Mahashivratri 2024: నంది కొమ్ముల మధ్యలో నుంచి శివయ్య దర్శనం.. దీని వెనుక ఉన్న ఈ రహస్యం మీకు తెలుసా..?

Darshan Of Lord Shiva Via Nandi's Horns: శివుడిని భోళా శంకరుడు అనికూడా పిలుస్తుంటారు. కేవలం భక్తితో ఆయనను కొలిస్తే ఎలాంటి వరాలనైన ఇచ్చేస్తుంటాడు. అందుకే దానవులు ఎక్కువగా శివుడిని గురించి మాత్రమే తపస్సు చేస్తుండేవారు. శివుడికి దగ్గర ప్రమథగణాలు ఉంటారు. వీరిలో ముఖ్యంగా నందిని శివుడు తన వాహనంగా ఎంచుకున్నారు. 
 

1 /6

మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులంతా శివుడిని ప్రత్యేకంగా పూజలు చేస్తుంటారు. ఈ రోజు ఉదయాన్నే లేచీ స్నానం తర్వాత పూజలు  నిర్వహించుకోవాలి. శివుడు అభిషేక ప్రియుడు అని పిలుస్తారు. ఆయనకు కలశం నిండా నీళ్లు, ఒక బిల్వపత్రి సమర్పిస్తే ఎలాంటి కోరికలనైన ఇట్టే తీరుస్తాడంటారు..  

2 /6

ఈ రోజు ఎక్కువ మంది భక్తులు ఉపవాసం ఉంటారు. అది కుదరనివారు.. ఫలాలు, టిఫిన్ లు తిని ఉపవాసం ఉంటారు. కొందరు మంచి నీళ్ల మీదనే ఉపవాసం ఉంటారు. శివుడికి తెల్లని పూలు అంటే ఎంతో ఇష్టం. అందుకే పూజలో తెల్లని రంగు పూలను ఎక్కువగా ఉపయోగించాలి. శివుడి పూజలో తులసీని అస్సలు ఉపయోగించకూడదు.  

3 /6

మనం  ఏ గుడికి వెళ్లిన గుడిలో ప్రవేశించగానే శివుడి గర్భగుడి ముందు నందీశ్వరుడు ఉంటారు. శివుడికి నందీశ్వరుడి వాహనం. శివపురాణం ప్రకారం.. నందీశ్వరుడు తనకు ఎప్పుడు నీ రూపమే కన్నుల ముందు ఉండేలా వరము అడిగాడంట. దీనికి శివయ్య తథాస్తు అన్నారంట. అప్పటి నుంచి శివుడి ముందు తప్పకుండా నందీశ్వరుడు ఉంటాడు.  

4 /6

అసలు నందీశ్వరుడి లేదని ఏ శివాలయం కూడా ఉండదు.  విష్ణువుకు గరుడుడు, గణేషుడికి మూషికం, కుమార స్వామికి నెమలి.. ఇలా శివుడికి నందీశ్వరుడి వాహనంగా భావిస్తారు. నంది కొమ్ముల మధ్యలో నుంచి శివయ్యను దర్శనం చేసుకుంటే వెయ్యి రెట్లు పుణ్యం వస్తుందంట..

5 /6

శివుడి ముందున్న నంది ముందు మన కుడి చేయ్యి బోటన వేలు, మధ్యవేలును కొమ్ముల మీద ఉంచి, ఎడమ చెయ్యిని నందిశ్వరుడి వెనుక భాగం మీద పెట్టి శివయ్యను దర్శనం చేసుకొవాలి. ఇలా దర్శనం చేసుకుంటే మన పాపాలన్ని నశించిపోతాయి. అంతే కాకుండా.. శివుడి చెవిలో మన గోత్రం, మన సమస్యలు చెబితే ఆయన వెళ్లి స్వామివారికి చెప్తాడని కూడా పండితులు చెబుతుంటారు. 

6 /6

మహశివరాత్రి రోజు నందీశ్వరుడికి ఏదైన తినిపిస్తే మంచిదంటారు. ఈరోజు ప్రత్యేకంగా నందికి ఇష్టమైన పదార్థాలు తినిపించాలి. కొందరు ఆకుకూరలు, పండ్లు తినిపిస్తుంటారు. గోమాత అనువణువున కూడా కోట్లాది హిందూ దేవతలు ఉంటారు. ఇలా భక్తితో పూజిస్తే మన కోరికలన్ని నెరవేరుతాయని పండితులు చెబుతుంటారు. Disclaimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్నవి వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)