Reservations: రిజర్వేషన్లపై బీజేపీ యూటర్న్‌? మోహన్‌ భగవత్‌ సంచలన వ్యాఖ్యలు

Mohan Bhagwat Sensational Comments On Reservations In Hyderabad: పార్లమెంట్‌ ఎన్నికల సమయంలో రిజర్వేషన్ల అంశం చిచ్చురేపుతుండగా.. దీనిపై బీజేపీ మాతృ సంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ ఓ సంచలన ప్రకటన చేసింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 28, 2024, 02:44 PM IST
Reservations: రిజర్వేషన్లపై బీజేపీ యూటర్న్‌? మోహన్‌ భగవత్‌ సంచలన వ్యాఖ్యలు

Reservations Row: లోక్‌సభ ఎన్నికల వేళ 'రిజర్వేషన్లు' అంశం తీవ్ర రాజకీయ వివాదానికి దారి తీసింది. బీజేపీని మూడోసారి గెలిపిస్తే 'రిజర్వేషన్లు ఎత్తి వేస్తుంది' అని ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌ పార్టీ ఆరోపిస్తోంది. ఇతర ప్రతిపక్షాలు కూడా ఇవే వాదనలు చేస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీ మాతృసంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘం (ఆర్‌ఎస్‌ఎస్‌) చీఫ్‌ మోహన్‌ భగవత్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్ల రద్దుపై కీలక ప్రకటన చేశారు. 'రిజర్వేషన్లకు ఆర్‌ఎస్ఎస్‌ వ్యతిరేకం కాదు' అని స్పష్టం చేశారు. ఆయన చేసిన ప్రకటనపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. కాగా ముస్లిం రిజర్వేషన్లు ఎత్తివేస్తామని చెబుతున్న అమిత్‌ షాకు భారీ షాక్‌ తగిలింది.

Also Read: Congress : కాంగ్రెస్‌ పార్టీకి భారీ ఎదురుదెబ్బ.. ఢిల్లీలో ప్రముఖ నాయకుడు ఔట్

 

హైదరాబాద్‌లోని నాదర్‌గుల్‌లోని విద్యాభారతి విజ్ఞాన కేంద్రం ప్రారంభోత్సవంలో ఆదివారం మోహన్‌ భగవత్‌ పాల్గొన్నారు. ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ.. రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావించారు. 'రిజర్వేషన్లకు మేం వ్యతిరేకం అంటూ ఓ వీడియో వైరల్‌ అవుతోంది. కానీ మేం రిజర్వేషన్లకు వ్యతిరేకం కాదు' అని ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల వేళ తమపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని తెలిపారు. సమాజంలో తారతమ్యాలు.. భేదభావాలు పోయే వరకు రిజర్వేషన్లు ఉండాల్సిందే' అని స్పష్టం చేశారు.

Also Read: Lok Sabha Polls: ఐదుగురి ప్రాణం తీసిన 'ఓటు'.. వడదెబ్బతో రాలిన పండుటాకులు

 

'రిజర్వేషన్లు ఆర్‌ఎస్‌ఎస్‌ పూర్తిగా సమర్ధిస్తుంది. ఎవరి కోసం కేసటాయించారో వారి అభివృద రిజర్వేషన్ల అంశంపై ఏఐ (ఆర్టిఫియల్‌ ఇంటలిజెన్స్‌' ఉపయోగించి తప్పుడు వీడియోలు సృష్టిస్తున్నారని మోహన్‌ భగవత్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజంలో వివాదాలు, విద్వేషాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సామాజిక మాధ్యమాలను మంచి కోసం వినియోగించుకోవాలని సూచించారు.

లోక్‌సభ ఎన్నికల్లో 400 స్థానాలు లక్ష్యంగా చేసుకున్న బీజేపీ అదే స్థాయిలో ఫలితాలు సాధిస్తే భారత రాజ్యాంగం మొత్తం మార్చేసి రిజర్వేషన్లు రద్దు చేస్తుందని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ, జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గే, ఇతర ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల్లో రిజర్వేషన్ల రద్దు కేంద్రంగా రాజకీయాలు జరుగుతున్నాయి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News