Manchu Lakshi - Adiparvam: మంచు లక్ష్మి ఆదిపర్వం పాటలపై ప్రముఖ సంగీత దర్శకులు సంచలన వ్యాఖ్యలు..

Manchu Lakshmi - Adiparvam: మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'ఆదిపర్వం'. మోహన్ బాబు కూతురుగా ఎంట్రీ ఇచ్చి ఆమె కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈమె 'ఆదిపర్వం' వంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలోని పాటలపై ప్రముఖ సంగీత దర్శకులు సంచలన వ్యాఖ్యలు చేసారు.

Last Updated : Apr 12, 2024, 03:40 PM IST
Manchu Lakshi - Adiparvam: మంచు లక్ష్మి ఆదిపర్వం పాటలపై ప్రముఖ సంగీత దర్శకులు సంచలన వ్యాఖ్యలు..

Manchu Lakshi - Adiparvam:మంచు లక్ష్మి. ముఖ్యపాత్రలో నటించిన మూవీ 'ఆదిపర్వం'. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రచార చిత్రాలకు, టీజర్, ట్రైలర్‌కు మంచి  రెస్పాన్స్ వచ్చింది.  ఈ సినిమా 'అమ్మవారి కథ, అమ్మవారిని నమ్ముకున్న ఓ భక్తురాలి కథ, ఆ భక్తురాలిని దుష్ట శక్తుల నుండి కాపాడే ఓ క్షేత్రపాలకుడి కథ. ఈ సినిమాను సంజీవ్ మేగోటి దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని  తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీలో ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కింది.  1974 నుంచి 1992 మధ్య జరిగే పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కి... రీసెంట్‌గా రిలీజైన మంచి రెస్పాన్స్ వచ్చింది.  తాజాగా ఈ చిత్రం పాటలు అన్విక ఆడియో ద్వారా విడుదలయ్యాయి. సంచలన సంగీత దర్శకులు ఆర్.పి.పట్నాయక్, ఎమ్.ఎమ్. శ్రీలేఖ, రఘు కుంచె, ఘంటాడి క్రిష్ణ పాటల వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బీజేపీ నాయకులు
 నిర్మాత చీర్ల శ్రీనివాస యాదవ్, జనసేన నాయకులు యనమల భాస్కరరావు,    'డాన్స్ మాస్టర్' సన్ రేస్, ఆల్ ఇండియా రేడియో స్టేషన్ డైరెక్టర్ వి.ఉదయ శంకర్ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు.

ఈ సినిమా మ్యూజిక్ లో భాగంగా చాలా మంది రచతలు, మ్యూజిక్ డైరెక్టర్స్ భాగస్వాములయ్యారు. ఈ సందర్బంగా ఆడియో వేడుకలో గీత రచయితలు, గాయనీగాయకులు, సంగీత దర్శకులకు సముచిత స్థానం కల్పించడమనే సత్సంప్రదయాన్ని పునః ప్రారంభించిన దర్శకనిర్మాతలకు అభినందనలు తెలియజేసారు. ఈ సినిమాలో పాటలు చాలా బాగున్నాయన్నారు.  ఈ చిత్రం సాధించే విజయంలో ఇవి తప్పకుండా ముఖ్యపాత్ర పోషిస్తాయని మిగతా అతిధులు అభిలషించారు. చిత్ర దర్శకుడు సంజీవ్ కుమార్ మేగోటి మాట్లాడుతూ..."బహు భాషల్లో రూపొందిన ఈ చిత్రం ఇంత బాగా రావడానికి మాకు సహకరించిన మా నటి మంచు లక్ష్మి గారికి ఎప్పటికీ రుణపడి ఉంటామన్నారు. మంచులక్ష్మీ, ఆదిత్య ఓం, ఎస్తర్ నోరోనా, శ్రీజిత ఘోష్,  శివకంఠంనేని , వెంకట్ కిరణ్, సత్యప్రకాష్ సహా  పలువురు భారీ తారాగణం ఈ సినిమాలో నటించారు.  దాదాపు రెండు వందలమందికి పైగా నటీనటులు ఈ చిత్రం ద్వారా చిత్రసీమకు  పరిచయం అవుతున్నారు.

Also Read: Kadiyam Srihari: కేసీఆర్‌పై కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు.. ఇదే నా ...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News