Facial glow: ఈ 2 కిచెన్ వస్తువులు చాలు.. మీ ఫేస్ ఫేషియల్‌ చేసినట్లు మెరిసిపోతుంది..

Facial glow with Kitchen Ingredients: సాధారణంగా మన ముఖం మెరిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. లేదంటే నిర్జీవంగా, డల్‌గా మారిపోతుంది.

Written by - Renuka Godugu | Last Updated : Apr 28, 2024, 05:09 PM IST
Facial glow: ఈ 2 కిచెన్ వస్తువులు చాలు.. మీ ఫేస్ ఫేషియల్‌ చేసినట్లు మెరిసిపోతుంది..

Facial glow with Kitchen Ingredients: సాధారణంగా మన ముఖం మెరిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. లేదంటే నిర్జీవంగా, డల్‌గా మారిపోతుంది. ముఖంపై తిరిగి కాంతిని పొందడానికి కొన్ని రెమిడీ ట్రై చేయండి. పార్లర్లకు వెళ్లి వేల ఖర్చు చేయకుండా సులభంగా సహజసిద్ధంగా ఈ వస్తువులతో ముఖం రెట్టింపు కాంతివంతమవుతుంది. 
ఆ వస్తువులు ఏంటో తెలుసుకుందాం.

పసుపు, టమాట.. ఈ రెండు వస్తువులు మీ ముఖానికి మేలు చేస్తాయి. టమాట ముఖాన్ని మెరిపిస్తుంది. హైడ్రేషన్‌ అందిస్తుంది. ప్రతిరోజూ ఒక టమాట తిన్నా ముఖానికి రెట్టింపు ముఖఛాయ వస్తుంది. పసుపును వేల సంవత్సరాలుగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా సౌందర్య ఉత్పత్తుల్లో వినియోగిస్తారు. పసుపులో కర్కూమిన్ ఉంటుంది. ఇందులో మెడిసినల్‌ గుణాలు ఉంటాయి. ఈ రెండు వస్తువులు మన ఇంట్లో ఉంటాయి.

ఫేస్‌ప్యాక్‌..
టమాటా పసుపు మన వంటగదిలో నిత్యం అందుబాటులో ఉంటాయి. ఇవి ముఖానికి అప్లై చేయడం వల్ల ముఖానికి ఫేషియల్‌ గ్లో వస్తుంది. మీ ముఖం కాంతివంతంగా మెరిసిపోతుంది ఫేషియల్ చేసినంత మెరుపు వస్తుంది అంటే మీరు నమ్ముతారా? ఈ రెండు వస్తువులతో ఏ ఖర్చు లేకుండా ఇంట్లోనే సులభంగా ఫేషియల్ చేసుకోవచ్చు అది ఎలాగో తెలుసుకుందాం.

టమాటా, పసుపు ఫేస్‌ ప్యాక్..
కావలసిన పదార్థాలు..
పండిన టమాటో ఒకటి 
పసుపు-అర టీ స్పూన్ 

ఇదీ చదవండి: : ఈ ఆహారాలను ఎప్పుడూ ఫ్రిజ్‌లోనే పెట్టాలి.. ఎందుకో తెలుసా?

ఫేస్ ప్యాక్ తయారీ విధానం..
ముందుగా టమాటాలను శుభ్రంగా కట్టేసి చిన్న పీసులుగా కట్ చేసి పెట్టుకోవాలి. దీన్ని బ్లెండర్ లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పల్పులోకి పసుపు యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి
ఈ పేస్టును ముఖం మెడ భాగంలో అప్లై చేసుకోవాలి కంటి భాగం నుంచి దూరంగా ఉంచాలి
ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేసుకునే ముందు మేకప్ ఏదైనా ఉంటే తీసివేయాలి ఫేస్ నీట్ గా క్లీన్ చేసుకోవాలి
ఈ ఫేస్ ప్యాక్ ను ఒక 20 నిమిషాల పాటు అలాగే ఆరనివ్వాలి. ఆ తర్వాత మామూలు నీటితో ఫేస్ వాష్ చేసుకోవాలి. 

ఇదీ చదవండి: ఎండకాలం ముఖంపై ట్యాన్ పేరుకుందా? ఈ కాఫీ స్క్రబ్‌ వేస్తే ముఖం తాజాగా కనిపిస్తుంది..

ఈ పేస్ట్‌ ను ముఖానికి అప్లై చేసి చేతులతో రుద్దుతూ సర్కిలర్ మోషన్ లో ఎక్స్పోజిట్ చేస్తూ ఫేస్ వాష్ చేసుకోవాలి. ముఖాన్ని శుభ్రంగా కడిగిన వెంటనే మాయిశ్చరైసర్ రాసుకోవాలి. ఒకనికి ఇలా మాయిశ్చరైసర్ రాసుకోవడం వల్ల హైడ్రేషన్ నిలుపుకొని ఉంటుంది. ఈ ఫేస్ ప్యాక్ అప్లై చేసుకునే ముందు ప్యాచ్ టెస్ట్ చేయడం ఎంతో ముఖ్యం ఎలర్జీ ఉన్నవాళ్లు వీటికి దూరంగా ఉండడం మేలు.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News