Cyclone Alert: ఏపీకు తుపాను హెచ్చరిక, కాకినాడ-విశాఖ తీరంపై పెను ప్రభావం

Cyclone Alert: భగభగమండే ఎండల్నించి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు చల్లబడ్డాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు తుపాను గండం పొంచి ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. తుపానుకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 19, 2024, 03:16 PM IST
Cyclone Alert: ఏపీకు తుపాను హెచ్చరిక, కాకినాడ-విశాఖ తీరంపై పెను ప్రభావం

Cyclone Alert: దక్షిణ తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, దక్షిణ కర్ణాటక మీదుగా సముద్రమట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఆవహించిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఏపీ, తెలంగాణలో ఇప్పటికే మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు రానున్న వారం రోజుల వ్యవధిలో కోస్తాతీరంపై తుపాను ప్రభావం పడనుంది.

వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు తుపాను ముప్పు పొంచి ఉంది. ఉపరితల ఆవర్తన ద్రోణి కారణంగా మే 22వ తేదీ నాటికి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారనుంది. మరో రెండ్రోజులకు అంటే మే 24వ తేదీకు వాయగుండంగా మారనుంది. మే 22 నుంచి మే 27 మధ్యలో బలమైన తుపాను ఏర్పడే అవకాశాలున్నాయని ఐఎండీ వెల్లడించింది. ఈ తుపాను ప్రభావం కాకినాడ నుంచి విశాఖ మీదుగా పూరి వరకూ కోస్తాతీరంపై పడనుందని తెలుస్తోంది. అందుకే వచ్చేవారం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షం

ఇవాళ తిరుపతి, చిత్తూరు, కడప, సత్యసాయి,, అన్నమయ్య జిల్లాల్లో ఉరుములు మెరుపులు, తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి. కాకినాడ, అనకాపల్లి, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు, కృష్ణా, నెల్లూరు జిల్లా, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో  మోస్తరు వర్షాలు పడవచ్చు. మద్యాహ్నం తరువాత కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో వర్షం పడనుంది. 

ఉపరితల ఆవర్తనం, తుపాను ప్రభావంతో వారం రోజుల వరకూ రాయలసీమ, కోస్తాంద్ర, యానాం ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడనున్నాయి. అదే సమయంలో గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీయనున్నాయి. 

Also read: Cyclonic low Depression: బంగాళాఖాతంలో అల్పపీడన హెచ్చరిక, ఏపీలో అతి భారీ వర్షాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News