Preminchoddu Movie: పాన్ ఇండియా లెవల్లో ప్రేమించొద్దు మూవీ.. జూన్ 7న గ్రాండ్‌గా రిలీజ్

Preminchoddu Movie Updates: పాన్ ఇండియా లెవలో సినీ ప్రియులను అలరించేందుకు ప్రేమించొద్దు మూవీ సిద్ధమవుతోంది. జూన్ 7న ఆడియన్స్ ముందుకు రానుండగా.. తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. పూర్తి వివరాలు ఇలా..  

Written by - ZH Telugu Desk | Last Updated : May 9, 2024, 01:50 PM IST
Preminchoddu Movie: పాన్ ఇండియా లెవల్లో ప్రేమించొద్దు మూవీ.. జూన్ 7న గ్రాండ్‌గా రిలీజ్

Preminchoddu Movie Updates: బ‌స్తీ బ్యాక్‌ డ్రాప్‌లో యూత్‌ఫుల్ ప్రేమ కథగా తెరకెక్కిన మూవీ ప్రేమించొద్దు. అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస కీలక పాత్రలు పోషించగా.. శిరిన్ శ్రీరామ్ దర్శక నిర్మాణంలో రూపొందింది. శిరిన్ శ్రీరామ్ కేఫ్ బ్యానర్‌పై పాన్ ఇండియా మూవీగా  5 భాషల్లో నిర్మించారు. తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా తెలుగు వర్షన్‌ను జూన్ 7న ఆడియన్స్‌ ముందుకు తీసుకురానున్నారు. ఈ సందర్భంగా.. దర్శక నిర్మాత శిరిన్ శ్రీరామ్ మీడియాతో మాట్లాడారు.

Also Read: PBKS vs RCB Dream11 Team: పంజాబ్, ఆర్‌సీబీ మధ్య ఫైట్.. ఓడిన జట్టు ప్లే ఆఫ్స్ నుంచి ఔట్.. హెడ్ టు హెడ్ రికార్డులు, డ్రీమ్11 టీమ్ టిప్స్ ఇవే  

నేటి తరం యువతలో చాలా మంది నిజమైన ప్రేమకు.. ఆకర్షణకు తేడా తెలియకుండా తప్పటడుగులు వేస్తున్నారని అన్నారు. తెలిసి తెలియక చేసిన తప్పులు వారి జీవితాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని.. ఈ కోణంలోనే  ‘ప్రేమించొద్దు’ అనే పేరుతో మూవీ తెరకెక్కించామని చెప్పారు. నిజ జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా రూపొందించామని.. పాన్ ఇండియా సినిమాగా ఆడియన్స్‌ ముందుకు తీసుకువస్తున్నామన్నారు. జూన్ 7వ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ముందుగా తెలుగులో విడుదల చేసిన తరువాత త్వరలో త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని నమ్మకం ఉందన్నారు. 

యాక్టర్స్: అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస, యశ్వంత్ పెండ్యాల, సంతోషి తాళ్ల, సోనాలి గర్జె, లహరి జులురి, శ్రద్ధా సాయి, వల్లీ శ్రీగాయత్రి, లక్ష్మీకాంత్ దేవ్ తదితరులు

సాంకేతిక వర్గం: 
==> రైటింగ్, ఎడిటింగ్, ప్రొడ్యూసర్, దర్శకత్వం- శిరిన్ శ్రీరామ్  
==> మ్యూజిక్ ప్రోగ్రామింగ్ - జునైద్ కుమార్
==> బ్యాగ్రౌండ్ స్కోర్ - కమ్రాన్ 
==> సాంగ్స్ కంపోజింగ్ - చైతన్య స్రవంతి
==> సినిమాటోగ్రఫీ అండ్ కలర్ - హర్ష కొడాలి
==> స్క్రీన్ ప్లే - శిరిన్ శ్రీరామ్, రాహుల్ రాజ్ వనం 
==> అసోసియేట్ డైరెక్టర్ - సోనాలి గర్జె, 
==> పబ్లిసిటీ డిజైన్ - అజయ్(ఏజే ఆర్ట్స్), 
==> PRO- చంద్ర వట్టికూటి, మోహన్ తుమ్మల. 

Also Read: VD 14- Vijay Devarakonda: పుట్టిన రోజున మ‌రో డిఫ‌రెంట్ కాన్సెప్ట్ మూవీని అనౌన్స్ చేసిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. అదిరిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News