Cholesterol Types: కొలెస్ట్రాల్ అంటే ఏంటి, ఎన్ని రకాలు, ట్రై గ్లిసరాయిడ్స్, ఎల్‌డీఎల్, హెచ్‌డీఎల్ ఎంత ఉండాలి

Cholesterol Types: శరీరానికి కొలెస్ట్రాల్ చాలా అవసరం. అదే కొలెస్ట్రాల్ కారణంగా వివిధ రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. అదేంటని తికమకపడుతున్నారా..శరీరానికి కావల్సింది గుడ్ కొలెస్ట్రాల్. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 12, 2023, 11:12 PM IST
Cholesterol Types: కొలెస్ట్రాల్ అంటే ఏంటి, ఎన్ని రకాలు, ట్రై గ్లిసరాయిడ్స్, ఎల్‌డీఎల్, హెచ్‌డీఎల్ ఎంత ఉండాలి

Cholesterol Types: కొలెస్ట్రాల్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి గుడ్ కొలెస్ట్రాల్ రెండవది బ్యాడ్ కొలెస్ట్రాల్. గుడ్ కొలెస్ట్రాల్ అనేది శరీరానికి చాలా చాలా అవసరం. అదే సమయంలో చెడు కొలెస్ట్రాల్ అంటే ఎల్‌డీఎల్ ఆరోగ్యానికి మంచిది కాదు. నిత్య జీవితంలో ఎదురయ్యే వివిధ రకాల వ్యాధుల్లో కొలెస్ట్రాల్ ఒకటి. శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండె వ్యాధులు, స్ట్రోక్ సమస్య వెంటాడుతుంది. శరీరంలో అందుకే కొలెస్ట్రాల్ స్థాయి నియంత్రణలో ఉండాలి. కొలెస్ట్రాల్‌లో ఎల్‌డీఎల్, హెచ్‌డీఎల్, వీఎల్‌డీఎల్ ఎంత ఉండాలో తెలుసుకుందాం..

అసలు కొలెస్ట్రాల్ అంటే ఏంటో తెలుసుకుందాం. శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ ఓ మైనం లాంటి పదార్ధం. ఇది లివర్‌లో ఉత్పత్తి అవుతుంది. శరీరంలో కణజాలం, హార్మోన్లు, విటమిన్ డి నిర్మాణంలో దోహదపడుతుంది. హెచ్‌డీఎల్ కొలెస్ట్రాల్ శరీరానికి చాలా మంచిది. శరీరంలో వివిధ రకాల పనుల్లో దోహదం చేస్తుంది. రెండవది ఎల్‌డీఎల్ అంటే చెడు కొలెస్ట్రాల్. ఇదే అన్ని సమస్యలకు మూల కారణం.

శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్స్ ఉంటాయి. మొదటిది ఎల్‌డీఎల్ అంటే లో డెన్సిటీ లిపోప్రోటీన్. దీనికి చెడు కొలెస్ట్రాల్‌గా పరిగణిస్తారు. శరీరంలో వివిధ సమస్యలకు ఇదే కారణం. శరీరంలో ఇదెప్పుడూ మితంగానే ఉండాలి. ఎక్కువైతే వివిధ రకాల అనారోగ్య సమస్యలు ఉత్పన్నమౌతాయి. పరిమితి దాటితే లివర్ ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుంది. రక్త ప్రసరణలో కూడా ఆటంకం కలుగుతుంది. స్ట్రోక్, హార్ట్ ఎటాక్ వంటి సమస్యలకు ఇదే ప్రధాన కారణమౌతుంది.

ఇక మరొకటి హెచ్‌డీఎల్ అంటే హై డెన్సిటీ లిపోప్రోటీన్. గుడ్ కొలెస్ట్రాల్‌గా పరిగణిస్తారు. ఆరోగ్యంగా ఉండాలంటే ఇది అవసరం. గుండె వ్యాధుల ముప్పును తగ్గిస్తుంది. అదే సమయంలో లివర్‌ను ఆరోగ్యంగా ఉంచుతుంది. లివర్ ఆరోగ్యంగా ఉండటంతో శరీరంలోని మలినాలు సులభంగా బయటకు విసర్జించబడతాయి.

మరి ట్రై గ్లిసరాయిడ్స్ కొలెస్ట్రాల్ అంటే ఏంటో తెలుసా., ఇది మనం తీసుకునే వివిధ రకాల ఆహార పదార్ధాలతో ఏర్పడుతుంది. ట్రై గ్లిసరాయిడ్స్ పెరగడం మంచిది కాదు. రక్తంలో ఇది పెరగడం వల్ల హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వంటి సమస్యలు ఏర్పడతా.యి. ఇది చాలా ప్రమాదకరం. ఇది ఓ రకమైన ఫ్యాట్ అని చెప్పవచ్చు. మొత్తం శరీరంలో వేగంగా వ్యాపిస్తుంది. ఫలితంగా అధిక రక్తపోటు, డయాబెటిస్ వంటి సమస్యలకు కారణమౌతుంది.

శరీరంలో టోటల్ కొలెస్ట్రాల్ అనేది 200-239 కంటే తక్కువ ఉండాలి. హెచ్‌డీఎల్ అనేది 40-60 మధ్యలో ఉండాలి. ఇక ఎల్‌డీఎల్ 100-129 మధ్యలో ఉండాలి. ఇది 160-189 వరకూ ఉంటే ప్రమాదకర స్థాయిగా చెబుతారు. ఇక ట్రై గ్లిసరాయిడ్స్ ఎప్పుడూ 150కు తక్కువే ఉండాలి. కొంతమందిలో 200-499 మధ్యలో ఉంటాయి. ఇది అత్యంత ప్రమాదకర స్థాయి.

Also read: Black Coffee: బెడ్ కాఫీ వద్దు..బ్లాక్ కాఫీ ముద్దు. కేన్సర్‌ను సైతం నియంత్రించే బ్లాక్ కాఫీ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News