NTR: మరోసారి మంచి మనసు చాటుకున్న ఎన్టీఆర్.. ప్రముఖ ఆలయానికి భారీ విరాళం..

Jr NTR: ఎన్టీఆర్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నాడు. తాజాగా ఏపీలో నిర్మాణంలో ఉన్న ఓ ఆలయానికి పెద్ద ఎత్తున ధన సహాయం చేసాడు. ఆ విషయం గోప్యంగా ఉంచాలనుకున్న ఎలాగో బయటపడింది.

Written by - TA Kiran Kumar | Last Updated : May 16, 2024, 12:41 PM IST
 NTR: మరోసారి మంచి మనసు చాటుకున్న ఎన్టీఆర్.. ప్రముఖ ఆలయానికి భారీ విరాళం..

Jr NTR: ఎన్టీఆర్ మరోసారి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. ఏదైనా ఛారిటీకి సంబంధించిన ప్రోగ్రామ్‌ అయితే అందరి కంటే ముందుంటాడు. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ఆంధ్ర ప్రదేశ్‌లో నిర్మాణం అవుతున్న ఓ దేవాలయానికి తన వంతు భారీ ధన సహాయాన్ని అందజేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏపీలోని అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని చెయ్యేరులో ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయానికి రూ. 12.50 లక్షల విరాళం ఇచ్చారు. ప్రస్తుతం ఆలయ నిర్మాణం పూర్తి కావొచ్చింది. ఈ సందర్భంగా ఆలయంలో ఏర్పాటు చేసిన దాతల వివరాల్లో ఎన్టీఆర్ తల్లి పేరు శాలినితో పాటు ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి, అభయ్ రామ్, భార్గవ్ రామ్ పేర్లు ఉన్నాయి.

ఎన్టీఆర్ గుప్తంగా చేసిన ఈ వివరాలు ఆలయ ట్రస్టు బోర్డ్ సభ్యులు నేమ్ బోర్డ్ ద్వారా ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక తారక్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో 'దేవర' మూవీ చేస్తున్నారు. ఈ సినిమా రెండు పార్టులుగా రాబోతుంది. మరోవైపు 'వార్ 2' మూవీ ఉంది. అటు ప్రశాంత్ నీల్ మూవీ ఉండనే ఉంది. ఈ నెల 20న ఎన్టీఆర్ బర్త్ డే సందర్బంగా దేవర్ మూవీ నుంచి బిగ్ అప్‌డేట్ రానుంది. దాంతో పాటు వార్ 2, ప్రశాంత్ నీల్ మూవీలకు సంబంధించిన ఏదైనా ప్రకటన ఉండే అవకాశం ఉంది.

ఇక ఎన్టీఆర్ యాక్ట్ చేస్తోన్న 'దేవర' సినిమా విషయానికొస్తే.. ఈ చిత్రంలో ఎన్టీఆర్ మరోసారి మూడు విభిన్న పాత్రలతో అలరించనున్నట్టు సమాచారం. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఇక 'దేవర' రెండో పార్ట్‌ను 2025 సమ్మర్‌లో రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. అటు 'వార్ 2' మూవీని 2025 రిపబ్లిక్ డే కానుకగా విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. అది కుదరకుంటే 2025 ఆగష్టు 15న విడుదలనే ఆలోచనలో ఉన్నారు. మరోవైపు ప్రశాంత్ నీల్ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలైయ్యాయి. ఈ సినిమాను పీరియాడిక్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.

ఇదీ చదవండి అకీరా, ఆద్యాకు అన్ని ఇచ్చా.. పవన్ ఎమోషనల్!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News