PPF Benefits: పోస్టాఫీసు సూపర్‌హిట్ స్కీమ్, నెలకు 5 వేలతో 26 లక్షలు పొందే అవకాశం

PPF Benefits: భవిష్యత్తులో అంటే రిటైర్మెంట్ లేదా వృద్ధాప్యంలో కచ్చితమైన ఆదాయం అవసరమౌతుంది. అందులో భాగంగానే వివిధ రకాల సేవింగ్ పథకాలు అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా పోస్టాఫీసుల్లో లభ్యమయ్యే కొన్ని పథకాల్లో రిస్క్ ఉండదు సరికదా అద్భుతమైన రిటర్న్స్ పొందవచ్చు

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 5, 2024, 10:49 AM IST
PPF Benefits: పోస్టాఫీసు సూపర్‌హిట్ స్కీమ్, నెలకు 5 వేలతో 26 లక్షలు పొందే అవకాశం

PPF Benefits: పోస్టాఫీసుల్లో కొన్ని సూపర్‌హిట్ స్కీమ్స్ ఉన్నాయి. ఇందులో ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ అనంతరం ఒకేసారి భారీ నగదు అందుకోవచ్చు. ప్రతినెలా 500 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ తరువాత ఏకంగా 26 లక్షల రూపాయలు పొందవచ్చు. అంతేకాదు ఈ నగదు పూర్తిగా ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది. అందుకే చాలామంది ఈ తరహా సేవింగ్ పథకాలపై ఆసక్తి చూపిస్తుంటారు. 

దేశంలోని వివిధ బ్యాంకులు, పోస్టాఫీసుల్లో చాలా రకాల ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ పధకాలతో కలిగే ప్రయోజనం ఏంటంటే రిస్క్ ఏమాత్రం ఉండదు. అంటే మీ ఇన్వెస్ట్‌మెంట్ పూర్తిగా సేఫ్. పైగా వడ్డీ రూపంలో అత్యధిక లాభాలు ఆర్జించవచ్చు. ముఖ్యంగా పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్ అనేది చాలా ముఖ్యమైన సేవింగ్ పధకం. ఈ పధకం మెచ్యూరిటీ 15 ఏళ్లుంటుంది. 15 ఏళ్ల తరువాత మరో ఐదేళ్లు పొడిగించుకోవచ్చు. లేదా విత్‌డ్రా చేసుకోవచ్చు. బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా ఈ పధకాన్ని పొందవచ్చు. 

పీపీఎఫ్ పధకం మెచ్యూరిటీ పూర్తయ్యాక మొత్తం డబ్బుల్ని విత్ డ్రా చేసుకోవచ్చు. దీనిపై ఎలాంటి ట్యాక్స్ వర్తించదు. ఏడాదికి 1.5 లక్షల వరకూ నగదుపై ట్యాక్స్ మినహాయింపు పొందవచ్చు. పీపీఎఫ్ పధకాన్ని మరో ఐదేళ్లకు పొడిగించుకోవచ్చు. ఆ తరువాత మరో ఐదేళ్లు కొనసాగించవచ్చు. ఈ పధకాన్ని ఐదేళ్లు పొడిగించాలంటే ఏడాది ముందుగా సమాచారం అందించాల్సి ఉంటుంది. ఒకసారి పొడిగించిన తరువాత ఎప్పుడైనా క్లోజ్ చేసుకోవచ్చు. ఈ పధకాన్ని బ్యాంకులు లేదా పోస్టాఫీసుల్లో ఓపెన్ చేసుకోవచ్చు. 

నెలకు 1000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 15 ఏళ్లకు 3.18 లక్షలు, 20 ఏళ్లకు 5.24 లక్షలు, 25 ఏళ్లకు 81.7 లక్షలు అందుతాయి. అదే నెలకు 2000 ఇన్వెస్ట్ చేస్తే 15 ఏళ్లకు 6.37 లక్షలు, 20 ఏళ్లకు 10.49 లక్షలు, 25 ఏళ్లకు 16.35 లక్షలు తీసుకోవచ్చు. అదే నెలకు 3000 ఇన్వెస్ట్ చేస్తే 15 ఏళ్లకు 9.55 లక్షలు, 20 ఏళ్లకు 15.73 లక్షలు, 25 ఏళ్లకు 24.52 లక్షలు అందుతాయి. ఇక నెలకు 5000 ఇన్వెస్ట్ చేస్తే 15 ఏళ్లకు 15.92 లక్షలు, 20 ఏళ్లకు 26.23 లక్షల రూపాయలు, 25 ఏళ్లకు 44.88 లక్షలు పొందవచ్చు. అదే నెలకు 12,500 ఇన్వెస్ట్ చేస్తే 15 ఏళ్లకు 39.82 లక్షలు, 25 ఏళ్లకు 1 కోటి రూపాయలు తీసుకోవచ్చు

Also read: Tax Free Incomes: ఈ 5 రకాల ఆదాయాలపై ట్యాక్స్ ఉండదని మీకు తెలుసా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News