Cholesterol Signs: శరీరంలోని ఈ మూడు భాగాల్లో నొప్పి తీవ్రంగా ఉంటోందా, అయితే కొలెస్ట్రాల్ ఉందని అర్ధం

Cholesterol Signs: ఆధునిక జీవన విధానంలో ఎదురయ్యే వివిధ రకాల అనారోగ్య సమస్యల్లో ఒకటి కొలెస్ట్రాల్. మధుమేహం, రక్తపోటుతో పాటు కొలెస్ట్రాల్ కూడా ప్రమాదకరమైంది. కొలెస్ట్రాల్ నిర్లక్ష్యం చేస్తే ప్రమాదకర పరిస్థితికి దారి తీయవచ్చు.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 26, 2023, 08:23 PM IST
Cholesterol Signs: శరీరంలోని ఈ మూడు భాగాల్లో నొప్పి తీవ్రంగా ఉంటోందా, అయితే కొలెస్ట్రాల్ ఉందని అర్ధం

Cholesterol Signs: అందుకే కొలెస్ట్రాల్ విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి. వాస్తవానికి అధిక రక్తపోటు, డయాబెటిస్ వంటి సమస్యలు కూడా కొలెస్ట్రాల్ వల్లనే తలెత్తుతాయి. ఒక్క కొలెస్ట్రాల్ సమస్య వివిధ రకాల అనారోగ్యాలకు కారణమౌతుంది. హార్ట్ ఎటాక్, కొరోనరీ హార్ట్ డిసీజ్, ట్రిపుల్ వెస్సెల్ వంటి ప్రాణాంతకర వ్యాధులకు దారితీస్తుంది. 

శరీరంలో గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ అని రెండుంటాయి. చెడు కొలెస్ట్రాల్ అంటే ఎల్‌డీఎల్ మంచిది కాదు. ఎల్‌డీఎల్ పెరుగుతుందంటో అప్రమత్తంగా ఉండాలని అర్ధం. శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతుంటే కొన్ని రకాల లక్షణాలు కన్పిస్తుంటాయి. శరీరంలో ఎల్‌డీఎల్, ట్రై గ్లిసరాయిడ్స్ అనేవి ఎక్కువగా ఉండకూడదు. ఇవి ఎంత ఉన్నాయనేది ఎప్పటికప్పుడు లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. ముఖ్యంగా శరీరంలోని కొన్ని భాగాల్లో నొప్పులుంటే చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందని అర్ధం. ఈ పరిస్థితుల్లో లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ ద్వారా ఎంత ఉందనేది తెలుసుకోవాలి. ఒకవేళ ఎక్కువగా ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. 

రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే ధమనుల్లో బ్లాకేజ్ ఏర్పడుతుంది. ఫలితంగా రక్తం గుండె వరకూ చేరుకోవడంతో ఒత్తిడి అధికమౌతుంది. ఫలితంగా హార్ట్ ఎటాక్ సమస్య రావచ్చు. అందుకే కొలెస్ట్రాల్ సమస్యను పెరగకముందే నియంత్రించాల్సి ఉంటుంది. ముఖ్యంగా శరీరంలోని మూడు భాగాల్లో నొప్పి ఉంటే కొలెస్ట్రాల్ లక్షణంగా పరిగణించాల్సి ఉంటుంది.  రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే తొడలు, హిప్స్, తుంటి కండరాల్లో తీవ్రమైన నొప్పి ఉంటుంది. ఫలితంగా కండరాలు పట్టేయడం జరుగుతుంది. ధమనుల్లో బ్లాకేజ్ కారణంగా రక్తం గుండె వరకే కాదు..ఇతర అంగాలకు కూడా చేరడంలో ఇబ్బంది ఎదురౌతుంది. ప్రత్యేకించి కాళ్లలో రక్తం సరిగ్గా ప్రవహించదు. అంటే ఈ ప్రాంతంలో ఆక్సిజన్ సరఫరాలో లోపం ఉంటుంది. దాంతో తీవ్రమైన నొప్పి ఉంటుంది. దీనినే పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ అంటారు. 

తొడలు, హిప్స్, తుంటి కండరాల్లో నొప్పి ఉంటే నడిచేటప్పుడు, ఏదైనా పని చేసేటప్పుడు, మెట్టెక్కేటప్పుడు సైతం ఇబ్బందులు ఎదురౌతాయి. శరీరంలోని ఈ భాగాల్లో తీవ్రమైన నొప్పి ఉండి అసౌకర్యంగా ఉంటే అది కచ్చితంగా చెడు కొలెస్ట్రాల్ అధికంగా ఉందని అర్ధం చేసుకోవచ్చు. లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించి తక్షణం వైద్యుడిని సంప్రదించాలి. కొలెస్ట్రాల్ సమస్యను ఆదిలోనే అరికడితే ఏ సమస్యా ఉండదు. లేకపోతే లేనిపోని సమస్యలు వెంటాడుతాయి.

కాలు, కాలి పాదాల్లో విపరీతమైన నొప్పి, కాళ్లు తిమ్మిరెక్కడం కాళ్లు చల్లబడిపోవడం కాలి గోర్లు రంగు మారడం, కాలి వేళ్లలో వాపు రావడం, కాళ్లు బలహీనంగా ఉండటం, కాళ్ల చర్మం రంగు మారడం ఇవన్నీ కొలెస్ట్రాల్ లక్షణాలే. ఈ సమస్యలున్నప్పుుడు వెంటనే అప్రమత్తమై వైద్యుని సలహాతో మందులు తీసుకోవాలి. 

Also read: Healthy Foods: తరచూ నీరసం బలహీనత వెంటాడుతోందా, డైట్‌లో ఈ ఫుడ్స్ చేర్చుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News