Mohan Babu, Perni Nani Meet: హైదరాబాద్‌లో మోహన్‌బాబును కలిసిన మంత్రి పేర్నినాని

Perni Nani Meets Manchu Family: మంత్రి బొత్స సత్యనారాయణ కుమారుడి వివాహానికి హైదరాబాద్‌కు వచ్చిన మంత్రి పేర్ని నాని.. మంచు ఫ్యామిలీని ప్రత్యేకంగా కలిశారు. పలు విషయాలపై వీరి మధ్య చర్చ సాగింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 11, 2022, 06:06 PM IST
  • మోహన్‌బాబుతో మంత్రి పేర్ని నాని భేటీ
  • తెలుగు సినీ పరిశ్రమ సమస్యలపై చర్చ
  • సీఎం జగన్ భేటీలో కనిపించని మంచు ఫ్యామిలీ
  • తాజాగా మంత్రి భేటీతో మళ్లీ వార్తలోకి ఎక్కిన మంచు కుటుంబం
Mohan Babu, Perni Nani Meet: హైదరాబాద్‌లో మోహన్‌బాబును కలిసిన మంత్రి పేర్నినాని

Perni Nani meets and Mohan Babu: ప్రముఖ నటుడు మోహన్‌బాబుతో ఆంధ్రప్రదేశ్‌ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని భేటీ అయ్యారు. తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన పలు సమస్యలపై తాజాగా ఏపీ సీఎం జగన్‌ను, మంత్రి పేర్ని నానిని.. పలువురు సినీ ప్రముఖులు కలిసిన విషయం తెలిసిందే. అయితే ఈ భేటీలో మంచు ఫ్యామిలీ నుంచి ఎవరూ పాల్గొనకపోవడం చర్చనీయాంశంగా మారింది. 

ఈ నేపథ్యంలో మంత్రి పేర్ని నాని హైదరాబాద్‌లో మోహన్‌బాబును కలవడం ప్రత్యేకతను సంతరించుకుంది. కాగా మంత్రి పేర్ని నాని, మోహన్‌బాబు మధ్య జరిగిన భేటీలో సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పలు విషయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. 

ఇక తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న పలు సమస్యలను వివరించేందుకు చిరంజీవి, మహేశ్‌, ప్రభాస్‌, రాజమౌళి, కొరటాల శివ తదితరులు తాజాగా ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. అయితే తాము సీఎం ముందు ఉంచిన ప్రతిపాదనలన్నింటికీ ఆయన సానుకూలంగా స్పందించారంటూ వారు పేర్కొన్నారు. 

అంతేకాదు సీఎం జగన్‌కు మీడియా వేదికగా ధన్యవాదాలు చెప్పడమే కాదు.. సోషల్‌ మీడియాలోనూ థ్యాంక్స్ చెప్తూ.. ట్వీట్స్ చేశారు. మెగాస్టార్‌‌తో పాటు మహేశ్‌బాబు, రాజమౌళి, తదితరులు సీఎం జగన్‌కు థ్యాంక్స్‌ చెప్తూ ట్వీట్స్‌ చేశారు. ఈ పోస్ట్‌లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

అయితే నిన్న సీఎం జగన్‌ కలిసిన సినీ ప్రముఖుల్లో మంచు ఫ్యామిలీ నుంచి మోహన్ బాబు లేదా మంచు విష్ణు లేకపోవడంతో సోషల్ మీడియాలో అందరూ మంచు ఫ్యామిలీ ఎక్కడా అంటూ పోస్ట్స్‌ చేశారు. ఈ నేపథ్యంలో బొత్స సత్యనారాయణ కొడుకు పెళ్లికి హైదరాబాద్‌ వచ్చిన మంత్రి పేర్ని... మోహన్‌ బాబును కలవడం చర్చనీయాంశంగా మారింది. సోషల్‌ మీడియాలో ఇప్పుడు.. మంచు ఫ్యామిలీని మంత్రి పేర్ని నాని కలవడంపైనే డిస్కషన్ సాగుతోంది.

Also Read: Teenmar Mallanna Interview: రేవంత్ రెడ్డితో టచ్‌లో ఉన్నానంటున్న తీన్మార్ మల్లన్నతో బిగ్ డిబేట్ విత్ భరత్

Also Read: Hijab Controversy: హిజాబ్ వివాదాన్ని ఇంకా పెద్దది చేయకండి.. సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 

 

Trending News