Chhattisgarh Encounter: ఎన్నికల వేళ హైటెన్షన్.. ఛత్తీస్ గఢ్ లో మరోసారి భారీ ఎన్ కౌంటర్..

Chhattiasgarh Encounter: నారాయణపూర్ జిల్లాలోని అటవీప్రాంతంలో మావోయిస్టులు, పోలీసు భద్రాతా సిబ్బందికి మధ్య భారీగా కాల్పులు జరిగాయి. ఈ కాల్పులలో ఏడుగురు మావోయిస్టుల కీలక నేతలు చనిపోయినట్లు తెలుస్తోంది. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కాల్పుల ఘటన మాత్రం తీవ్ర దుమారంగా మారింది.

Written by - Inamdar Paresh | Last Updated : Apr 30, 2024, 02:38 PM IST
  • మావోలు, భద్రత సిబ్బందికి మధ్య కాల్పులు..
  • ముందే వార్నింగ్ ఇచ్చిన అమిత్ షా..
Chhattisgarh Encounter: ఎన్నికల వేళ హైటెన్షన్.. ఛత్తీస్ గఢ్ లో మరోసారి భారీ ఎన్ కౌంటర్..

Seven maoists Killed In Chhattisgarh Encounter In Narayanapur: ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లాలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్యన భారీగా కాల్పులు సంభవించాయి. కొన్నిగంటల పాటు మావోలకు, పోలీసులకు మధ్యన ఫైరింగ్స్ జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఏడుగురు మావోయిస్టులు చనిపోయినట్లు తెలుస్తోంది. మరణించిన వారిలో ఇద్దరు మహిళా సభ్యులు కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశం నుంచి ఒక ఎకే 47తో సహా భారీ మొత్తంలో ఆయుధాలను కూడా భద్రతా సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టులు,  జిల్లా రిజర్వ్ గార్డ్ (DRG), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF) సంయుక్త భద్రతా బృందానికి మధ్య ఈ రోజు ఉదయం 6 గంటల ప్రాంతంలో భారీగా ఎన్‌కౌంటర్ జరిగిందని అధికారులు తెలిపారు.

Read More: UP Teen Collapses: టెన్షన్ పుట్టిస్తున్న ఘటనలు.. హాల్దీ వేడుకలో డ్యాన్స్ చేస్తూ చనిపోయిన యువతి..వైరల్ గా మారిన వీడియో..

నారాయణపూర్, కాంకేర్ సరిహద్దు ప్రాంతంలోని అబుజ్‌మర్‌లో మావోయిస్టుల ఆపరేషన్ కోసం భద్రతా సిబ్బంది సోమవారం తెల్లవారుజామున బయలుదేరారు.ఈ క్రమంలో.. టేక్‌మెటా,  కాకూర్ గ్రామం మధ్య అడవిలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులు మావోలకు కాల్పులతో గట్టిగానే సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. సంఘటన స్థలంలో , ఇద్దరు మహిళా మావోయిస్టులతో సహా మొత్తం ఏడుగురు మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం వీరిని గుర్తించే పనిలో ఉన్నట్లు అధికారి తెలిపారు. కాల్పులకు పాల్పడిన మావోయిస్టుల శిబిరం నుంచి భారీ మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, ఒక ఏకే 47తో సహా నిత్యావసర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు అధికారి తెలిపారు.

ఈ నెల మొదట్లో, ఛత్తీస్‌గఢ్‌లోని కంకేర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో భద్రతా బలగాలు 29 మంది మావోయిస్టులను భద్రత సిబ్బంది హతమార్చిన విషయం తెలిసిందే. ఆ తర్వాత.. ఏప్రిల్ 16న ఛోటేబెతియాలోని బినాగుండ, కొరోనార్ గ్రామాల మధ్య హపటోలా అటవీ ప్రాంతంలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఇదిలా ఉండగా.. వామపక్ష తీవ్రవాదానికి వ్యతిరేకంగా ఛత్తీస్‌గఢ్ పోరాట చరిత్రలో మావోయిస్టులు ఒకే ఎన్‌కౌంటర్‌లో మరణించిన ఇంత మంది మరణించడం ఇదే తొలిసారిగా తెలుస్తోంది. 

ఛత్తీస్‌గఢ్ మావోలకు అమిత్ షా స్ట్రాంగ్ వార్నింగ్..

కేంద్ర హోం మంత్రి అమిత్ షా గత వారం ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు గట్టి హెచ్చరిక జారీ చేసిన విషయం తెలిసిందే.  వెంటనే మావోలు లొంగిపోవాలని, లేకుంటే రాష్ట్రం నుండి నిర్మూలించబడతారని అన్నారు.  ఏప్రిల్ 22న కాంకేర్ పట్టణంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్ నాయకుడు మాట్లాడుతూ, గత నాలుగు నెలల్లోనే ఛత్తీస్‌గఢ్‌లో దాదాపు 90 మంది మావోయిస్టులు మరణించారని అన్నారు.

Read More: Chennai Child Rescued: వావ్.. అందరూ కలిసి బుడ్డోడీని భలే కాపాడారు.. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఘటన..

అంతేకాకుండా.. 123 మంది మావోయిస్టులను అరెస్టు చేయగా, మరో 250 మంది వివిధ కారణాలతో  లొంగిపోయినట్లు తెలుస్తోంది.  షా మాట్లాడుతూ.. మావోయిజం ఉన్నంత కాలం గిరిజన సోదరులు, సోదరీమణులకు విద్యుత్, పాఠశాలలు, రేషన్ దుకాణాలు, ఆసుపత్రులు అందుబాటులో ఉండవు. లొంగిపోవాలని నేను వారికి (మావోయిస్టులకు) చెప్పాలనుకుంటున్నాను, లేకపోతే పోరాట ఫలితం ఖాయమని ఆయన గతంలోనే తెల్చిచెప్పారు. 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News