Krunal Pandya: మరోసారి తండ్రైన‌ కృనాల్ పాండ్యా.. బాబు పేరేంటో తెలుసా?

Krunal Pandya: టీమిండియా ఆల్‌రౌండ‌ర్ కృనాల్ పాండ్యా మరోసారి తండ్రయ్యాడు. కృనాల్ భార్య పంఖురి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ చిన్నారి పేరు ఏంటంటే?  

Written by - Samala Srinivas | Last Updated : Apr 26, 2024, 07:34 PM IST
Krunal Pandya: మరోసారి తండ్రైన‌ కృనాల్ పాండ్యా.. బాబు పేరేంటో తెలుసా?

krunal pandya 2nd child: లక్నో సూపర్ జెయింట్స్ ఆల్‌రౌండ‌ర్ కృనాల్ పాండ్యా(Krunal Pandya) రెండోసారి తండ్ర‌య్యాడు. కృనాల్ భార్య పంఖురి శ‌ర్మ (Pankhuri Sharma) పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డకు వాయు(Vayu) అని పేరు పెట్టారు పాండ్యా దంపతులు. కృనాల్ ఈ శుభవార్తను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. అయితే పంఖురి ఏప్రిల్ 21న బిడ్డకు జన్మనిచ్చింది, అయితే ఈ విషయాన్ని ఇవాళ బహిరంగంగా ప్రకటించింది ఈ జంట. కృనాల్, పంఖురిలు త‌మ బిడ్డను ఎత్తుకున్న ఫోటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. దీంతో వీరికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. టీమిండియా శిఖ‌ర్ ధావ‌న్, దినేశ్ కార్తిక్‌లు కృనాల్ దంపతులకు శుభాకాంక్ష‌లు తెలిపారు. 

మోడల్ అయిన పంఖూరి, కృనాల్ కొన్నాళ్లు ప్రేమించుకున్నారు. ఇరు కుటుంబాల సపోర్టుతో 2017లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ జంటకు 2022లో క‌విర్ అనే అబ్బాయి జ‌న్మించాడు. ఇప్పుడు పంఖూరి మరో బిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం ఐపీఎల్ ఆడుతూ బిజీగా ఉన్నాడు కృనాల్. బిజీగా ఉన్నాడు. అయితే తాజాగా అతడు తన భార్యను కలవడానికి వచ్చాడు. ఈ సందర్భంగా దిగిన ఫోటోను ఇన్ స్టాలో షేర్ చేయగా.. తక్కువ సమయంలోనే దానిని 60 వేల మందికి పైగా లైక్ చేశారు. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Krunal Himanshu Pandya (@krunalpandya_official)

Also Read: Kavya Maran: సన్‌రైజర్స్‌ ఘోర పరాజయం.. వైరల్ అవుతున్న కావ్య మారన్‌ రియాక్షన్‌..

కృనాల్ ఐపీఎల్ కెరీర్..
ఐపీఎల్ 2024లో కృనాల్ లక్నో తరఫున ఆడుతున్న సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో అతడు 8 మ్యాచ్‌లు ఆడి 5 వికెట్లు తీశాడు. కృనాల్ ఐదు ఇన్నింగ్స్‌ల్లో 58 పరుగులు చేశాడు. అతడి అత్యుత్తమ స్కోరు 43 పరుగులు. కృనాల్  ఇప్పటి వరకు 121 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 1572 పరుగులు చేశాడు. ఇందులో ఒక హాఫ్ సెంచరీ కూడా ఉంది. ఐపీఎల్ కెరీర్‌లో మొత్తంగా అతడు 75 వికెట్లు తీశాడు.

Also Read: T20 World Cup 2024: 'టీ20 ప్రపంచకప్‌కు భారత జట్టు ఇదే.. కార్తీక్, రాహుల్‌కు నో ఛాన్స్'

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News