Surya Kumar Yadav: ముంబై జట్టులో కలకలం.. సూర్యకుమార్ యాదవ్ గుడ్‌బై..!

Surya Kumar Yadav Mumbai Indians: ముంబై ఇండియన్స్ జట్టులో గందరగోళం నెలకొన్నట్లు తెలుస్తోంది. హార్థిక్ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడంపై సీనియర్లు గుర్రుగా ఉన్నారు. సూర్యకుమార్ యాదవ్ వచ్చే సీజన్‌కు ముంబై ఇండియన్స్‌ను వీడే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.   

Written by - Ashok Krindinti | Last Updated : May 9, 2024, 05:35 PM IST
Surya Kumar Yadav: ముంబై జట్టులో కలకలం.. సూర్యకుమార్ యాదవ్ గుడ్‌బై..!

Surya Kumar Yadav Mumbai Indians: ముంబై ఇండియన్స్ ఈ సీజన్‌లో అన్ని జట్ల కంటే ముందుగానే ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది. ఈ సీజన్‌లో ఆడిన 12 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగింటిలో విజయం సాధించింది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో గెలుపొందితే.. టోర్నీ నుంచి కాస్త గౌరవప్రదంగా వైదొలుగుతుంది. కొత్త కెప్టెన్ హార్థిక్ పాండ్యా నాయకత్వంపై అన్ని వైపులా విమర్శలు వస్తున్నాయి. కెప్టెన్సీ పరంగా నిర్ణయాలు, వ్యక్తిగతంగా పాండ్యా ఆటతీరుపై కూడా ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. మిడిలార్డర్‌లో సూర్యకుమార్ మళ్లీ ఫామ్‌లోకి రావడం ఆ జట్టులో ఆనందాన్ని నింపింది. ఎస్‌ఆర్‌హెచ్‌పై సెంచరీతో అదరగొట్టిన సూర్య.. ముంబైకు నాలుగో విజయాన్ని అందించిన విషయం తెలిసిందే. అయితే ముంబై ఇండియన్స్ తన పట్ల వ్యవహరించిన తీరుపై సూర్య తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. వచ్చే సీజన్‌ నుంచి టీమ్‌కు గుడ్ బై చెప్పాలని నిర్ణయించుకున్నాడని ప్రచారం జరుగుతోంది.

Also Read: Jyothi Rai: బుల్లితెర నటి జ్యోతి రాయ్ అసభ్యకర వీడియోలు లీక్.. సోషల్ మీడియాలో వైరల్   

ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్‌పై సూర్యకుమార్ అసంతృప్తిగా ఉన్నాడని అంటున్నారు. హార్థిక్ పాండ్యాను టీమ్‌లోకి తీసుకురావడమే కాకుండా.. కెప్టెన్‌గా రోహిత్ శర్మను తప్పించి పాండ్యాకు అప్పగించడంపై జస్ప్రీత్ బుమ్రా, సూర్యకుమార్‌కు నచ్చలేదట. ముంబై ఇండియన్స్‌కు హిట్‌మ్యాన్‌  కెప్టెన్‌గా ఉండాలని ఈ ఇద్దరు సీనియర్లు కోరుకున్నారు. పాండ్యాను జట్టులోకి తీసుకున్నా.. కెప్టెన్సీ అప్పగించాల్సిన అవసరం ఏముందని భావిస్తున్నారు. కెప్టెన్‌ని మార్చడం పట్ల సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేసిన సందర్భాలు ఉన్నాయి. 

ఒకవేళ కెప్టెన్‌ను మార్చాలనుకుంటే టీమ్‌తో చాలా కాలంగా ఉన్న తమ ఇద్దరిని కాదని.. పక్క టీమ్‌ నుంచి తీసుకువచ్చి మరీ సారథ్య బాధ్యతలు అప్పగించడంతో సూర్యకుమార్ యాదవ్ కోపానికి కారణమైనట్లు తెలుస్తోంది. వీరిద్దరిలో ఒకరిని కెప్టెన్‌గా ఎంపిక చేసి ఉంటే.. రోహిత్ శర్మ కూడా స్వాగతించి ఉండేవాడు. డబ్బు కోసం ముంబై ఇండియన్స్‌ను వీడిన పాండ్యాను.. తిరిగి బంపర్ ఆఫర్‌ ఇచ్చి జట్టులోకి తీసుకురావడంపై బుమ్రా ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్ ద్వారా ప్రశ్నించాడు.

ఈ నేపథ్యంలోనే సూర్యకుమార్ యాదవ్ వచ్చే సీజన్‌కు ముంబై ఇండియన్స్‌ను వీడాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ వరుసలో బుమ్రా, రోహిత్ శర్మ కూడా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. సూర్యకుమార్ యాదవ్ తన పాత టీమ్ కోల్‌కతా నైట్ రైడర్స్‌లో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు అంటున్నారు. గతంలో కేకేఆర్‌ తరుఫున సూపర్ ఇన్నింగ్స్‌లు ఆడిన సూర్యను.. వేలంలో ముంబై దక్కించుకుంది. కేకేఆర్‌లో చేరేందుకు తిరిగి సూర్యను చేర్చుకునేందుకు ఆ జట్టు యాజమాన్యం కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అన్నీ కుదిరితే వచ్చే సీజన్‌లో సూర్యను కోల్‌కతా జెర్సీలో చూడొచ్చు.

Also read: Muslim Reservations: ముస్లిం రిజర్వేషన్లు తీసి ఆ వర్గాలకిచ్చేస్తాం, అమిత్ షా వివాదాస్పద వ్యాఖ్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitte

Trending News