JanaSena Party: జనసేనకు డబుల్‌ బొనాంజా.. జానీ మాస్టర్‌, పృథ్వీ చేరిక.. గాజు గ్లాస్‌ గుర్తు కేటాయింపు

Glass Symbol Allott: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. అధికార పార్టీపై దూకుడుగా వెళ్తున్న జనసేనకు ఒకేరోజు డబుల్‌ బొనాంజా తగిలింది. పార్టీలోకి సినీ ప్రముఖులు జానీ మాస్టర్‌, పృథ్వీరాజ్‌ చేరగా.. ఇదే రోజు కేంద్ర ఎన్నికల సంఘం గాజు గ్లాస్‌ గుర్తును తిరిగి కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ రెండు పరిణామాలతో జన సైనికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jan 24, 2024, 08:16 PM IST
JanaSena Party: జనసేనకు డబుల్‌ బొనాంజా.. జానీ మాస్టర్‌, పృథ్వీ చేరిక.. గాజు గ్లాస్‌ గుర్తు కేటాయింపు

Joinings in JanaSena Party: తెలుగుదేశం పార్టీతో పొత్తు కొనసాగిస్తున్న జనసేన పార్టీకి ఒకే రోజు రెండు అనూహ్య పరిణామాలు జరిగాయి. ఒకటి పోయిన గాజు గ్లాస్‌ తిరిగి రాగా.. మరొటి తెలుగు సినీ పరిశ్రమకు చెందిన జానీ మాస్టర్‌, పృథ్వీ పార్టీ కండువా వేసుకున్నారు. ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని వారిద్దరికీ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సూచించారు. తాజా పరిణామాలతో జన సైనికులు ఆనందంలో మునిగారు. ఈ మేరకు పార్టీ కార్యాలయం రెండు ప్రకటనలు విడుదల చేసింది. 

ఏపీలోని మంగళగిరిలో ఉన్న పార్టీ ప్రధాన కార్యాలయంలో బుధవారం ప్రముఖ సినీ నటుడు, ఎస్వీబీసీ మాజీ చైర్మన్‌ పృథ్వీరాజ్‌ జనసేన కండువా వేసుకున్నారు. పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ కండువా వేసి పృథ్వీని ఆహ్వానించారు. అనంతరం ప్రముఖ కొరియోగ్రాఫర్‌ షేక్‌ జానీ మాస్టర్‌ జనసేన తీర్థం పుచ్చుకున్నారు. వారిద్దరినీ అభినందించిన పవన్‌ కల్యాణ్‌ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు. పార్టీ విధానాలు, సిద్ధాంతాలు, ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని చెప్పారు. ప్రచారంలోనూ, పార్టీ కార్యక్రమాల్లోనూ చురుగ్గా పాల్గొనాలని వారికి సూచించారు. కొంతకాలంగా వీరిద్దరూ ప్రజల్లో తిరుగుతున్నారు. పృథ్వీరాజ్‌ గతంలో వైఎస్సార్‌సీపీలో పని చేశారు. ఆ సమయంలోనే సీఎం జగన్‌ ఎస్వీబీసీ చైర్మన్‌గా అవకాశం ఇచ్చారు. అయితే ఒక వివాదం కారణంగా పృథ్వీరాజ్‌ తీవ్ర విమర్శల పాలయ్యారు. కొన్నాళ్లు ఖాళీగా ఉన్న అతడు ఎన్నికల సమయం రావడంతో జనసేనలో చేరాడు.

ఇక కొరియోగ్రాఫర్‌ జానీ మొదటి నుంచి పవన్‌ కల్యాణ్‌కు వీరాభిమాని. అతడి సినీ కెరీర్‌ పవన్‌తో ప్రారంభమైంది. సినీ పరిశ్రమలో పవన్‌ను గురువుగా భావిస్తుంటాడు. ఇటీవల అంగన్‌వాడీ కార్యకర్తల ఆందోళన కార్యక్రమాల్లో జానీ పాల్గొని మద్దతు పలికారు. అనూహ్యంగా ప్రజల్లోకి రావడంతో జానీ రాజకీయాల్లోకి ప్రవేశిస్తారని ప్రచారం జరిగింది. తాజా చేరికతో ఆ ప్రచారం వాస్తవంగా తేలింది. వీరిద్దరూ టికెట్‌ ఇవ్వకున్నా కూడా ఎన్నికల సమయంలో పార్టీకి మద్దతుగా పని చేస్తారని సమాచారం. 

గాజు గ్లాస్‌ తిరిగి కేటాయింపు
గత ఎన్నికల్లో జనసేన పార్టీకి కేటాయించిన 'గాజు గ్లాస్‌' గుర్తును ఇటీవల ఎన్నికల సంఘం అన్‌ రిజర్వ్‌డ్‌ జాబితాలో చేర్చింది. తమ పార్టీకి రిజర్వ్‌ చేయించాలని జనసేన విజ్ణప్తి చేయడంతో మరోసారి గాజు గ్లాస్‌ గుర్తును కేటాయిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులకు గాజు గ్లాస్‌ గుర్తు కేటాయించాలని ఏపీ ఈసీకి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ ఉత్తర్వులను పార్టీ లీగల్‌ సెల్‌ చైర్మన్‌ ఇవన సాంబశివ ప్రసాద్‌ పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌కు అందించారు.

Also Read: KTR Counter Attack: హామీలు నెరవేర్చని కాంగ్రెసోళ్లను ఏ 'చెప్పు'తో కొట్టాలి: కేటీఆర్‌

Also Read: Parliament Elections: కాంగ్రెస్‌కు మమత భారీ షాక్‌.. బెంగాల్‌లో కటీఫ్‌.. ఢిల్లీలో దోస్తీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News