Vivo V30E Price Down: ఫ్లిఫ్‌కార్ట్‌లో vivo V30e స్మార్ట్‌ఫోన్‌పై కళ్లు చెదిరే తగ్గింపు.. డిస్కౌంట్ వివరాలు!

Vivo V30E Price Down: ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన vivo V30e స్మార్ట్‌ఫోన్‌ను అతి తక్కువ ధరకు కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. ఈ మొబైల్‌పై భారీ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : May 9, 2024, 11:43 AM IST
Vivo V30E Price Down: ఫ్లిఫ్‌కార్ట్‌లో vivo V30e స్మార్ట్‌ఫోన్‌పై కళ్లు చెదిరే తగ్గింపు.. డిస్కౌంట్ వివరాలు!

Vivo V30E Price Down: ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ బిగ్‌ సెవింగ్‌ డేస్‌ సేల్‌లో భాగంగా అన్ని రకాల వస్తువులపై భారీ తగ్గింపు లభిస్తోంది. ముఖ్యంగా ఈ సేల్‌లో భాగంగా అన్ని రకాల స్మార్ట్‌ఫోన్స్‌పై భారీ డిస్కౌంట్‌ అందుబాటులో ఉంది. ముఖ్యంగా ప్రముఖ చైనీస్ బ్రాండ్ vivo లాంచ్‌ చేసిన కొన్ని మొబైల్స్‌ అతి తక్కువ ధరలోనే లభిస్తున్నాయి. దీంతో పాటు ఈ స్మార్ట్‌ఫోన్స్‌‌పై అదనంగా ఫ్లాట్‌ తగ్గింపు, బ్యాంక్‌ ఆఫర్స్‌, ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఫ్లిఫ్‌కార్ట్‌ వీవోకు సంబంధించిన ఏ స్మార్ట్‌ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం vivo V30e స్మార్ట్‌ఫోన్‌ అతి తక్కువ ధరలో లభిస్తోంది. అదనంగా దీనిపై బ్యాంక్‌ ఆఫర్స్‌ లభించడమే కాకుండా ఫ్లాట్‌ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఈ మొబైల్ రెండు స్టోరేజ్‌ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది. 128 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్‌ MRP ధర రూ.32,999తో లభిస్తోంది. అయితే బిగ్‌ సెవింగ్‌ డేస్‌ సేల్‌లో భాగంగా ఈ మొబైల్‌ను కొనుగోలు చేస్తే 15 శాతం తగ్గింపుతో కేవలం రూ.27,999కే పొందవచ్చు. దీంతో పాటు అదనంగా మరిన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. 

అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేవారికి ఫ్లిఫ్‌కార్ట్‌ గతంలో కంపెనీ అదనంగా డొమాస్టిక్‌ ఫ్లైట్స్‌పై రూ.2,500 డిస్కౌంట్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. దీంతో పాటు అదనంగా 15 శాతం ఫ్లైట్‌ తగ్గింపును కూడా అందిస్తోంది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌పై అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ ఆఫర్స్‌ వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి ఫ్లిఫ్‌కార్ట్‌ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. 

వీవో వీ30ఈ స్మార్ట్‌ఫోన్‌ టాప్‌ 10 ఫీచర్స్‌:
 6.78 అంగుళాల AMOLED డిస్ప్లే
 90Hz రిఫ్రెష్ రేటు
MediaTek Dimensity 700 ప్రాసెసర్
8GB ర్యామ్‌, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్
ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్
50MP ప్రధాన కెమెరా 
8MP అల్ట్రావైడ్ కెమెరా
2MP మాక్రో కెమెరా
50MP సెల్ఫీ కెమెరా
5500mAh బ్యాటరీ
33W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌
Android 11 ఆపరేటింగ్ సిస్టమ్‌
7.77mm స్లిమ్ డిజైన్

ఇతర ఫీచర్స్‌:
ఫోన్‌లో 5G కనెక్టివిటీ లేదు.
ఫోన్‌లో IP రేటింగ్ లేదు.
ఫోన్‌లో స్టెరియో స్పీకర్లు లేవు.
ఫోన్‌లో మైక్రో SD కార్డ్ స్లాట్ లేదు.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News