Tamannaah: వెరైటీ డ్రెస్‌లో మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా అందాలు చూడ‌త‌ర‌మా.. లేటెస్ట్ పిక్స్ వైర‌ల్..

Tamannaah: తమన్నా క‌థానాయిక‌గా సినీ ఎంట్రీ ఇచ్చి త్వరలో 2 ద‌శాబ్దాలు కావొస్తోంది.  కెరీర్ మొదట్లో ఎలా ఉందో ఇప్పటికీ అదే సోయగంతో అలరిస్తోంది తమ్మూ బేబి. తన తర్వాత ఎంతో మంది హీరోయిన్స్ వస్తోన్న ఆ పోటీని తట్టుకొని నిలబడటం అంటే మాములు విషయం కాదు. ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌లతో ఈ భామ ఫుల్ బిజీగా ఉంది.

1 /6

తమన్నా అంటే ఆమె మిల్కీ  అందాలే గుర్తుకు వస్తాయి. హీరోయిన్‌గా త్వరలో 2 దశాబ్దాలు కావొస్తోంది.  అయినా.. ఇప్పటికే అదే సోయగంతో అభిమానులను కవ్విస్తోంది.

2 /6

తమన్నా మంచు మనోజ్ హీరోగా నటించిన 'శ్రీ' మూవీతో ఇంట్ర‌డ్యూస్ అయింది. అంతకు ముందు బాలీవుడ్‌లో 'చాంద్ సే రోషన్ చెహ్రా' మూవీలో నటించింది.

3 /6

ఫ‌స్ట్ మూవీ ఫెయిల్ అయినా.. త‌మ‌న్నా వెనుదిరిగి చూసుకోలేదు. తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన 'హ్యాపీ డేస్' మూవీతో తమన్నా కెరీర్ ప‌రుగులు పెట్టింది. 

4 /6

ఇక తెలుగులో సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో నాగ చైత‌న్య హీరోగా తెర‌కెక్కిన  100% లవ్,  రామ్  చరణ్‌తో చేసిన 'రచ్చ' ఎన్టీఆర్‌తో చేసిన 'ఊసరవెల్లి' సినిమాలు ఈమెను టాప్ హీరోయిన్ చైర్‌ను కట్టబెట్టాయి.

5 /6

ఇక రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ సరసన నటించిన 'బాహుబలి' మూవీతో ప్యాన్ భార‌త్‌ రేంజ్‌లో సత్తా చాటింది త‌మ‌న్నా.  

6 /6

తమన్నా కెరీర్‌లో ఎన్ని హిట్స్ కంటే ఫ్లాపులే ఉన్నాయి. అయినా.. తన గ్లామ‌ర్‌తో తన పర్సనల్ ఇమేజ్‌తో ఇప్పటికీ హీరోయిన్‌గా నెట్టుకొస్తూనే ఉంది.