DC vs SRH Highlights: సన్‌రైజర్స్‌ మరో సంచలన విజయం.. ఢిల్లీని మడతబెట్టిన నటరాజన్‌

IPL Live Sunrisers Hyderabad Win By 67 Runs With DC: టాటా ఐపీఎల్‌ సీజన్‌లో సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ మరో సంచలన విజయాన్ని నమోదు చేసింది. భారీ పరుగులతో హ్యాట్రిక్‌ విజయాన్ని సొంతం చేసుకుని పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి దూసుకువచ్చింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 20, 2024, 11:35 PM IST
DC vs SRH Highlights: సన్‌రైజర్స్‌ మరో సంచలన విజయం.. ఢిల్లీని మడతబెట్టిన నటరాజన్‌

DC vs SRH Highlights: ఐపీఎల్‌ తాజా సీజన్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ రికార్డుల మీద రికార్డులు సృష్టించాలని కన్నేసినట్టు కనిపిస్తోంది. ఈ సీజన్‌లో మరో సంచలనాత్మక ప్రదర్శనతో మూడో రికార్డును నెలకొల్పి హ్యాట్రిక్‌ విజయాన్ని సొంతం చేసుకుంది. పరుగుల సునామీని సృష్టించిన పాట్‌ కమిన్స్‌ బృందం సొంత మైదానంలో ఢిల్లీకి భారీ షాకిచ్చింది. ఫలితంగా 67 పరుగుల తేడాతో ఢిల్లీపై హైదరాబాద్‌ విజయం సాధించింది.

భారీ స్కోర్
టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మరో సంచలన ప్రదర్శన చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 266 పరుగులు చేసింది. ట్రావిస్‌ హెడ్‌ హ్యాట్రిక్‌ ప్రదర్శన చేసి జట్టుకు మంచి ఆరంభాన్నిచ్చాడు. 32 బంతుల్లో 89 పరుగులు చేసి ఔరా అనిపించాడు. 11 ఫోర్లు, 6 సిక్స్‌లతో దుమ్ము దుళిపాడు. హెడ్‌కు ఏమాత్రం తగ్గకుండా అభిషేక్‌ శర్మ అదే స్థాయిలో ప్రదర్శన చేశాడు. 12 బంతుల్లో 46 పరుగులు చేసి దూకుడుగా ఆడాడు. పవర్‌ ప్లేను పిండేసి సెంచరీ పరుగులు చేయడం విశేషం. అనంతరం ఐడెన్‌ మార్‌క్రమ్‌ ఒక పరుగుకే పరిమితమవగా.. క్లాసెన్‌ (15), అబ్దుల్‌ సమద్‌ (13) తక్కువ పరుగులు చేశారు. భారీ స్కోర్‌ నమోదులో షాహబాద్‌ అహ్మద్‌ కీలకమైన ఇన్నింగ్స్‌ ఆడాడు. 29 బంతుల్లో 59 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్‌ అందించాడు.

బౌలింగ్ విఫలం
అత్యధిక పరుగులు చేస్తున్న హైదరాబాద్‌ను ఢిల్లీ బౌలర్లు కూడా నియంత్రించలేకపోయారు. హైదరాబాద్‌ భారీ స్కోర్‌ లక్ష్యాన్ని కుల్దీప్‌ యాదవ్‌ అడ్డుకున్నాడు. నాలుగు వికెట్లు తీసినా కూడా భారీగా పరుగులు ఇచ్చాడు. ముకేశ్‌ కుమార్‌, అక్షర్‌ పటేల్‌ ఒక్కో వికెట్‌ తీశారు. పవర్‌ ప్లే నుంచి పది ఓవర్ల వరకు బౌలర్లు పరుగులు భారీగా సమర్పించుకున్నారు. కానీ తర్వాత గొప్పగా పుంజుకుని సన్‌రైజర్స్‌ భారీ పరుగుల స్కోర్‌ కలకు కళ్లెం వేశారు. అయినా కూడా ఐపీఎల్‌లో మరో భారీ స్కోర్‌ నమోదైంది.

టాస్‌ నెగ్గి ఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ గొప్పగానే పోరాడి ఓడింది. 19.1 బంతులకే 199 పరుగులు చేసి ఢిల్లీ కుప్పకూలింది. మరో ఓటమిని చవిచూసింది. ఓపెనర్లు పృథ్వీ షా (16), డేవిడ్‌ వార్నర్‌ (1) విఫలమైన వేళ యువ సంచలనం జేక్‌ ఫ్రేజర్‌ మెక్‌గార్క్‌ మళ్లీ బ్యాట్‌తో రెచ్చిపోయి ఆడాడు. 18 బంతుల్లోనే 65 పరుగులు చేసి దూకుడు కనబర్చాడు. 5 ఫోర్లు, 7 సిక్సర్లు సత్తా చాటాడు. అభిషేక్‌ పరేల్‌ (42) గొప్పగా ఆడగా త్రిస్టన్‌ స్టబ్స్‌ (10) తక్కువ స్కోర్‌ చేశాడు. లలిత్‌ యాదవ్‌ (7), అక్షర్‌ పటేల్‌ (6), అన్రిచ్‌ నోట్జే (0) అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు.

కూలిన ఢిల్లీ
టాస్‌ నెగ్గి ఛేదనకు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌ గొప్పగానే పోరాడి ఓడింది. 19.1 బంతులకే 199 పరుగులు చేసి ఢిల్లీ కుప్పకూలింది. నటరాజన్‌ దెబ్బకు మరో ఓటమిని చవిచూసింది. ఓపెనర్లు పృథ్వీ షా (16), డేవిడ్‌ వార్నర్‌ (1) విఫలమైన వేళ యువ సంచలనం జేక్‌ ఫ్రేజర్‌ మెక్‌గార్క్‌ మళ్లీ బ్యాట్‌తో రెచ్చిపోయి ఆడాడు. 18 బంతుల్లోనే 65 పరుగులు చేసి దూకుడు కనబర్చాడు. 5 ఫోర్లు, 7 సిక్సర్లు సత్తా చాటాడు. అభిషేక్‌ పరేల్‌ (42) గొప్పగా ఆడగా త్రిస్టన్‌ స్టబ్స్‌ (10) తక్కువ స్కోర్‌ చేశాడు. లలిత్‌ యాదవ్‌ (7), అక్షర్‌ పటేల్‌ (6), అన్రిచ్‌ నోట్జే (0), కుల్దీప్‌ యాదవ్‌ (0) అలా వచ్చి ఇలా వెళ్లిపోయారు. కొండంత లక్ష్యాన్ని ఛేదించడానికి తిప్పలు పడుతున్న జట్టుకు ఓటమి అంతరాన్ని రిషబ్‌ పంత్‌ తగ్గించాడు. వరుస వికెట్లు పడుతున్న సమయంలో మైదానంలో నిలబడి నిలకడగా ఆడాడు. 35 బంతుల్లో 44 పరుగులు తీసి పంత్‌ కెప్టెన్‌ ఇన్సింగ్స్‌ ఆడాడు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News