Bank Holidays in January 2024: జనవరి నెలలో 16 రోజులు బ్యాంకులు బంద్.. సెలవుల జాబితా ఇదిగో..!

January Bank Holidays: జనవరి నెలలో మొత్తం 16 రోజులు బ్యాంకులకు సెలవులు రానున్నాయి. ఆయా రాష్ట్రాల పండుగల ఆధారంగా బ్యాంకులు బంద్ కానున్నాయి. మీకు బ్యాంక్‌కు సంబంధించిన ముఖ్యమైన పనిఉంటే సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసుకోండి.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 27, 2023, 02:56 PM IST
Bank Holidays in January 2024: జనవరి నెలలో 16 రోజులు బ్యాంకులు బంద్.. సెలవుల జాబితా ఇదిగో..!

January Bank Holidays: త్వరలో కొత్త సంవత్సరం ప్రారంభంకానుంది. జనవరి నెలకు సంబంధించిన బ్యాంక్ హాలీ డే జాబితాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) విడుదల చేసింది. వచ్చే నెలలో ఆయా రాష్ట్రాల్లో మొత్తం 16 రోజులు బ్యాంక్‌లు బంద్ కానున్నాయి. బ్యాంకు సెలవులు, బ్యాంకింగ్ అసోసియేషన్ల రాబోయే ప్రతిపాదిత సమ్మె కారణంగా బంద్ అయినా.. మొబైల్, ఇంటర్నెట్‌లో బ్యాంకింగ్ కార్యకలాపాలు అంతరాయం లేకుండా కొనసాగుతాయి. అయితే అన్ని రాష్ట్రాల్లో 16 రోజులు బ్యాంక్‌లకు సెలవులు ఉండవు. స్థానిక పండగల ఆధారంగా సెలవులు నిర్ణయిస్తారు. మీకు జనవరి నెలలో బ్యాంకులకు సంబంధించి ముఖ్యమైన పనులు ఉంటే.. ఆయా రోజుల సెలవుల జాబితాను చెక్ చేసుకోని వెళ్లండి.

==> నూతన సంవత్సర దినోత్సవం: జనవరి 1
==> జనవరి 7: ఆదివారం
==> మిషనరీ దినం: జనవరి 11 (మిజోరం)
==> స్వామి వివేకానంద జయంతి: జనవరి 12 (పశ్చిమ బెంగాల్)
==> లోహ్రి: జనవరి 13 (పంజాబ్, ఇతర రాష్ట్రాలు)
==> మకర సంక్రాంతి: జనవరి 14 
==> పొంగల్: జనవరి 15
==> తిరువళ్లువర్ దినోత్సవం: జనవరి 16 (తమిళనాడు)
==> గురు గోవింద్ సింగ్ జయంతి: జనవరి 17
==> జనవరి 21: ఆదివారం
==> సుభాష్ చంద్రబోస్ జయంతి: జనవరి 23
==> గణతంత్ర దినోత్సవం: జనవరి 26
==> థాయ్ పూసం/ఎండీ హజారత్ అలీ పుట్టినరోజు: జనవరి 25 (కొన్ని రాష్ట్రాల్లో)
==> జనవరి 27: నాల్గవ శనివారం
==> జనవరి 28: ఆదివారం

బ్యాంకు సెలవులు వివిధ రాష్ట్రాలను బట్టి మారుతూ ఉంటాయి. బ్యాంకింగ్ సెలవులు నిర్దిష్ట రాష్ట్రాలలో జరుపుకునే పండుగలు లేదా ఆ రాష్ట్రాల్లో నిర్దిష్ట సందర్భాల నోటిఫికేషన్‌పై కూడా ఆధారపడి మారుతూ ఉంటాయి. అయితే దేశవ్యాప్తంగా జనవరి నెలలో ఎక్కువ సెలవులే రానున్నాయి. నూతన సంవత్సరం, సంక్రాంతి సెలవులు, రిపబ్లిక్ డే సందర్భంగా సెలవులు ఎక్కువగానే ఉన్నాయి. ఆయా సెలవుల జాబితాను చెక్ చేసుకుని.. బ్యాంకులకు వెళ్లండి. 

Also Read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం

Also Read: Corona Jn.1 Precautions: దేశంలో కరోనా కొత్త వేరియంట్ భయం, లక్షణాలెలా ఉంటాయి

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News