AP Assemble Elections 2024 Updates: ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు నేడే, పోలింగ్ శాతం పెరగనుందా

AP Assembly Election 2024 Polling live Updates: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ఇవాళ జరగనున్నాయి. 25 పార్లమెంట్, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభం కానుంది. ఈసారి పోలింగ్ శాతం మరింతగా పెంచేందుకు ఎన్నికల సంఘం ప్రత్యేక శ్రద్ధ సారించింది. పూర్తి వివరాలుఇలా ఉన్నాయి.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 13, 2024, 05:42 AM IST
AP Assemble Elections 2024 Updates: ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు నేడే, పోలింగ్ శాతం పెరగనుందా

AP Assembly Election 2024 Polling live Updates:  ఇవాళ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మాక్ పోలింగ్ అనంతరం పోలింగ్ ప్రక్రియ మొదలుకానుంది. మావోయిస్టు ప్రభావిత ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రం సాయంత్రం 4, 5 గంటలకు పోలింగ్ ముగియనుంది. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా 169 నియోజకవర్గాల్లో ఉదయం 7 గంటల్నించి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది. ఇక అరకు, పాడేరు, రంపచోడవరం నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగుస్తుంది. పాలకొండ, సాలూరు, కురుపాం నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగియనుంది. రాష్ట్రవ్యాప్తంగా 46,389 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య 4 కోట్ల 14 లక్షలు కాగా అందులో పురుషులు 2.3 కోట్లు, మహిళలు 2.10 కోట్లున్నారు. ఇక ధర్డ్‌జెండర్ ఓట్లు 3,421 ఉన్నాయి. సర్వీస్ ఓటర్ల సంఖ్య 68,185 ఉంది. రాష్ట్రవ్యాప్తంగా 25 లోక్‌సభ, 175 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికలకు మొత్తం 1.6 లక్షల ఈవీఎం మెషీన్లు వినియోగిస్తున్నారు. 

ఉదయం 7 గంటల్నించి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ నిర్వహించడం ద్వారా ఓటింగ్ పై వేసవి ప్రభావం లేకుండా చూసేందుకు ఎన్నికల సంఘం ప్రయత్నిస్తోంది. పోలింగ్ కేంద్రాల్లో తాగునీటి సదుపాయం, ఎండల్ని దృష్టిలో ఉంచుకుని నీడ కల్పించేలా టెంట్లు వేయడం వంటివి చేస్తున్నారు. వడదెబ్బ తగిలితే తక్షణం వైద్య సదుపాయం అందించేలా మెడికల్ కిట్లు అందుబాటులో ఉంచుతున్నారు. 2019 ఎన్నికల్లో ఏపీలో 79.77 శాతం పోలింగ్ నమోదైంది. ఈసారి మరింత ఎక్కువగా పోలింగ్ నమోదయ్యేలా ఎన్నికల సంఘం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.

రాష్ట్రంలోని పోలింగ్ కేంద్రాల్లో సెక్షన్ 144 అమల్లో ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా 3.30 లక్షల మంది పోలింగ్ సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు. 1.14 లక్షల మంది పోలీసులను భద్రత కోసం ఉపయోగిస్తున్నారు. అదనంగా 10 వేల మంది సెక్టార్ అధికారులు, 18,961 మంది మైక్రో అబ్జర్వర్లు, 46,165 మంది బీఎల్ఓలు విధుల్లో ఉంటారు. మొత్తం 5.26 లక్షలమంది ఎన్నికల విధులు నిర్వహించనున్నారు.

ఏపీ ఎన్నికల్లో ఈసారి 30,111 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ఉంటుంది. 12,459 కేంద్రాల్ని సున్నితంగా గుర్తించారు. పోలింగ్ కేంద్రాల్లో ఫోన్లకు అనుమతి లేదు. జూన్ 1 వరకూ ఎగ్జిట్ పోల్స్‌పై నిషేధం ఉంటుంది. పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల దూరం వరకూ స్లిప్పులు పంపిణీ చేయవచ్చు. 

Also read: Loksabha polls 2024: ప్రతి ఒక్కరూ ఓటు హక్కును స్వేచ్ఛగా, నిర్భయంగా వినియోగించుకోవాలి..

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News