంచిది కాదని భావించే వాళ్లు కూడా ఉన్నారు. కానీ శివుడి లింగాన్ని ఇంట్లో పెట్టుకుంటే ఎలాంటి దోషాలు ఉండవని జ్యోతిష్యులు చెబుతున్నారు. అయితే.. శివలింగం మరీ పెద్దదిగా కాకుండా మన మధ్యవేలు సైజులో ఉండాలని చెబుతుంటారు.  

3 /6

పెద్ద పెద్ద విగ్రహలు పెట్టుకుంటే వాటిని అదే విధంగా పూజలు, నైవేద్యాలు అర్పించాలి. అందుకే చిన్న విగ్రహాలు పెట్టుకున్న ఎక్కువ భక్తితో పూజలు చేయాలి. శివుడు భోళా శంకరుడు చెంబెడు నీళ్లు పోస్తే ఆనందపడిపోతాడు. బిల్వపత్రం అర్పిస్తే మన కోరికలన్ని నెరవేరుస్తాడు.

4 /6

ఇంట్లో దేవుళ్లకు ప్రతిరోజు పూజలు,అభిషేకాలు చేస్తే మంచి ఫలితాలు అనుభవానికి వస్తాయి. కానీ కొందరు ఇళ్లలో దేవుళ్లను తెచ్చిపెట్టుకుంటారు. కానీ వారికి పూజలు చేసుకునే సమయం ఉండదు. అలాంటివారు ప్రతిరోజు తడిగుడ్డతో దేవుళ్లను పూజించాలి. అది కుదరకపోతే నీళ్లను పూలతో చల్లాలి.  

5 /6

ఇలా నీళ్లు చల్లి, పసుపు,కుంకుమ, ఏవైన అందుబాటులో ఉన్న డ్రైఫ్రూట్స్ లను నైవేద్యంగా పెట్టాలి. ఇలా పెడితే ఆ భోళాశంకరుడు మన మనస్సులోని కోరికలను నెరవేరుస్తాడు. కొందరు స్మశానంలో నుంచి బూడిద తీసుకొచ్చి ఇంట్లో శివలింగం మీద పూజలు చేస్తుంటారు. కానీ అలా చేయకూడదు. 

6 /6

పెద్ద పెద్ద దేవాలయాలలో స్మషానం నుంచి భస్మంతో అభిషేకం చేస్తారు. కానీ మన ఇళ్లలో సింపుల్ గా పూజలు చేసుకొవాలి. ప్రతిరోజు దేవుడికి అభిషేకం,పూజలు చేస్తే మనకు మంచిఫలితాలు అనుభవానికి వస్తాయని, జాతకంలో దోషాలున్న, జీవితంలో అనుకొని ఆపదలున్న తొలగిపోతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)