Farmer Protest: ఢిల్లీలో మరోసారి హైటెన్షన్.. భారీ జేసీబీలు, లారీలతో లతో చేరుకుంటున్న రైతులు..

Delhi: రైతులు మరోసారి ఢిల్లీలోకి వెళ్లడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. అనేక ప్రాంతాల నుంచి జేసీబీలు, పెద్ద లారీలు,టిప్పర్ లలో పంజాబ్, హర్యానా బార్డర్ శంభు వద్దకు చేరుకుంటున్నారు.. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. రైతులు, పోలీసులు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.

Written by - Inamdar Paresh | Last Updated : Feb 21, 2024, 12:48 PM IST
  • - వందల ట్రాక్టర్ లు, జేసీబీలతో ఢిల్లీ బార్డర్ కు రైతులు...
    - అలర్ట్ అయిన పోలీసులు, తీవ్రమైన ట్రాఫిక్ సమస్యలు..
Farmer Protest: ఢిల్లీలో మరోసారి హైటెన్షన్.. భారీ జేసీబీలు, లారీలతో లతో చేరుకుంటున్న రైతులు..

Farmers Resume Delhi Chalo March: కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ రైతులతో చేసిన నాలుగో విడత చర్చలు కూడా విఫలమయ్యాయి. ఆదివారం రైతు నేతలతో జరిగిన నాలుగో దఫా చర్చల్లో.. రైతులతో ఒప్పందం కుదుర్చుకుని ఐదేళ్లపాటు పప్పులు, మొక్కజొన్న, పత్తిని ప్రభుత్వ సంస్థలు ఎంఎస్‌పీకి కొనుగోలు చేయాలని ముగ్గురు కేంద్ర మంత్రుల బృందం ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదన రైతులకు అనుకూలంగా లేదని రైతు నాయకులు తిరస్కరించి విషయం తెలిసిందే.  

Read More: Rusk Side Effects: మీరు రస్క్‌ తీసుకుంటున్నారా? అయితే మీరు డేంజర్ లో పడినట్టే

ఇదిలా ఉండగా.. పంజాబ్, హర్యానాల నుంచి మరోసారి రైతులు ఢిల్లీలోకి ప్రవేశించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో పంజాబ్, హర్యానా లోని శంభువద్ద తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది. పోలీసులు, రైతులపై టియర్ గ్యాస్ లను కూడా ప్రయోగించారు.  ఈక్రమంలో తీవ్ర ఘర్షణ వాతావరణం తలెత్తింది. కేంద్రం.. రైతులకు చెందిన సోషల్ మీడియా అకౌంట్లను పూర్తిగా ఇనాక్టివ్ చేయించారు.

అదే విధంగా అక్కడి ప్రాంతాలలో ఇంటర్నేట్ సేవలు కూడా నిలిపివేశారు. పప్పుధాన్యాలు, మొక్కజొన్న, పత్తిని ఐదేళ్లపాటు ప్రభుత్వ సంస్థల ద్వారా ఎమ్‌ఎస్‌పికి కొనుగోలు చేయాలన్న కేంద్రం ప్రతిపాదనను, రైతులు తిరస్కరించారు.   పంజాబ్, హర్యానా బార్డర్  లలో.. నిరసన తెలుపుతున్న రైతులు మరోసారి “ఢిల్లీ చలో” పాదయాత్రను పునఃప్రారంభించారు. తాత్కాలికంగా నీటి ట్యాంకులు, ఇనుప షీట్లతో, 14,000 మంది రైతులు హైవేపై 1,200 ట్రాక్టర్లు, జేసీబీలతో తమ ఢిల్లీ చలో మార్చ్‌ను పునఃప్రారంభించారని చెప్పారు.

‘ఢిల్లీ చలో’ మార్చ్‌లో, రైతు నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ మాట్లాడుతూ..  రైతులు లేదా యువకులు ఎవరూ ముందుకు సాగరని, నాయకులు ముందుకు సాగాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. శాంతియుతంగా వెళతామని, ఎంఎస్‌పీపై కేంద్రం చట్టం చేస్తేనే నిరసనలు విరమిస్తామని రైతు నేతలు తెల్చిచెప్పారు. పోలీసు బారికేడ్లను కూల్చివేయడానికి నిరసనకారులు తీసుకువచ్చిన పరికరాలతోరాజధానిలోకి రైతులు ప్రవేశించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. 

సుమారు 14,000 మంది రైతులు ఢిల్లీ సరిహద్దు వెంబడి 1,200 ట్రాక్టర్ ట్రాలీలు, 300 కార్లు. 10 మినీ బస్సులతో తమ నిరసనను పునఃప్రారంభించినట్లు సమాచారం. నిరసనకు ముందు, రైతులు శాంతియుతంగా ప్రదర్శన చేస్తారని కిసాన్ మజ్దూర్ మోర్చా నాయకుడు సర్వన్ సింగ్ పంధేర్ పునరుద్ఘాటించారు. బారికేడ్లను తొలగించి ఎటువంటి ఆటంకం లేకుండా ఢిల్లీకి వెళ్లడానికి అనుమతించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఇదిలా ఉండగా.. ఢిల్లీ పోలీసులు దేశ రాజధానిలో భద్రతను పెంచారు. తమ 'ఢిల్లీ చలో' ఆందోళనను కొనసాగించాలని నిరసన తెలిపిన రైతులు ప్రకటించడంతో తిక్రీ, సింగు,  ఘాజీపూర్ సరిహద్దుల వద్ద గట్టి నిఘా ఉండేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు.

Read More: Trisha: త్రిషపై అసభ్యకర కామెంట్స్ చేసిన పొలిటీషియన్.. తీవ్రంగా స్పందించిన హీరోయిన్

శాంతిభద్రతలను కాపాడేందుకు భారీ మోహరింపు చేయడంతో ఢిల్లీ-గురుగ్రామ్, ఢిల్లీ-బహదూర్‌ఘర్, అనేక ఇతర రహదారులపై ట్రాఫిక్ పూర్తిగా దెబ్బతింది. మూడు సరిహద్దుల వద్ద మోహరించిన భద్రతా సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలని మంగళవారం కోరినట్లు ఢిల్లీ పోలీసు అధికారులు తెలిపారు. రాకపోకలకు ట్రాఫిక్‌ ఇబ్బందులు తప్పవని వారు తెలిపారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News