Toilet Cleaner Mixed Food: నా భార్యకు టాయ్ లెట్ క్లీనర్ కల్పిన ఫుడ్ ఇచ్చారు.. సంచలన ఆరోపణలు చేసిన ఇమ్రాన్ ఖాన్..

Toilet Cleaner Mixed Food: జైలు సిబ్బందిపై పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచలన ఆరోపణలు చేశారు. తన భార్య బుమ్రాకు ప్రతిరోజు టాయ్ లెట్ క్లీనర్ కల్పిన ఫుడ్ ఇస్తున్నారన్నారు. దీంతో తన భార్య కడుపునొప్పి సమస్యతో బాధపడుతుందని కోర్టులో ఇమ్రాన్ చెప్పారు.

Written by - Inamdar Paresh | Last Updated : Apr 20, 2024, 08:57 AM IST
  • కోర్టులో తన బాధలను చెప్పుకున్న ఇమ్రాన్ ఖాన్..
  • తన భార్యను చంపడానికి చూస్తున్నట్లు వ్యాఖ్యలు..
Toilet Cleaner Mixed Food: నా భార్యకు టాయ్ లెట్ క్లీనర్ కల్పిన ఫుడ్ ఇచ్చారు.. సంచలన ఆరోపణలు చేసిన ఇమ్రాన్ ఖాన్..

Pakistan Former PM Imran Khan Claims Bushra Bibi: పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారంగా మారాయి. పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్.. ప్రస్తుతం ఇస్లామాబాద్ లోని జైలులో ఉన్నారు. శుక్రవారం నాడు రావల్పిండిలోని అడియాలా జైలులో 190 మిలియన్ పౌండ్ల అవినీతి కేసు విచారణకు కోర్టులో హజరయ్యారు. ఈ నేపథ్యంలో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ.. తన ఉంటున్న జైలులో అదనపు బ్యారల్స్ నిర్మించారన్నారు. అంతేకుండా తనకు ఎవరితోను మాట్లాడే పరిస్థితి లేకుండా చేశారన్నారు. తన భార్య బుమ్రాకు జైలు అధికారులు టాయ్ లెట్ క్లీనర్ కల్పిన ఫుడ్ ను ఇస్తున్నారని ఆరోపించారు. జైలులోని వాతావరణం పూర్తిగా భిన్నంగా ఉందన్నారు. తన భార్య ప్రతిరోజు కడుపు నొప్పి సమస్యలను ఎదుర్కొంటుందన్నారు. తన భార్యకు సరైన వైద్య సదుపాయాలు కూడా కల్పించడంలేదన్నారు.

Read More: Venomous Snakes Facts: పాముల గురించి ఈ షాకింగ్ విషయాలు మీకు తెలుసా..?

షిఫా ఇంటర్నేషనల్ హాస్పిటల్‌లో బుష్రా బీబీకి పరీక్షలు నిర్వహించాలని షౌకత్ ఖానుమ్ హాస్పిటల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అసిమ్ యూసఫ్ సూచించారని తెలిపారు. కానీ దీనికి భిన్నంగా జైలు అధికారులు మాత్రం.. పాకిస్తాన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (పిమ్స్) ఆసుపత్రిలో పరీక్ష నిర్వహించడంపై జైలు యంత్రాంగం మొండిగా ఉందని ఇమ్రాన్ ఖాన్ కోర్టు వారికి తెలిపారు. బుష్రా బీబీ ఆహారంలో టాయిలెట్‌ క్లీనర్‌ కలిపడం వల్ల తను ఎంతో అలసట, చికాకుకు గురౌతుందన్నారు. ఇలా జరిగితే తన భార్యప్రాణాలకు ముప్పువాటిల్లే అవకాశం కూడా ఉందని, ఇమ్రాన్ ఖాన్ కోర్టు వారికి తన ఆవేదన వ్యక్తం చేశాడు.

ఇదిలా ఉండగా.. విచారణ సందర్భంగా ఇమ్రాన్‌ఖాన్‌కు ‘విలేఖరుల సమావేశాలు’ ఎక్కువగా  నిర్వహించడం మానుకోవాలని కోర్టు సూచించింది. దీనికి కౌంటర్ గా.. PTI వ్యవస్థాపకుడు ఇమ్రాన్  తన ప్రకటనలు, జైలులో ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రజలముందుంచడానికి  మాత్రమే విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్నట్లు ఇమ్రాన్ ఖాన్ క్లారిటీ ఇచ్చారు. నివేదికల ప్రకారం, విచారణ తర్వాత జైలు పరిపాలన విభాగం మీడియాను కోర్టు గదికి రావడానికి అనుమతించట్లేదని, తన వాదనలు,  విలేకరులతో పంచుకోవడానికి 10 నిమిషాల ఇంటరాక్షన్‌కు అనుమతించాలని ఆయన కోర్టును కోరారు.

ఇదిలా ఉండగా..  ఏప్రిల్ 15 న, బుష్రా బీబీ ఇస్లామాబాద్ హైకోర్టు (ఐహెచ్‌సి) ముందు ఒక పిటిషన్‌ను దాఖలు చేసింది.  షౌకత్ ఖానుమ్ ఆసుపత్రి లేదా ఆమెకు నచ్చిన మరేదైనా ప్రైవేట్ ఆసుపత్రి నుండి తనకు విషం ఉందో లేదో పరీక్షించడానికి  వైద్య పరీక్షలు నిర్వహించుకునేఉ అవకాశం ఇవ్వాలని కోర్టును అభ్యర్థించింది. కలుషిత ఆహారం తినడనం వల్ల.. తనకు గుండెల్లో మంట, గొంతు, నోటిలో నొప్పులు వస్తున్నాయని, విషపూరిత భోజనం తినడం వల్లే ఇలా జరుగుతుందని నమ్ముతున్నానని బుష్రా బీబీ తన పిటిషన్‌లో పేర్కొంది.

Read More: Woman Harassment: ఎన్నికల వేళ కాంగ్రెస్ నేత పాడుపని.. మహిళల బాత్రూం లోకి దూరి ఫోటోలు, వీడియోలు..

పాక్ మీడియా డాన్ నివేదిక ప్రకారం.. సబ్ జైలైన బనిగల నివాసంలో విషమిచ్చి మానసికంగా హింసించారని ఇమ్రాన్ ఖాన్ భార్య తెలిపింది. అంతేకాకుండా, తనను నిర్బంధించిన గదిలో వేర్వేరు చోట్ల స్పై కెమెరాలు అమర్చారని ఆమె ఆరోపించారు. సబ్ జైలులో ఒక మహిళ మాత్రమే ఉన్నారని, మిగిలిన సిబ్బంది పురుషులేనని, అలాంటి వాతావరణంలో తనకు అసౌకర్యం కలుగుతోందని ఆమె అన్నారు. డాన్ నివేదిక ప్రకారం, పిటిషనర్ తన కుటుంబ సభ్యులను,  న్యాయవాదులను కలవడానికి తగినంత సమయం ఇవ్వలేదని చెప్పారు. తన ప్రాథమిక హక్కులను పరిరక్షించాలని అధికారులను బుమ్రా కోరారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News