President Droupadi Murmu: వావ్.. ఢిల్లీలో అరుదైన ఘటన.. మెట్రోలో ప్రయాణించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..

Delhi: దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము ఢిల్లీ మెట్రోలో సందడి చేశారు. అక్కడున్న అధికారులు వెంటనే రాష్ట్రపతికి మెట్రో  సర్వీస్ తో ప్రజలకు అందిస్తున్న సదుపాయాలను గురించి వివరించారు. దీంతో అక్కడ  ఒక్కసారిగా ప్రయాణికులు భారత రాష్ట్రపతిని చూసి ఆశ్యర్యపోయారు. 

Written by - Inamdar Paresh | Last Updated : Feb 7, 2024, 02:58 PM IST
  • - మెట్రోలో జర్నీ చేసిన దేశ ప్రథమ పౌరురాలు..
    - ఆశ్చర్యపోయిన ప్రయాణికులు..
President Droupadi Murmu: వావ్.. ఢిల్లీలో అరుదైన ఘటన.. మెట్రోలో ప్రయాణించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..

Droupadi Murmu Takes A Metro Ride: సాధారణంగా దేశాధినేతలు, ఉన్నతస్థాయిలో ఉన్న అధికారులు ప్రత్యేకంగా తమ వాహనాలలో మాత్రమే పర్యటిస్తుంటారు. ఇలాంటి అధినేతలు, ఉన్నత స్థాయి హోదా ఉన్న వారు ఎక్కడికైన వస్తున్నారంటే సెక్యురిటీ సిబ్బంది చేసే ఆర్భాటాలు మాములుగా ఉండదు. ముందుగా ఆప్రాంతాన్నంతా జల్లెగ పట్టేస్తారు. అడుగడుగున కూడా సెక్యురిటీని ఏర్పాటు చేస్తారు. ఎక్కడ కూడా అవాంఛనీయం సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటారు.

.

ఒకరకంగా చెప్పాలంటే ఇలాంటి ఉన్నత స్థాయిలో ఉన్న వారు వచ్చి తిరిగి వెళ్లే వరకు కూడా సదరు సెక్యురిటీ సిబ్బంది నానా తంటాలు పడుతుంటారు. అయితే.. కొందరు ఉన్నత స్థాయిలో ఉన్న అధికారులు, దేశాధినేతలు మాత్రం ఎక్కువగా ఆర్భాటాలు చేయకుండా వచ్చి సింపుల్ గా వెళ్తుంటారు. అచ్చం ఇలాంటి ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పూర్తి వివరాలు..

దేశ రాజధాని ఢిల్లీ మెట్రోట్రైన్ లో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎప్పుడు రద్దీగా ఉండే మెట్రోల్ ప్రయాణించి అందరిని ఆశ్యర్యానికి గురిచేశారు. ఢిల్లీలో మెట్రో ట్రైన్ లో ఎప్పుడు కూడా రద్దీగా ఉంటాయి. ముఖ్యంగా మెట్రోలో జనాలు కిక్కిరిసిపోయి ఉంటారు. కొన్నిసార్లు ప్లాట్ ఫామ్ మీద వెళ్లాలంటేనే రద్దీగా ఉంటుంది. అలాంటి రద్దీగా ఉన్న ప్రాంతంలో ద్రౌపతి ముర్ము వెళ్లి అందరిని షాకింగ్ కు గురిచేశారు.

Read More: Protein Powder: ప్రొటీన్‌ పౌడర్ వల్ల కలిగే సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఇవే!

అంతే కాకుండా... ప్రత్యేకంగా మెట్రో భోగీలో ఎక్కి కొంత దూరం ప్రయాణించారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఢిల్లీ మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ ఎండీ  డాక్టర్‌ వికాస్‌ కుమార్‌ కూడా రాష్ట్రపతితో కలిసి ప్రయాణించారు. ఈ క్రమంలో.. మెట్రో అధికారులు..  రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు మెట్రో రైలు అందిస్తున్న సేవలను గురించిన వివరించారు. మెట్రో రైలులో.. చుట్టుపక్కల ఉన్న ప్రయాణికులు కూడా ఆశ్చర్యంతో చూస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
 

Trending News