Post office Schemes: అత్యధిక వడ్డీ, జీరో రిస్క్, ట్యాక్స్ మినహాయింపు ఇచ్చే 5 పోస్టాఫీసు పథకాలు

Post office Schemes: పొదుపు, పెట్టుబడి రెండూ భవిష్యత్ కోసం చాలా మంచివి. అయితే రిస్క్ లేకుండా, అధిక లాభాలు ఇచ్చే మార్గంలో చేస్తేనే ప్రయోజనముంటుంది. మరి అలాంటి మార్గాలేమున్నాయో పరిశీలిద్దాం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jan 23, 2023, 06:06 AM IST
Post office Schemes: అత్యధిక వడ్డీ, జీరో రిస్క్, ట్యాక్స్ మినహాయింపు ఇచ్చే 5 పోస్టాఫీసు పథకాలు

రిస్క్ లేని మార్గాల్లో పెట్టుబడి పెట్టాలనుకుంటే..అధిక లాభాలు ఆర్జించిపెట్టే మార్గాలున్నాయి. పోస్టాఫీసు పథకాలు ఇందుకు ఉదాహరణ. రిస్క్ లేకుండా లాభాలు ఆర్జించే 5 పోస్టాఫీసు పథకాల గురించి తెలుసుకుందాం..

పోస్టాఫీసు అందించే ఈ 5 పథకాల్లో రిస్క్ జీరో ఉంటుంది వడ్డీ రేట్లు కూడా ఎక్కువ. దీనికితోడు ట్యాక్స్ మినహాయింపు పూర్తిగా ఉంటుంది. ట్యాక్స్ సేవింగ్ పథకాల్లో పెట్టుబడి పెట్టడం ద్వారా రిస్క్ లేకుండా ఎక్కువ లాభాలు ఆర్జించాలంటే పోస్టాఫీసు పథకాలే మంచి ప్రత్యామ్నాయాలు. ఈ పథకాల్లో ఇన్‌కంటాక్స్ సెక్షన్ 80 సి ప్రకారం ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది. ఇవి స్మాల్ సేవింగ్ పథకాల కిందకు వస్తాయి. ఈ పథకాల ప్రకారం ట్యాక్స్ మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఈ పథకాల్లో ఎంత ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది వార్షిక వడ్డీ రేటు ఎంతనే వివరాలు మీ కోసం..

పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్-పీపీఎఫ్

పబ్లిక్ ప్రోవిడెంట్ ఫండ్ కింద వార్షిక వడ్డీ 7.1 శాతం ఉంటుంది. ఇది పూర్తిగా ట్యాక్స్ ఫ్రీ పథకం. ఈ పథకం వల్ల ఇన్‌కంటాక్స్ సెక్షన్ 80 సి ప్రకారం ఏడాదికి 1.5 లక్షల వరకూ ట్యాక్స్ మినహాయింపు వర్తిస్తుంది. మరోవైపు ఏడాదికి 1.5 లక్షల వరకూ గరిష్టంగా పెట్టుబడి పెట్టవచ్చు.

సుకన్య సమృద్ధి యోజన-ఎస్ఎస్‌వై

సుకన్య సమృద్ధి యోజన అనేది పదేళ్ల వయస్సు అమ్మాయి కోసం తెరవవచ్చు. పదేళ్లు లేదా అంతకంటే తక్కువ వయస్సులో కేవలం అమ్మాయిలకు ఉద్దేశించిన పథకం. ఆ అమ్మాయి 18 ఏళ్లు నిండిన తరువాత డబ్బులు డ్రా చేయవచ్చు. ప్రస్తుతం ఈ పథకంలో 7.6 శాతం వడ్డీ లభిస్తుంది. సెక్షన్ 80 సి ప్రకారం 1.5 లక్షల ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది. 

సీనియర్ సిటిజెన్ సేవింగ్ స్కీమ్-ఎస్‌సిఎస్ఎస్

ఈ పథకం సీనియర్ సిటిజన్ల కోసం మాత్రమే. ఇందులో 55 నుంచి 60 సంవత్సరాల వయస్సు కలిగిన వాళ్లు ఓపెన్ చేయవచ్చు. ఈ పథకంలో ఒకేసారి 15 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టవచ్చు. 5 ఏళ్ల మెచ్యూరిటీ తరువాత 8 శాతం వడ్డీ ఉంటుంది. 1.5 లక్షలు ట్యాక్స్ మినహాయింపు ఉంటుంది. 

పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్

ఈ పథకం కింద వివిధ టెన్యూర్స్ ప్రకారం వడ్డీ రేటు ఉంటుంది. అత్యధికంగా 7 శాతం వడ్జీ లభిస్తుంది. ఇందులో 1000 రూపాయల్నించి ప్రారంభించవచ్చు. ఏడాదికి 1.5 లక్షల రూపాయలు ట్యాక్స్ సేవింగ్ చేయవచ్చు. గరిష్ట మెచ్యూరిటీ పీరియడ్ 5 ఏళ్లు ఉంటుంది. 

నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్

ఈ పథకం కింద వేయి రూపాయల్నించి పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకంపై 7 శాతం వడ్డీ లభిస్తుంది. ఏడాదికి 1.5 లక్షల రూపాయలు ట్యాక్స్ మినహాయింపు వర్తిస్తుంది.

Also read: Air India Offers: ఫ్లైట్ టికెట్స్‌పై బంపర్ ఆఫర్.. ఎయిర్ ఇండియా రిపబ్లిక్ డే సేల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News