Mogalirekulu Sagar: రిలీజ్‌కు ముందే మొగ‌లి రేకులు సాగ‌ర్ మూవీకి అవార్డ్..‌ ‘ది 100’ అరుదైన ఘనత

The 100 Movie: ది 100 మూవీ విడుదలకు ముందే అరుదైన ఘనత సొంతం చేసుకుంది. దాదా సాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివ‌ల్‌లో ది 100 మూవీకి హాన‌ర‌బుల్ జ్యూరీ అవార్డు దక్కించుకుంది. మొగలి రేకులు సాగర్ హీరోగా నటించగా.. ఓంకార్ శశిధర్ దర్శకత్వం వహించారు.   

Written by - ZH Telugu Desk | Last Updated : May 4, 2024, 12:56 PM IST
Mogalirekulu Sagar: రిలీజ్‌కు ముందే మొగ‌లి రేకులు సాగ‌ర్ మూవీకి అవార్డ్..‌ ‘ది 100’ అరుదైన ఘనత

The 100 Movie: మొగలి రేకులు సీరియల్‌తో బుల్లితెరపై మంచి క్రేజ్ సంపాదించుకున్నారు ఫేమ్ ఆర్కేనాయుడు (సాగ‌ర్‌). ఆయన హీరోగా నటించిన ది 100 మూవీ త్వరలోనే ఆడియన్స్ ముందుకురానుంది. అయితే ఈ సినిమా థియేటర్లలోకి రాకముందే అవార్డులు అందుకోవడం విశేషం. ఓంకార్ శశిధర్ దర్శకత్వంలో ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను పూర్తిచేసుకుంది. త్వరంలోనే థియేట‌ర్ల‌లో రిలీజ్ కానుంది. కాగా థియేట్రిక‌ల్ విడుదలకు ముందే అవార్డులు వచ్చాయి.

Also Read: Motorola: ఫ్లిఫ్‌కార్ట్‌లో మోటోరోలా మొబైల్స్‌ డెడ్‌ చీప్‌ ధరకే పొందే గొప్ప అవకాశం!

ఇటీవ‌ల న్యూఢిల్లీలో దాదా సాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివ‌ల్ అవార్డుల ప్రదానోత్సవం గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకల్లో ది 100 మూవీకి హాన‌ర‌బుల్ జ్యూరీ అవార్డు దక్కింది. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. సినిమా విడుదలకు ముందే అవార్డు దక్కడంపై సంతోషం వ్య‌క్తం చేశారు. రీసెంట్‌గా ది 100 మూవీ టీజ‌ర్‌ను చిరంజీవి అమ్మగారు కొణిదెల అంజ‌నాదేవి విడుదల చేశారు. న‌గ‌ర శివార్ల‌లో వరుసగా హత్యలు జరుగుతుంటాయ. వీటిని ఛేదించేందుకు ఇన్వేస్టిగేషన్ ఆఫీసర్‌గా సాగ‌ర్ క‌నిపించారు. నేరాలను కట్టడిచేసేందుకు ఎంతకైనా తెగించే ఓ నిజాయితీ ఐపీఎస్ ఆఫీసర్ రోల్‌ను డిఫరెంట్‌గా చూపించారు. ఈ టీజ‌ర్‌కు మూవీ లవర్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

విక్రాంత్ అనే క్యారెక్టర్‌లో సాగ‌ర్ నటిస్తున్నారు. హీరోగా సాగ‌ర్‌ను డిఫ‌రెంట్ యాంగిల్‌లో ప్రజెంట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్‌ను మాజీ ఉప‌రాష్ట్ర‌ప్ర‌తి వెంక‌య్య‌నాయుడు రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో మిషా నారంగ్ హీరోయిన్‌గా యాక్ట్ చేస్తోంది. ధన్యా బాలకృష్ణ కీరోల్ పోషిస్తున్నారు. అర్జున్‌రెడ్డి, యానిమ‌ల్ ఫేమ్‌ హర్షవర్ధన్ రామేశ్వర్ మ్యూజిక్ అందిస్తుండగా.. శ్యామ్ కే నాయుడు సినిమాటోగ్ర‌ఫీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. రమేష్ కరుటూరి, వెంకీ పూశడపు, జె.తారక్ రామ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 
 
మొగలి రేకులు సీరియ‌ల్‌తో బుల్లితెర ప్రేక్షకులను అలరించారు సాగర్. ఈ సీరియల్‌లో యాక్టింగ్‌కు బెస్ట్ యాక్టర్‌గా నంది అవార్డు కూడా అందుకున్నారు. చక్రవాకం సీరియల్‌లో కూడా లీడ్ రోల్ పోషించారు. మ‌న‌సంతా నువ్వే, మిస్ట‌ర్ ప‌ర్‌ఫెక్ట్ సినిమాల్లో చిన్న రోల్స్ పోషించిన సాగర్.. సిద్ధార్థ్ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆయన హీరో నటించిన షాదీ ముబార‌క్ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. మూడేళ్ల తరువాత సాగర్ ది 100 మూవీలో హీరోగా నటిస్తున్నారు. తరువాత బీవీఎస్ ర‌వి బ్యాన‌ర్‌లో ఓ మూవీలో నటించనున్నారు. 

Also Read: Hamida banu: భారత్ తొలి రెజ్లర్ .. గూగుల్ డూడుల్ హమీదా భాను గురించి ఈ విషయాలు మీకు తెలుసా..?  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News