Cholesterol Tips: కొలెస్ట్రాల్ తగ్గించే రహస్యమిదే, ఈ విత్తనాలు సేవిస్తే చాలు, అన్ని సమస్యలకు చెక్

Cholesterol Tips: శరీరంలో అత్యంత ప్రమాదకరమైంది కొలెస్ట్రాల్. నియంత్రణ ఎంత సులభమో నిర్లక్ష్యం చేస్తే అంత ప్రమాదకరం. కొలెస్ట్రాల్ సమస్య నుంచి గట్టెక్కాలంటే కొన్ని హెల్తీ సీడ్స్ డైట్‌లో చేర్చకతప్పదంటున్నారు ఆరోగ్య నిపుణులు  

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 12, 2023, 09:14 PM IST
Cholesterol Tips: కొలెస్ట్రాల్ తగ్గించే రహస్యమిదే, ఈ విత్తనాలు సేవిస్తే చాలు, అన్ని సమస్యలకు చెక్

Cholesterol Tips: ఆధునిక జీవనశైలి కారణంగా తలెత్తే వ్యాధుల్లో అతి ముఖ్యమైంది కొలెస్ట్రాల్. రక్తంతో కొలెస్ట్రాల్ పెరిగితే వివిధ రకాల వ్యాధులు చుట్టుముడతాయి. ఆ పరిస్థితి తలెత్తకుండా ఉండాలంటే సకాలంలో కొలెస్ట్రాల్ సమస్యకు చెక్ పెట్టాలి. దీనికోసం డైట్‌లో మార్పులు చేయాల్సి ఉంటుంది.

చెడు కొలెస్ట్రాల్ అనేది చాలా ప్రమాదకరం. కొలెస్ట్రాల్ నియంత్రించాలంటే డైట్‌లో మార్పులు చేర్పులు చాలా అవసరం. ముఖ్యంగా కొన్ని సీడ్స్ డైట్‌లో చేరిస్తే కొలెస్ట్రాల్ సమస్యకు చెక్ పెట్టవచ్చు. వీటిలో మొక్కల ఎదుగుదలకు కావల్సిన అన్ని పోషకాలుంటాయి. ఇందులో ఫైబర్ , మోనో శాచ్యురేటెడ్ ఫ్యాట్స్, పోలీ అన్‌శాచ్యురేటెడ్ ఫ్యాట్ , విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ సీడ్స్ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకున్న చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. కొలెస్ట్రాల్‌తో పాటు రక్తపోటు, మధుమేహం కూడా తగ్గుతాయి.

ఫ్లక్స్ సీడ్స్‌లో ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఆల్ఫా లినోలెనిక్ యాసిడ్ చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఫ్లక్స్ సీడ్స్ పేస్ట్‌గా చేసుకుని గోరు వెచ్చని నీళ్లతో రోజూ పరగడుపున తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి. కొలెస్ట్రాల్ వేగంగా కరిగిపోతుంది. 

కొలెస్ట్రాల్ తగ్గించడంలో ఉపయోగపడే మరో రకం విత్తనాలు ఆనపకాయ విత్తనాలు. చాలామంది ఆనపకాయ విత్తనాలు వ్యర్ధమనుకుని పాడేస్తుంటారు. కానీ ఆరోగ్యపరంగా ఇవి చాలా మంచివి. ఇందులో ఫైబర్, ప్రోటీన్లు, మోనోశాచ్యురేటెడ్ ఫ్యాట్, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్, మాంగనీసం, మెగ్నీషియం, ఫాస్పరస్ ఉంటాయి. ఆనపకాయ విత్తనాల్లో ఫైటోస్టెరాల్ ఎక్కువగా ఉంటుంది. కొలెస్ట్రాల్ తగ్గించేందుకు అద్భుతంగా ఉపయోగపడతాయి.

కొలెస్ట్రాల్‌ను శరవేగంగా తగ్గించే మరో పదార్ధం చియా సీడ్స్. చియా సీడ్స్ , ఫ్లక్స్ సీడ్స్ దాదాపు ఒకేలా ఉంటాయి. రెండింట్లోనూ పోషక విలువలు ఒకేలా ఉంటాయి. ఇందులో కూడా ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌తో పాటు ఇతర పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రోటీన్లు, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్, ధయామిన్ లేదా విటమిన్ బి1, మెగ్నీషియం, మాంగనీస్ పెద్దఎత్తున ఉంటాయి. అందుకే కొలెస్ట్రాల్ తగ్గించడంలో కీలకంగా ఉపయోగపడతాయి.

ఇక చివరిది నువ్వులు. నువ్వులు చాలా దేశాల్లో విరివిగా ఉపయోగిస్తుంటారు. ఇందులో కూడా పోషక విలువలు చాలా ఎక్కువ. ముఖ్యంగా ఫైబర్, ప్రోటీన్లు, మోనో అన్ శాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్, కాపర్, మాంగనీస్, మెగ్నీషియం ఉంటాయి. రోజూ వివిధ వంటల రూపంలో లేదా సలాడ్‌తో కలిపి నువ్వులు తినడం అలవాటు చేసుకుంటే శరీరంలో పేరుకున్న కొలెస్ట్రాల్ సులభంగా తగ్గుతుంది. 

Also read: High Cholesterol Symptoms: కొలెస్ట్రాల్ పెరిగితే ప్రాణాలు పోవచ్చు. ఈ లక్షణాలుంటే జాగ్రత్త

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News