Allu Arjun Movies Line up: పుష్ప 2 మూవీ త‌ర్వాత‌ అల్లు అర్జున్ లైన‌ప్ మాములు లేదుగా.. లిస్టులో ఎవ‌రెవ‌రున్నారంటే.. ?

Allu Arjun Movies Line up: అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప 2 మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. ఆగ‌ష్టు 15న ఈ సినిమాను విడుద‌ల చేస్తున్న‌ట్టు ప్ర‌క‌టించారు. సుకుమార్ త‌ర్వాత అల్లు అర్జున్ వ‌రుస‌గా క్రేజీ ద‌ర్శ‌కులతో త‌న నెక్ట్స్ ప్రాజెక్ట్స్ ప్లాన్ చేస్తున్నారు.

 

1 /5

అల్లు అర్జున్ - అట్లీ పుష్ప 2 మూవీ తర్వాత అల్లు అర్జున్.. తమిళ దర్శకుడు అట్లీతో సినిమా చేయడం దాదాపు ఖాయమనే చెబుతున్నారు. అల్లు అర్జున్ పుట్టిన‌రోజున ఈ ప్రాజెక్ట్ పై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న వెలుబడే అవ‌కాశం ఉంది.

2 /5

అల్లు అర్జున్ - త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ అటు అల్లు అర్జున్.. త‌న‌కు జులాయి, స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి, అల వైకుంఠ‌పుర‌ములో వంటి  వ‌రుస‌గా హాట్రిక్ హిట్స్ ఇచ్చిన త్రివిక్ర‌మ్‌తో సినిమా క‌న్ఫామ్ చేసారు. అట్లీ మూవీ త‌ర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లే అవ‌కాశాలున్నాయి.

3 /5

అల్లు అర్జున్ - బోయ‌పాటి శ్రీ‌ను స‌రైనోడు త‌ర్వాత మ‌రోసారి  బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో అల్లు అర్జున్ ఓ భారీ యాక్ష‌న్ మూవీ చేయ‌నున్నారు. ఇప్ప‌టికే కాంబినేష‌న్ ఓకే అయింది. ఎపుడు సెట్స్ పైకి వెళుతుందో చూడాలి.

4 /5

అల్లు అర్జున్ - సందీప్ రెడ్డి వంగా అల్లు అర్జున్ , సందీప్ రెడ్డి వంగాతో నెక్ట్స్ ప్రాజెక్ట్ ఖ‌రారైంది. ఈ సినిమా ప్ర‌భాస్‌తో స్పిరిట్, యానిమ‌ల్ పార్క్ మూవీల త‌ర్వాత ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే అవ‌కాశాలున్నాయి.

5 /5

అల్లు అర్జున్ - సురేంద‌ర్ రెడ్డి అల్లు అర్జున్, సురేందర్ రెడ్డి కాంబినేష‌న్‌లో రేసు గుర్రం మూవీ ఎంత పెద్ద బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచిందో తెలిసిందే క‌దా. ఇపుడు అదే కాంబోలో మ‌రో మూవీ ప‌ట్టాలెక్కే అవకాశాలున్నాయ‌ని స‌మాచారం.