Betel Leaves: పరగడుపున తమలపాకులు తింటే కలిగే ఈ బెనిఫిట్స్ మీకు తెలుసా..?

Life Style: తమలపాకులు ప్రతిరోజు తినడం వల్ల మనకు పుష్కలమైన ఆరోగ్యలాభాలు కల్గుతాయి. దీన్ని భోజనం అయ్యాక చాలా మంది తింటుంటారు. దీంతో జీర్ణక్రియ సంబంధమైన ఇబ్బందులు దూరమైపోతాయి. 

1 /6

తమలపాకులు శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. దీనిలో పుష్కలమైన విటమన్ లు ఉన్నాయి. కెరోటిన్ , కాల్షియం లు కూడా అధికమోతాదులో ఉంటాయి. దీంతో ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. 

2 /6

తమల పాకులు తినడం వల్ల అజీర్తి సమస్య ఉండదు. నోటి నుంచి దుర్వాసన కూడా రాదు. అనవసర కొవ్వును తగ్గించడంలో ఇది ఎంతగానే ఉపయోగపడుతుంది. అందుకు దీన్ని తినాలంటారు.

3 /6

రక్తపోటు సమస్యలున్న వారికి బాగా పనిచేస్తుంది. పీరియడ్స్ సమస్యలున్న మహిళలకు ఇది నొప్పి నివారించేలా చేస్తుంది. నోటిలో పుండ్లు ఏర్పడకుండా చూస్తుంది. చర్మం మెరిసేలా చేస్తుంది.  

4 /6

కొందరికి శరీరంలో అధికమైన ఉష్ణోగ్రత ఉంటుంది. అలాంటి వారు ప్రతిరోజు తమలపాకును క్రమం తప్పకుండా తింటే పుష్కలమైన ఆరోగ్య లాభాలు కల్గుతాయి. శరీరం నుంచి మలినాలను చెమట రూపంలో పోయేలా చేస్తుంది..

5 /6

దగ్గు, దమ్ము వంటివి దూరమైపోతాయి. గొంతులు గర గర ఉన్న వారు ప్రతిరోజు తమలపాకులను తింటే మంచి ఔషధంగా పనిచేస్తుంది. తమలపాకును మెత్తగా చేసి గాయం ఉన్న చోట పెడితే , గాయం కూడా మానిపోతుంది. కొందరు చెవిలో దీని రసం ను కూడా వేస్తుంటారు. 

6 /6

తమలపాకులు గ్రహాదోషాలు పారద్రోలడంలో ఉపయోగపడతాయి. మంగళవారం, ఆంజనేయుడికి ఎక్కువ మంది భక్తులు తమలపాకులతో పూజలు చేస్తుంటారు. ఇలా చేస్తే నవగ్రహాదోషాలు తగ్గిపోతాయని చెబుతుంటారు. Disclaimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్నవి వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)