Pediatric Strokes: మీ పిల్లలను సుకుమారంగా పెంచుతున్నారా..? తస్మాత్ జాగ్రత్త.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..

Pediatric Strokes: మనలో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను అపురూపంగా పెంచుకుంటారు. వారికి ఏమాత్రం కష్టంలేకుండా ప్రతీదీవారి వద్దకు తీసుకొస్తుంటారు. దీని వల్ల భవిష్యత్తులు అనేక సమస్యలు వస్తాయని తాజా పరిశోధనల్లో తెలింది.

  • May 09, 2024, 16:00 PM IST
1 /6

ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ పిల్లలను ఎంతో అపురూపంగా చేసుకుంటారు. చిన్న తనం నుంచి కాళ్లు కిందపెట్టితే ఎక్కడో కందిపోతారో అన్నట్లుగా వ్యవహరిస్తారు. ఏంకావాలన్న, సెకనులో తీసుకొచ్చి వారి వద్దకు పెట్టేస్తారు. ఏమాత్రం శ్రమ పడకుండా చూసుకుంటారు.

2 /6

ఉదయం లేచినప్పటి నుంచి మిల్క్ ఇవ్వడం, వారికి కావాల్సినవన్ని రెడీగా పెట్టడం చేస్తుంటారు. కనీసం బాటిల్ లలో వాటర్ నింపుకోవడం, స్కూల్ బ్యాగ్ లను కూడా నీట్ గా పెట్టుకొవడం వంటి పనులు కూడా చెప్పారు. దీంతో వారు బద్దకంగా తయారయిపోతుంటారు.

3 /6

చాలా మంది చిన్న పిల్లలు లావుగా తయారౌతారు. ఓబెసీటితో బెల్లీ ఫ్యాట్ తో ఇబ్బందులు పడుతుంటారు. పిజ్జాలు , బర్గర్ లు తింటు, పొద్దస్తమానం సోఫాలో టీవీల ముందు కూర్చుని ఉంటారు. ఈ క్రమంలో వీరిలో అనేక రకాల ఇబ్బందులు వస్తుంటాయని కూడా ఇటీవల సైంటిస్టులు గుర్తించారు.

4 /6

సైంటిస్టులు ఇటీవల సైంటిస్టులు ఒక రిపోర్టును బైటపట్టారు.  1700 మంది పిల్లలను, దాదాపు 13 ఏళ్లపాటు అబ్జర్వ్ చేశారు. వీరి డైలీ శారీరక శ్రమ, జీవన విధానంలను పరిశీలించారు. అయితే.. ఇలాంటి పిల్లలు ఎక్కువగా చిన్న తనంలోనే గుండెపోటులు, అనేక రకాలు సమస్యలకు గురైనట్లు సైంటిస్టులు తెలిపారు.

5 /6

ముఖ్యంగా ఇలాంటి చిన్నారులలో శారీరక శ్రమ లోపించి గుండె పరిమాణం పెద్దగా మారడంను కూడా సైంటిస్టులు అబ్జర్వ్ చేశారు. దీని వల్ల గుండెపోటు రావడం, చిన్నతనంలోనే అకాలమరణాల తోపాటు పారాలైసిస్ కు గురికావడం వంటి వాటిని గుర్తించారు.

6 /6

అందుకే చిన్నతనం పిల్లలను సుకుమారంగా కాకుండా.. కొన్ని పనులు చేయిస్తు ఉంటే వారు యాక్టివ్ గా ఉంటారు. చిన్న తనంనుంచి వారి మెదడు కూడా అలానే ట్యూన్ అవుతుంది. అంతేకాకుండా శారీరక శ్రమవల్ల గుండె పరిమాణం చిన్నదిగా మారుతుంది. దీని వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవంటూ కూడా సైంటిస్టులు పేర్కొన్నారు.