Kannappa: ప్రభాస్ పాత్ర గురించి కీలక అప్డేట్.. శివుడిగా కాదు.. ఎలా కనిపించనున్నారంటే!

Prabhas Kannappa : ఆది పురుష్ సినిమాలో శ్రీరాముడి పాత్రలో కనిపించిన ప్రభాస్ తాజాగా ఇప్పుడు మరొక మైథాలజికల్ పాత్రలో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మంచు విష్ణు హీరోగా భక్త కన్నప్ప సినిమాలో ప్రభాస్ శివుడి పాత్రలో కనిపించబోతున్నారు అని వార్తలు వినిపించగా ఇప్పుడు ప్రభాస్ ను వేరొక పాత్ర కోసం తీసుకున్నట్టు టాక్ వినిపిస్తోంది.  

Written by - Vishnupriya Chowdhary | Last Updated : Apr 16, 2024, 11:58 AM IST
Kannappa: ప్రభాస్ పాత్ర గురించి కీలక అప్డేట్.. శివుడిగా కాదు.. ఎలా కనిపించనున్నారంటే!

Prabhas: గత కొంతకాలంగా మంచు విష్ణు కెరియర్ లో ఒక్క హిట్ సినిమా కూడా లేదు. 2022లో జిన్నా అనే సినిమాతో మరొక డిజాస్టర్ ని తన ఖాతాలో వేసుకున్న మంచు విష్ణు తాజాగా ఇప్పుడు కన్నప్ప అనే సినిమాలో టైటిల్ రోల్ లో కనిపించబోతున్నారు. ఫాంటసీ డ్రామాగా త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.

తన కెరియర్ లో మాత్రమే కాక మోహన్ బాబు ఫిలిం కెరియర్ లో కూడా భారీ బడ్జెట్ సినిమా గా రూపొందుతున్న ఈ ఎపిక్ మల్టీస్టారర్ సినిమా కోసం క్యాస్టింగ్ పనులు జరుగుతున్నాయి. తాజాగా ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించేందుకు స్టార్ నటీనటులను ఎంపిక చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 

వివరాల్లోకి వెళితే సినిమాలో మహా శివుడి పాత్రలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కనిపించనున్నరట. ఇక ప్రభాస్ సరసన పార్వతీదేవి పాత్రలో నయనతార ప్రేక్షకులకి దర్శనం ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. 

ఇప్పటికే ఆది పురుష సినిమాలో శ్రీరాముని పాత్రలో కనిపించిన ప్రభాస్ తాజాగా ఇప్పుడు ఈ సినిమా కోసం నీలకంఠుడి అవతారంలో కూడా కనిపించనున్నారని ఇండస్ట్రీ వర్గాల బోగట్ట. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో ప్రభాస్ శివుడి పాత్రలో కాకుండా నందీశ్వరుడి పాత్రలో కనిపించబోతున్నాని టాక్ వినిపిస్తోంది. అయితే నిజానికి ఈ సినిమాలో తాను నందీశ్వరుడి పాత్రలో కనిపిస్తేనే బాగుంటుంది అని ప్రభాస్ స్వయంగా చెప్పారట. 

ప్రభాస్ రిక్వెస్ట్ వల్లనే చిత్ర డైరెక్టర్ ముఖేష్ కుమార్ స్క్రిప్ట్ లో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేశారట. అయితే ఇప్పటికి ఇంకా ప్రభాస్ తాలూకా షూట్ మొదలు కాలేదు. ఈ గ్యాప్ లో ప్రభాస్ కూడా పలు సినిమాలతో బిజీ కాబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం రాజా సాబ్ సినిమా షూటింగ్ కంటే ముందు ప్రభాస్ ఈ సినిమా షూటింగ్ మీద ఎక్కువగా దృష్టి పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.

మోహన్ లాల్, శివరాజ్ కుమార్, బ్రహ్మానందం తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలలో కనిపించనున్నారు. అయితే ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉంటుందని పుకార్లు వినిపించాయి కానీ అందులో ఏమాత్రం నిజం లేదని తెలుస్తోంది.

Also read: Jagan Convoy: సీఎం జగన్‌ పర్యటనలో అపశ్రుతి.. వాహనం ఢీకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలు

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News