Jagan Tsunami: ఏపీలో అధికారం ఎవరిది, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న జగన్ సునామీ హ్యాష్‌ట్యాగ్

Jagan Tsunami: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఘట్టం ముగిసింది. ఒంటరిగా అధికార పార్టీ, మూడు పార్టీలతో కూటమి బరిలో దిగాయి. హోరాహోరీ ప్రచారం అనంతరం పోలింగ్ ముగించుుకుని ఇప్పుడు సమీకరణాల్లో, పోలిగ్ సరళిపై పడ్డాయి. ఎవరికివారు గెలుపోటములపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 13, 2024, 09:14 PM IST
Jagan Tsunami: ఏపీలో అధికారం ఎవరిది, సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న జగన్ సునామీ హ్యాష్‌ట్యాగ్

Jagan Tsunami: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వైనాట్ 175 లక్ష్యంతో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బరిలో నిలిస్తే బీజేపీ-జనసేన-తెలుగుదేశం పార్టీలు కూటమిగా పోటీ చేశాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి చెబుతున్నట్టుగానే ఎన్నికల్లో గెలిచేది తామేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యర్ధుల బలాలు, బలహీనతల ఆధారంగా అంచనా వేసి వ్యూహాలతో ఎన్నికలు పూర్తి చేశారు.

మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా తెలుగుదేశం-జనసేన-బీజేపీలు పోటీ చేశాయి. అన్ని లెక్కలు తమకే కలిసొస్తాయంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 79-80 శాతం పోలింగ్ నమోదు కావచ్చని అంచనా. పోలింగ్ సరళిని బట్టి రాజకీయ పార్టీలు దేనికవే అంచనాలు వేస్తున్నాయి. సాయంత్రం 5 గంటల వరకూ 68.09 శాతం పోలింగ్ నమోదైతే 6 గంటల తరువాత కూడా క్యూలైన్లలో ఉన్న ఓటర్లను కలుపుకుంటే 79 శాతం వరకూ చేరవచ్చని తెలుస్తోంది. వాస్తవానికి మాత్రం పోలింగ్ సరళిని బట్టి అంచనా వేయలేని పరిస్థితి నెలకొంది. ఓటర్ల తీర్పు చాలా నియోజకవర్గాల్లో నిశ్శబ్దంగా ఉందని అంచనా.

మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మాత్రం జగన్ సునామీ అనే ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. మరోసారి తామే అధికారంలో వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. జగన్ సునామీ అనే హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ సరళి చూస్తుంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే అధికారం చేజిక్కించుకుంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో మాత్రం జగన్ సునామీ ట్యాగ్ గట్టిగా ట్రెండ్ అవుతోంది. 

Also read: Rain Alert: ఏపీలో రానున్న రెండ్రోజులు మోస్తరు వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News