Cucumber: సమ్మర్ లో కీర దోసకాయలు ఎక్కువగా తింటున్నారా..?.. ఈ విషయాలు తెలుసుకొండి..

Health Benefits: చాలా మంది సమ్మర్ లో కీరదోస కాయలను ఎక్కువగా తింటారు. కీర దోసకాయలను తింటే అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇది శరీరంలోని వేడిని తగ్గిస్తుందని నిపుణులు చెబుతుంటారు

1 /6

చాలా మంది హోటళ్లలో ఏవైన ఆర్డర్ లు పెట్టగానే టమాటాలు, ఆనియన్స్, కీర దోసకాయలు ప్యాకేట్ లలో వస్తుంటారు. ఇది మనకు తెలిసిందే. కీర దోసకాయలో 95 శాతం వాటర్ ఉంటుందని చెబుతుంటారు..  

2 /6

కీరదోసను ఎక్కువగా తింటే క్రమంగా ఊబకాయం తగ్గిపోతుందని నిపుణులు చెబుతుంటారు. ప్రతిరోజు ఉదయం పూట కీర దోస లేదా దీనితో తయారు చేసిన జ్యూస్ తింటే ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనం కల్గిస్తుంది. 

3 /6

డయాబెటిక్ రోగులకు కీరదోస ఎంతో ప్రయోజనకరంగా పనిచేస్తుంది. దీనిలో మాంగనీస్, జింక్, ఫాస్పరస్, విటమిన్లు ఉంటాయి. కీరను తింటే శరీరంలో  వ్యర్థాలు మూత్రం రూపంలో బైటకు వెళ్లిపోతాయి.   

4 /6

జీర్ణసంబంధ సమస్యలు ఉన్నవారు ప్రతిరోజు తింటే ఎంతో మేలు కల్గిస్తుంది. నోటిలో పుండ్లు ఉన్న వారు, పొట్టలో పుండ్లున్నవారు కీరాను ప్రతిరోజు తింటే ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటుంది. 

5 /6

కీర దోసకాయను సాల్ట్ వేసి తినాలి. మరికొందరు కీరాను, ముఖానికి మాస్క్ లాగా పెట్టుకుంటారు. కంటి సమస్యలున్న వారు.. రాత్రిపూట కీర దోసకాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి కళ్లమీద పెట్టుకుంటే ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

6 /6

కళ్ల మీద పెట్టుకుంటే, వేడిమి నుంచి ఎంతో ఉపశమనం కల్గుతుంది. అన్నం తిన్నాక తింటే చక్కగా అరుగుతుంది. కీరను పప్పులలో, ఆవకాయలుగా, చట్నీలుగా కొందరు చేసుకుంటారు. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)