Astrology: ఈ 5 రాశుల వారు చాలా తెలివైన వారు, వీరిని మోసం చేయడం చాలా కష్టం!

Astrology: కొంతమంది వ్యక్తుల్లో తెలివితేటలు అపారంగా ఉంటాయి. వీరిని మోసం చేయడం అంత సులువు కాదు. అలాంటి మేధస్సు కలిగిన 5 రాశిచక్ర గుర్తుల గురించి మాట్లాడుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 1, 2022, 02:14 PM IST
Astrology: ఈ 5 రాశుల వారు చాలా తెలివైన వారు, వీరిని మోసం చేయడం చాలా కష్టం!

Astrology: ప్రతి వ్యక్తిపై గ్రహాలు, రాశిచక్రాల ప్రభావం ఉంటుంది. ఇవి వ్యక్తి యెుక్క మేధస్సు, తెలివితేటలను ప్రభావితం చేస్తాయి. కొందరిలో తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి, వారిని మోసం చేయడం చాలా కష్టం. వీరికంటూ ప్రజల్లో ఓ గుర్తింపు ఉంటుంది. అలాంటి ఐక్యూ స్థాయి అధికంగా గల రాశులవారిని గురించి ఇప్పుడు  తెలుసుకుందాం. 

మేషం (Aries): ఆస్ట్రాలజీలో మేష రాశి వారు చాలా తెలివైన వారిగా భావిస్తారు. ఈ వ్యక్తులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటారు. ఈ రాశివారి మదిలో ఎప్పుడూ కొత్త కొత్త ఆలోచనలు మెదులుతూనే ఉంటాయి.  వీరు తమ జీవితంలో ఎల్లప్పుడూ పాజిటివ్ గా ఉంటారు. ఈ రాశివారికి నాయకత్వ లక్షణాలు ఎక్కువ. కెరీర్ లో ఉన్నతస్థాయికి చేరుకుంటారు. 

మిధునం (Gemini): మిథునరాశి వ్యక్తులు చాలా తెలివైనవారిగా పరిగణించబడతారు. ఈ రాశిచక్రం యొక్క అధిపతి బుధుడు.  ఆస్ట్రాలజీలో బుధుడు తెలివితేటలు మరియు జ్ఞానానికి కారకుడిగా భావిస్తారు.  ఈ రాశికి చెందిన వ్యక్తులు చదవడం మరియు రాయడంలో మంచి నైపుణ్యం ఉన్నవారు. వీరికి ఆఫీసులో ప్రశంసలు దక్కుతాయి. 

వృశ్చికం (Scorpio): వృశ్చిక రాశిచక్రాన్ని పాలించే గ్రహం కుజుడు. ఈ రాశి ప్రజలు అత్యంత తెలివైనవారిగా భావిస్తారు. ఈ రాశి వ్యక్తులను మోసం చేయడం చాలా కష్టం. వీరు ఏ పని చేసిన ఆలోచించే చేస్తారు. ఈ రాశివారు లగ్జరీ లైఫ్ ను గడపటానికి ఇష్టపడతారు.  

కన్య (Virgo): కన్య రాశికి అధిపతి కూడా బుధుడే. ఈ రాశివారు కూడా చాలా తెలివైన వారు. కన్యా రాశి వారు ప్రతి విషయంపై అవగాహన కలిగి ఉంటారు. వీరు ఏదైనా పని మెుదలుపడితే అది పూర్తయిన తర్వాత గానీ విడిచిపెట్టరు. ఈ రాశివారికి జాబ్ వచ్చే అవకాశం ఉంది.  

కుంభం (Aquarius): కుంభ రాశివారికి తెలివితేటలు చాలా ఎక్కువ. ఈ రాశి ప్రజలను మోసం చేయడం చాలా కష్టంగా భావిస్తారు. కుంభ రాశి వారు చాలా మొండిగా ఉంటారు. వీరు ఏది చేయాలనుకుంటే అదే చేస్తారు. ఈ రాశి వారు చాలా నిజాయితీ పరులు. 

Also Read: Sawan Purnima 2022: శ్రావణ పూర్ణిమ ఎప్పుడు? రాఖీ పండుగ ప్రాముఖ్యత ఏంటి?

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News