Nagababu: ట్విట్టర్ డీ-యాక్టివేట్ చేసిన నాగబాబు.. అల్లు అర్జున్ అభిమానుల ప్రభావం!

Allu Arjun: ట్విట్టర్‌ లో నాగబాబు అల్లు అర్జున్ అభిమానుల మధ్య పెద్ద ఎత్తున వార్ జరుగుతున్న సంగతి తెలిసిందే. నాగబాబు ఈ మధ్య పెట్టిన ఒక పోస్ట్ పోన్ ఆగ్రహానికి గురిచేసింది

Written by - Vishnupriya Chowdhary | Last Updated : May 16, 2024, 09:47 PM IST
Nagababu: ట్విట్టర్ డీ-యాక్టివేట్ చేసిన నాగబాబు.. అల్లు అర్జున్ అభిమానుల ప్రభావం!

Allu Arjun-Nagababu Controversy: మెగా ఫ్యామిలీలో.. చిన్న విషయానికి కూడా ఎక్కువ రియాక్ట్ అయ్యే నటుడు..ఎవరూ అంటే ముందుగా నాగబాబు పేరే వినిపిస్తుంది. మెగా హీరోలలో ఎవరిని ఏమన్నా కానీ.. నాగబాబు ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉంటారు. అంతేకాకుండా సోషల్ మీడియాలో కూడా మెగా ఫ్యామిలీని.. ఎవరైనా.. ఏమైనా అంటే వాళ్ళ పైన తెగ పోస్టులు పెడుతూ ఉంటారు. ఈ క్రమంలో నాగబాబు ఈమధ్య అల్లు అర్జున్ పైన పెట్టిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయి.. అల్లు అభిమానులను ఆగ్రహానికి గురిచేసింది. 

గత కొద్దిరోజులుగా మెగా ఫ్యామిలీకి.. అల్లు ఫ్యామిలీకి మధ్య ఏదో చిన్న రచ్చ జరుగుతోందన్న రూమర్ వినిపిస్తూనే ఉంది. ఈ క్రమంలో ఈ మధ్య అల్లు అర్జున్.. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి పోటీగా ఉన్న వైసీపీ పార్టీ ప్రచారంలో పాల్గొనడంతో.. నాగబాబు ఇన్-డైరెక్ట్ గా ఒక ట్వీట్ వేశారు. అయితే అల్లు అర్జున్ తన ఫ్రెండ్ కోసం ఎమ్మెల్యే సీటుకి పోటీ చేస్తుండగా.. నంద్యాలకి వెళ్లి ప్రచారం చేశారు. ప్రచారం చేసినప్పుడు కూడా అల్లు అర్జున్ పార్టీ తరపున కాకుండా తన ఫ్రెండ్ కోసమే ప్రచారం చేసినట్టు క్లారిటీ ఇచ్చాడు. కానీ నాగబాబు మాత్రం తన తమ్ముడు పవన్ కళ్యాణ్ పార్టీకి అపోజిషన్ లో ఉన్న పార్టీకి.. అల్లు అర్జున్ సపోర్ట్ చేసినందుకు ఇన్ డైరెక్ట్ గా సెటైర్ వేశారు. ’మాతో ఉంటూ వేరే వాళ్ళని సపోర్ట్ చేసేవాళ్లు.. మా వాళ్ళయినా పరాయివాళ్లే’ అంటూ ఒక ట్విట్ చేశారు. ఈ క్రమంలో ఈ పోస్ట్ కాస్త అల్లు అర్జున్ అభిమానులను ఆగ్రహానికి గురిచేసింది. దీంతో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే మెగా బ్రదర్ నాగబాబు ఇప్పుడు ఏకంగా ట్విట్టర్ అకౌంట్ డియాక్టివేట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

నాగబాబు తన ట్విట్టర్ అకౌంట్ తీసేయడానికి ప్రధాన కారణం అల్లు అర్జున్ అభిమానులే అని తెలుస్తోంది. ‘మాతో ఉంటూ ప్రత్యర్థులకు పని చేసేవాడు మావాడు అయినా పరాయి వాడే, మాతో నిలబడే వాడు పరాయివాడైనా మా వాడే అంటూ’ నాగబాబు చేసిన ట్వీట్ అసలు ఎవరిని ఉద్దేశించి ట్విట్ చేశాడు అనే విషయం మీద క్లారిటీ లేదు. కానీ అది చదివితే మాత్రం 100కి 100% అల్లు అర్జున్ గురించే అని అర్థమవుతుందని..ఎవరికి తగినట్లుగా వారు దానిమీద స్పందిస్తూ సోషల్ మీడియాలో పెద్ద రచ్చ కి దారి తీశారు.

ముఖ్యంగా అల్లు అర్జున్ అభిమానులు నాగబాబుని టార్గెట్ చేస్తూ వందలకు వందలు ట్వీట్లు పెట్టారు. ఇక ఈ వివాదం ముదరడంతో నాగబాబు తాజాగా తన ట్విట్టర్ అకౌంట్ డియాక్టివేట్ చేశారు. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో మరింత చర్చనీయాంశంగా మారింది.

పవన్ కళ్యాణ్ ఎన్నికలలో పిఠాపురం నుంచి పోటీ చేయడంతో ఆయన కోసం మెగా హీరోలు చాలామంది వెళ్లి ప్రచారం చేసి వచ్చారు. అయితే అల్లు హీరో అల్లు అర్జున్ మాత్రం కేవలం పవన్ కళ్యాణ్ కోసం సోషల్ మీడియా పోస్ట్ కి మాత్రమే పరిమితమయ్యారు. మరోపక్క తన స్నేహితుడిగా చెప్పుకుంటున్న నంద్యాల వైసిపి అభ్యర్థి శిల్పా రవిచంద్ర రెడ్డి కోసం మాత్రం స్వయంగా వెళ్లి తన స్నేహితుడికి ఓటు వేయాల్సిందిగా కోరారు. ఈ అంశం మీద అటు మెగా అభిమానులకు ఇటు అల్లు అభిమానులకు మధ్య కూడా సోషల్ మీడియాలో చర్చలు పైన చర్చలు సాగి ఆఖరికి నాగబాబు ట్విట్టర్ అకౌంట్ డీ యాక్టివేట్ చేసే అంత దూరం తీసుకెళ్లారు.

Also Read: Hyderabad Rains Live Updates: హైదరాబాద్‌లో భారీ ట్రాఫిక్ జామ్.. నిలిచిపోయిన వాహనాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News